Begin typing your search above and press return to search.

చంద్రముఖి 2.. అక్కడ మాత్రం గట్టిగానే

కంగనా రనౌత్, రాఘవ లారెన్స్ లీడ్ రోల్ లో తెరకెక్కి ప్రేక్షకుల ముందుకి వచ్చిన చిత్రం చంద్రముఖి 2. లైకా ప్రొడక్షన్స్ భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మించింది

By:  Tupaki Desk   |   2 Oct 2023 5:01 AM GMT
చంద్రముఖి 2.. అక్కడ మాత్రం గట్టిగానే
X

కంగనా రనౌత్, రాఘవ లారెన్స్ లీడ్ రోల్ లో తెరకెక్కి ప్రేక్షకుల ముందుకి వచ్చిన చిత్రం చంద్రముఖి 2. లైకా ప్రొడక్షన్స్ భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మించింది. పి వాసు దర్శకత్వంలో చంద్రముఖికి సీక్వెల్ గా ఈ మూవీ సిద్ధమైంది. ఫస్ట్ పార్ట్ లో రజినీకాంత్ పోషించిన పాత్రని సెకండ్ పార్ట్ లో లారెన్స్ చేశారు. టైటిల్ రోల్ లో కంగనా రనౌత్ కనిపించింది. కంగనా రనౌత్ పోషించింది నిజమైన చంద్రముఖి పాత్ర అని ప్రచారం జరిగింది.

కోలీవుడ్ లో మాత్రం ఈ సినిమాపై అంచనాలు భారీగానే క్రియేట్ అయ్యాయి. ఎంఎం కీరవాణి మ్యూజిక్ అందించడంతో తెలుగునాట కొంత బజ్ క్రియేట్ అయ్యింది. గతంలో నాగవల్లి టైటిల్ తో చంద్రముఖి 2 పి వాసు తెలుగులో చేశారు. ఆ చిత్రం డిజాస్టర్ అయ్యింది. ఆ కథకి మళ్ళీ కొన్ని మార్పులు చేర్పులు చేసి తమిళంలో చంద్రముఖి 2గా చేసినట్లు తెలుస్తోంది.

సినిమా ట్రైలర్ రిలీజ్ తర్వాత కంటెంట్ చంద్రముఖి తరహాలోనే ఉందనే నెగిటివ్ టాక్ స్ప్రెడ్ అయ్యింది. అది కూడా మూవీ ఓపెనింగ్స్ డ్రాప్ అవ్వడానికి ఒక కారణం అయ్యింది. ఒక్క తమిళంలో తప్ప మిగిలిన అన్ని భాషలలో చంద్రముఖి 2 బిగ్గెస్ట్ డిజాస్టర్ గా మారింది. అసలు ఈ మూవీకి ఏ విధంగా కూడా ఆడియన్స్ కనెక్ట్ కాలేదు.

అయితే ఒక్క తమిళంలో మాత్రం చంద్రముఖి 2 మంచి వసూళ్లు రాబడుతోంది. సినిమా తమిళ్ ఆడియన్స్ కి కూడా భాగా నచ్చినట్లు కనిపిస్తోంది. అందుకే వారంతం అయ్యేసరికి 20 నుంచి 22 కోట్ల వరకు వసూళ్లు చేస్తుందని అంచనా వేస్తున్నారు. వీకెండ్ తర్వాత సోమవారం కూడా గాంధీ జయంతి సెలవు ఉంది.

ఈ కారణంగా ప్రేక్షకులు మూవీ చూడటానికి గట్టిగానే ఆసక్తి చూపిస్తున్నారు. దీంతో కలెక్షన్స్ కూడా రోజు రోజుకి పెరుగుతున్నాయి. ఇతర భాషలలో ఈ మూడు రోజుల్లోనే చంద్రముఖి 2 చాపచుట్టేసింది. తమిళంలో మాత్రం మంచి వసూళ్లు రాబడుతూ ముందుకి వెళ్తోంది.