Begin typing your search above and press return to search.

చంద్రముఖి 2.. రజినీకాంత్ ను ఫాలో అవుతున్నారా?

రజినీకాంత్ కెరీర్ లోనే వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ హిట్ సినిమాగా దీనిని చెప్పొచ్చు

By:  Tupaki Desk   |   31 July 2023 6:33 AM GMT
చంద్రముఖి 2.. రజినీకాంత్ ను ఫాలో అవుతున్నారా?
X

హిట్ అయిన సినిమాకు సీక్వెల్స్ రావడం సహజం. అయితే.. సినిమా వచ్చిన దాదాపు 17ఏళ్ల తర్వాత ఆ సినిమాకి సీక్వెల్ రావడం అనేది చాలా అరుదుగా జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు చంద్రముఖి విషయంలో అదే జరిగింది. రజినీకాంత్ కెరీర్ లోనే వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ హిట్ సినిమాగా దీనిని చెప్పొచ్చు. ఈ మూవీని అప్పట్లో అన్నిభాషల్లోనూ చిత్రీకరించారు. ఈ మూవీకి సీక్వెన్స్ గా నాగవల్లి తీశారు. రజినీకాంత్ నటించడానికి అంగీకరించకపోవడంతో, వెంకటేష్ నటించారు. కానీ అది అస్సలు ఆకట్టుకోలేదు. కాగా..ఇప్పుడు మళ్లీ చంద్రముఖి 2 పేరిట సీక్వెల్ తీస్తున్నారు.


దాదాపు 17ఏళ్ల తర్వాత ఈ సినిమాకు సీక్వెల్‌ తెరకెక్కుతుంది. లారెన్స్‌ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ చిత్రానికి పి. వాసు దర్శకత్వం వహిస్తున్నాడు. కాగా, తాజాగా ఈ మూవీ నుంచి లారెన్స్ లుక్ ని విడుదల చేశారు. లారెన్స్ రాజు గెటప్ లో కనిపిస్తున్నారు.

రాజసం ఉట్టిపడేలా ఆయన లుక్ ఉంది. అయితే, రజినీకాంత్ స్టైల్ ను ఇక్కడ ఫాలో అవుతున్నట్లు కనిపించినా ఆ రేంజ్ లో మాత్రం ఆకట్టుకోలేకపోయాడు అనే కామెంట్స్ వినపడుతున్నాయి. లారెన్స్ లుక్ పై కొందరు పాజిటివ్ గా కామెంట్స్ చేస్తుంటే, మరి కొందరు నెగిటివ్ గా కామెంట్స్ చేస్తుండటం గమనార్హం.

పి. వాస్‌ మేకింగ్‌, విజన్‌తో హార్రర్‌ సినిమాలకు ఓ బెంచ్‌ మార్క్‌ క్రియేట్‌ చేశాడు. కాగా ఇన్నాళ్లకు ఈ సినిమాకు సీక్వెల్‌ తెరకెక్కుతుంది. లారెన్స్‌ను హీరోగా పెట్టి పి.వాసు ఈ సినిమా సీక్వెల్‌ను రూపొందించాడు. ఇప్పటికే షూటింగ్‌ పూర్తిచేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం ప్యాచ్‌ వర్క్‌ పూర్తి చేసుకుంటుంది.

హార్రర్‌ కామెడీ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమా టాకీ పార్ట్‌ పూర్తయినట్లు చిత్రబృందం వెల్లడించింది. ఇక ఈ సినిమాను వినాయక చివితి సందర్భంగా సెప్టెంబర్‌ మాసంలో రిలీజ్‌ చేయాలని మేకర్స్‌ సన్నాహాలు చేస్తున్నారు. కంగానా రనౌత్‌ కీలక పాత్రలో నటించిన ఈ సినిమాలో రాధికా శరత్‌కుమర్‌, వడివేలు ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు.

ఎమ్‌.ఎమ్ కీర‌వాణి సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమా పై చిత్ర బృందం పై ప్రశంసల వర్షం కురుస్తోంది. చంద్రముఖి 2 తెలుగు, తమిళ, హిందీ, మలయాళ, కన్నడ భాషల్లో విడుదల చేయనున్నారు.