Begin typing your search above and press return to search.

చంద్రముఖి 2 టెన్షన్ పెట్టిస్తున్న రన్ టైం..!

అయితే రీసెంట్ గా సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న చంద్రముఖి 2 సినిమా రన్ టైం విషయంలో ఆడియన్స్ కు షాక్ ఇస్తుంది.

By:  Tupaki Desk   |   15 Sep 2023 7:11 AM GMT
చంద్రముఖి 2 టెన్షన్ పెట్టిస్తున్న రన్ టైం..!
X

18 ఏళ్ల క్రితం వచ్చిన చంద్రముఖి సినిమాకు సీక్వెల్ గా చంద్రముఖి 2 తెరకెక్కిస్తున్నారు. పి.వాసు డైరెక్షన్ లో వస్తున్న ఈ సినిమాలో రాఘవ లారెన్స్, కంగనా రనౌత్ ప్రధాన పాత్రలుగా చేస్తున్నారు. చంద్రముఖి సినిమా తెలుగులో కూడా సూపర్ హిట్ అయ్యింది. అందుకే చంద్రముఖి 2 ని కూడా తెలుగులో భారీ రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు. సెప్టెంబర్ 28న రిలీజ్ కాబోతున్న చంద్రముఖి 2 సినిమా నుంచి వచ్చిన ట్రైలర్, సాంగ్స్ ఆకట్టుకున్నాయి.

అయితే రీసెంట్ గా సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న చంద్రముఖి 2 సినిమా రన్ టైం విషయంలో ఆడియన్స్ కు షాక్ ఇస్తుంది. చంద్రముఖి 2 సినిమా 170 నిమిషాలు అంటే 2 గంటల 50 నిమిషాల దాకా రన్ టైం ఉంటుందని తెలుస్తుంది. ఎంతో గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే ఉంటే కానీ ఇంత డ్యూరేషన్ ఉన్న సినిమాలు సక్సెస్ అవ్వవు. మరి మేకర్స్ ఈ రన్ టైం ని ఎలా బ్యాలెన్స్ చేశారన్నది తెలియాల్సి ఉంది.

ఆల్రెడీ కాంచన సీరీస్ లతో హారర్ జోనర్ తో హిట్లు అందుకున్న లారెన్స్ చంద్రముఖి 2 తో మరోసారి తన సత్తా చాటాలని చూస్తున్నారు. ప్రచార చిత్రాలు సినిమాపై అంచనాలు పెంచాయి. చంద్రముఖి సినిమా టైం లో హారర్ జోనర్ సినిమాలు తక్కువ. ఇప్పుడు ఓటీటీలో కూడా భయపెట్టించే సినిమాలు వస్తున్నాయి. మరి ఆ సూపర్ హిట్ సినిమా సీక్వెల్ గా చంద్రముఖి 2 ఎలా ఆడియన్స్ ని ఎంగేజ్ చేస్తుందా అన్నది చూడాలి.

సీక్వెల్ లో రజినిని తీసుకోక పోవడం వెనుక రీజన్స్ ఏంటన్నది కూడా తెలియాల్సి ఉంది. అయితే ఈ సినిమా మొదలయ్యే టైం లోనే రజిని ఆశీస్సులతోనే లారెన్స్ మొదలు పెట్టారు. ఈ సినిమాకు ఆస్కార్ విన్నర్ కీరవాణి సంగీతం అందిస్తున్నారు. మరి ఈ చంద్రముఖి 2 ఆ చంద్రముఖి లా అలరిస్తుందా లేదా అన్నది చూడాలి. సెప్టెంబర్ 28, 29న ఆల్రెడీ రామ్ స్కంద, పెద్ద కాపు 1 సినిమాలు వస్తున్నాయి. వాటికి పోటీగా చంద్రముఖి 2 వస్తుంది. ఆ సినిమాల పోటీని తట్టుకుని సినిమా ఎంతమేరకు నిలబడుతుంది అన్నది చూడాలి. లారెన్స్ అండ్ టీం మాత్రం సినిమా పై చాలా నమ్మకంగా ఉన్నారు. అయితే రన్ టైం ఎక్కువ ఉందని ఆడియన్స్ బాధపడాల్సిన అవసరం లేదని సినిమాకు ఆ రన్ టైం అవసరమని అంటున్నారు చిత్ర యూనిట్.