Begin typing your search above and press return to search.

చంద్రముఖి2: ఫైనల్ గా పోయింది ఎంతంటే..

లారెన్స్, కంగనా రనౌత్ లీడ్ రోల్ లో పి.వాసు దర్శకత్వంలో పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా ప్రేక్షకుల ముందుకి వచ్చిన మూవీ చంద్రముఖి 2

By:  Tupaki Desk   |   17 Oct 2023 5:30 PM GMT
చంద్రముఖి2: ఫైనల్ గా పోయింది ఎంతంటే..
X

లారెన్స్, కంగనా రనౌత్ లీడ్ రోల్ లో పి.వాసు దర్శకత్వంలో పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా ప్రేక్షకుల ముందుకి వచ్చిన మూవీ చంద్రముఖి 2. సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన చంద్రముఖికి సీక్వెల్ గా ఈ చిత్రం తెరకెక్కింది. భారీ బడ్జెట్ తో లైకా ప్రొడక్షన్స్ ఈ మూవీని నిర్మించింది. అలాగే సినిమాకి గట్టిగా ప్రమోషన్స్ చేసి మరి థియేటర్స్ లోకి వదిలారు.

చంద్రముఖి 2 కంటే ముందుగానే పి.వాసు కన్నడంలో ఆప్త రక్షక 2, తెలుగులో నాగవల్లి అని సీక్వెల్స్ చేశారు. నాగవల్లి అయితే వెంకటేష్ కెరియర్ లోనే అతిపెద్ద డిజాస్టర్. అయితే ఈ కథలో చిన్న చిన్న మార్పులతో మరల దశాబ్దం తర్వాత చంద్రముఖి 2 చిత్రాన్ని పి వాసు తెరకెక్కించడం విశేషం. చంద్రముఖి మూవీ సమీపంలోకి కూడా ఈ సీక్వెల్ రాలేకపోయింది.

ఈ పాయింట్ కూడా ఆడియన్స్ ని ఎంగేజ్ చేయలేదు. కేవలం చంద్రముఖి టైటిల్ కి ఉన్న ఇమేజ్ కారణంగానే ఈ సినిమా కోలీవుడ్ లో మంచి ఓపెనింగ్స్ సొంతం చేసుకుంది. తెలుగు కూడా కొంత పర్వాలేదని విధంగా ఓపెనింగ్స్ వచ్చాయి. అయితే సినిమాకి డివైడ్ టాక్ రావడంతో ఒక్కసారిగా కలెక్షన్స్ అన్ని డ్రాప్ అయిపోయాయి. వీకెండ్ పూర్తయ్యేసరికి తెలుగుతో పాటు మిగిలినసి చోట్ల థియేటర్స్ ఖాళీ అయిపోయాయి.

తమిళనాడులో కొంత వరకు పర్వాలేదనే విధంగా కలెక్షన్స్ వచ్చాయి. ఈ సినిమా 45 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో థియేటర్స్ లోకి వచ్చింది. వరల్డ్ వైడ్ గా 51.39 కోట్ల గ్రాస్ మాత్రమే కలెక్ట్ చేసింది. షేర్ పరంగా చూసుకుంటే 25 కోట్లు వచ్చాయి. నష్టం 20 కోట్ల వరకు వచ్చింది. దీంతో మూవీ అల్ట్రా డిజాస్టర్ గా మారిందని సినీ విశ్లేషకులు చెబుతున్నారు.

ఈ ఏడాదిలో లారెన్స్ నుంచి వచ్చిన సినిమాలు కూడా నెక్స్ట్ లెవల్ డిజాస్టర్స్ గా మారాయి. లారెన్స్ ఈ ఏడాది కార్తిక్ సుబ్బరాజు దర్శకత్వంలో జిగర్తాండ 2 మూవీని రిలీజ్ చేయబోతున్నారు. ఈ సినిమాపైనే లారెన్స్ హోప్స్ అన్ని ఉన్నాయి. హిట్ మూవీ సీక్వెల్ కావడంతో పాటు లారెన్స్ కెరియర్ లో మొదటి సారిగా ఒక విలన్ తరహా లుక్స్ లో ఈ చిత్రంలో కనిపిస్తూ ఉండటం వలన సినిమాకి మంచి హైప్ ఉంది.