Begin typing your search above and press return to search.

ట్రోల్స్ కు గురవుతున్న సూపర్ హిట్ సీక్వెల్..!

2005 లో వచ్చిన సూపర్ స్టార్ రజినికాంత్ చంద్రముఖి సినిమా సెన్సేషనల్ హిట్ గా నిలిచింది

By:  Tupaki Desk   |   5 Sep 2023 5:43 AM GMT
ట్రోల్స్ కు గురవుతున్న సూపర్ హిట్ సీక్వెల్..!
X

2005 లో వచ్చిన సూపర్ స్టార్ రజినికాంత్ చంద్రముఖి సినిమా సెన్సేషనల్ హిట్ గా నిలిచింది. పి.వాసు డైరెక్షన్లో తెరకెక్కిన ఆ సినిమా 1993లో వచ్చిన మలయాళ మూవీ మనుచిత్ర తలు సినిమాకు రీమేక్ గా వచ్చింది. చంద్రముఖిగా జ్యోతిక నటన ఆడియన్స్ ని సర్ ప్రైజ్ చేసింది. ఈ సినిమాలో నయనతార కూడా నటించింది. తమిళంలోనే కాదు తెలుగులో కూడా చంద్రముఖి సినిమా సూపర్ హిట్ అయ్యింది. ఇక ఇప్పుడు ఆ సినిమాకు సీక్వెల్ గా చంద్రముఖి 2 ని సిద్ధం చేస్తున్నారు.

పి.వాసు డైరెక్షన్లో తెరకెక్కిన చంద్రముఖి 2 సినిమాలో రాఘవ లారెన్స్ కథానాయకుడిగా నటిస్తుండగా చంద్రముఖి పాత్రలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కంగనా రనౌత్ నటిస్తుంది. రీసెంట్ గా చంద్రముఖి 2 ట్రైలర్ రిలీజైంది. ఈ ట్రైలర్ ట్రోలర్స్ కి మంచి స్టఫ్ గా మారింది. చంద్రముఖి వచ్చిన టైం లో ఈ జోనర్ సినిమాలు చాలా తక్కువ. అందుకే అంతగా ఆడియన్స్ థ్రిల్ అయ్యారు. అయితే ఇప్పుడు హారర్ థ్రిల్లర్ జోనర్ సినిమాలు చాలా వస్తున్నాయి కాబట్టి వాటి రేంజ్ దాటి చంద్రముఖి 2 ఉండాలి.

చంద్రముఖి 2 ట్రైలర్ చూస్తే ఆల్రెడీ చంద్రముఖి సినిమానే మళ్లీ తీసినట్టు ఉంది. అదీగాక రజిని ప్లేస్ లో వెట్టయ్యగా లారెన్స్ లుక్స్ కూడా అంతగా మెప్పించలేదు. చంద్రముఖిగా కంగనా కూడా సూట్ కాలేదని కామెంట్స్ వస్తున్నాయి. రావు రమేష్ మిగతా ట్రైలర్ లోని పాత్రల గురించి విపరీతమైన ట్రోల్స్ చేస్తున్నారు. మరి ఈ ట్రోల్స్ కి సినిమా సమాధానం చెబుతుందా లేదా అన్నది చూడాలి.

చంద్రముఖి తర్వాత ఆ సినిమా సీక్వెల్ గా నాగవల్లి అని వెంకటేష్ ఒక ప్రయత్నం చేశారు. ఆ సినిమాను కూడా పి.వాసు డైరెక్ట్ చేశారు. కానీ ఆ సినిమా అంతగా ప్రేక్షకాదరణ పొందలేదు. చంద్రముఖి 2 ఆడియన్స్ అంచనాలను అందుకుంటుందా ఎవర్ గ్రీన్ చంద్రముఖి రికార్డులను క్రియేట్ చేస్తుందా లేదా అన్నది చూడాలి.

కాంచన సీరీస్ లతో ఆడియన్స్ ని థ్రిల్ చేస్తూ వస్తున్న లారెన్స్ చంద్రముఖి సీక్వెల్ ఓకే చేయడం సూపర్ స్టార్ ఫ్యాన్స్ నుంచి కొంత ఇబ్బంది వస్తుందని తెలిసినా సరే రజిని పర్మిషన్ తో ఈ సినిమా చేశారని తెలుస్తుంది. చంద్రముఖి రేంజ్ లో చంద్రముఖి 2 ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తుందా లేదా అన్నది సెప్టెంబర్ 19న రిలీజ్ అయ్యాక తెలుస్తుంది.