Begin typing your search above and press return to search.

చంద్ర‌మోహ‌న్ అంత్య‌క్రియ‌లు పూర్తి

ప‌లువురు సినీ ప్ర‌ముఖులు చంద్ర‌మోహ న్ కి క‌డ‌సారి వీడ్కోలు ప‌లికారు. అనంత‌రం పంజాగుట్టా స్మ‌శాన వాటిక‌లో అంత్య‌క్రియ‌లు జ‌రిగాయి.

By:  Tupaki Desk   |   13 Nov 2023 10:58 AM GMT
చంద్ర‌మోహ‌న్ అంత్య‌క్రియ‌లు పూర్తి
X

అనారోగ్యంతో క‌న్నుమూసిన చంద్ర‌మోహ‌న్ అంత్య‌క్రియ‌లు పూర్త‌య్యాయి. అంత‌కు ముందు ఆయ‌న ఇంటి నుంచి అంతిమ‌యాత్ర ప్రారంభ‌మైంది. కుటుంస‌భ్యులు..ప‌లువురు సినీ ప్ర‌ముఖులు చంద్ర‌మోహ న్ కి క‌డ‌సారి వీడ్కోలు ప‌లికారు. అనంత‌రం పంజాగుట్టా స్మ‌శాన వాటిక‌లో అంత్య‌క్రియ‌లు జ‌రిగాయి. చంద్ర‌మోహ‌న్ కి కుమారులు లేక‌పోవ‌డంతో ఆయ‌న సోద‌రుడు మ‌ల్లంప‌ల్లి దుర్గా ప్ర‌సాద్ అంతిమ సంస్కారు నిర్వ‌హించారు.

అంతిమ యాత్ర‌కు ముందు ప‌లువురు సినీ ప్ర‌ముఖులు నివాళులు అర్పించారు. న‌టులు వెంకటేష్ ..రాజ‌శేఖ‌ర్..జీవిత‌...నిర్మాత ఆదిశేష‌గిరిరావు..మాదాల ర‌వి త‌దిత‌రులు భౌతిక కాయం వ‌ద్ద అంజ‌లి ఘ‌టించారు. అలాగే చంద్ర‌మోహ‌న్ స‌న్నిహితులు..స్నేహితులు..అభిమానులు భౌతికకాయానికి నివాళులు అర్పించారు. అంతిమ యాత్ర‌లో ఆయ‌న అభిమానులు పాల్గొన్నారు. ఫిల్మ్ న‌గ‌ర్ నుంచి పంజాగుట్ట వ‌ర‌కూ అంతిమ యాత్ర సాగింది.

చంద్ర‌మోహ‌న్ మృతితో తెలుగు సినీ ప‌రిశ్ర‌మ‌లో ఒక త‌రం ముగిసిన‌ట్లు అయింది. సూప‌ర్ స్టార్ కృష్ణ స్వ‌ర్గ‌స్తులైన స‌మ‌యంలో చంద్ర‌మోహ‌న్ త‌మ త‌రం నటుల్లో నేను ఒక్క‌డినే మిగిలి ఉన్నాన‌ని బ‌రువెక్కిన హృద‌యంతో స్పందించారు. ఇప్పుడాయ‌న కాలం చేయ‌డంతో ఒక త‌రం ముగిసింది.