Begin typing your search above and press return to search.

అదే నిజమైతే 'చంద్రముఖి 2' ఫిదా చేసేది!

సూపర్‌ స్టార్‌ రజినీకాంత్ నటించిన చంద్రముఖి వచ్చి ఇన్నాళ్లు అయినా కూడా ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్ర వేసి ఇంకా గుర్తు ఉంది

By:  Tupaki Desk   |   5 Sep 2023 6:53 AM GMT
అదే నిజమైతే చంద్రముఖి 2 ఫిదా చేసేది!
X

సూపర్‌ స్టార్‌ రజినీకాంత్ నటించిన చంద్రముఖి వచ్చి ఇన్నాళ్లు అయినా కూడా ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్ర వేసి ఇంకా గుర్తు ఉంది. చంద్రముఖి అనగానే కొన్ని పాత్రలు డైలాగ్స్ వెంటనే గుర్తుకు వస్తూ ఉంటాయి. ఇప్పటికి కూడా దెయ్యం సినిమా అంటే చంద్రముఖి ఇన్ పుట్స్ ను తీసుకోవడం మనం చూస్తూనే ఉంటాం. అలాంటి చంద్రముఖికి సీక్వెల్‌ రూపొందింది.

చంద్రముఖి సినిమాకు దర్శకత్వం వహించిన పి వాసు ఈ చంద్రముఖి 2 సినిమాకు దర్శకత్వం వహించాడు. రజినీకాంత్‌ కాకుండా రాఘవ లారెన్స్ ను ఈ సినిమాలో కీలక పాత్రలో చూపించబోతున్నారు. చంద్రముఖి సినిమా లో టైటిల్‌ రోల్‌ ను జ్యోతిక పోషించింది. సీక్వెల్‌ లో టైటిల్ రోల్ ను కంగనా రనౌత్ చేసింది.

సినిమా వచ్చే వారంలో విడుదల అవ్వబోతున్న నేపథ్యంలో పాన్ ఇండియా రేంజ్ లో ప్రమోషన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. తాజాగా చంద్రముఖి 2 కి సంబంధించిన ఆసక్తికర ప్రచారం ఒకటి జోరుగా సాగుతోంది. దర్శకుడు పి వాసు ఈ సినిమా కోసం మొదట సాయి పల్లవి ని సంప్రదించాడు. టైటిల్ రోల్‌ కోసం ఆమె అయితే బాగుంటుందని భావించాడట.

నిర్మాతలు మరియు లారెన్స్ కూడా సాయి పల్లవి పై ఆసక్తి చూపించారు. ఆమె కళ్ల తో నటించగలదు. అంతే కాకుండా డాన్స్ కి ప్రాముఖ్యత ఉన్న పాత్ర అవ్వడం వల్ల చంద్రముఖి పాత్రకు సాయి పల్లవి చక్కగా సూట్‌ అయ్యేది అంటూ చాలా మంది అభిప్రాయం వ్యక్తం చేశారు. ఆ సమయంలో వార్తలు వచ్చాయి కానీ పెద్దగా జనాలు పట్టించుకోలేదు.

తాజాగా చిత్ర యూనిట్‌ సభ్యులు సాయి పల్లవిని సంప్రదించిన మాట వాస్తవం అన్నట్లుగా వ్యాఖ్యలు చేశారు. అందుకే ఒక వేళ చంద్రముఖి 2 సినిమా లో సాయి పల్లవి నటించి ఉంటే కచ్చితంగా పాన్ ఇండియా ప్రేక్షకులు సినిమా ను చూసి ఫిదా అయ్యేవారని ఆమె అభిమానులు మాట్లాడుకుంటున్నారు. కంగనా నటన పరంగా పర్వాలేదు కానీ డాన్స్ తో ఎలా మెప్పించిందో చూడాలి.