Begin typing your search above and press return to search.

హీరోయిన్ల ల‌క్కీ హీరో చంద్ర‌మోహ‌న్!

ఆయ‌న లో మరో ప్ర‌త్యేక‌త కూడా ఉంది. అప్ప‌ట్లో యువ‌ నాయిక‌ల‌కు చంద్ర‌మోహ‌న్ ని ల‌క్కీగా చెబుతుంటారు.

By:  Tupaki Desk   |   11 Nov 2023 7:45 AM GMT
హీరోయిన్ల ల‌క్కీ హీరో చంద్ర‌మోహ‌న్!
X

చంద్రమోహన్ గా ప్రసిద్ధులైన మల్లంపల్లి చంద్రశేఖర రావు తెలుగు సినిమా రంగంలో ఎన్నో విలక్షణమైన పాత్రలు పోషించారు. కథానాయకుడిగా 175 పైగా చిత్రాలు ..క‌మెడియ‌న్ గా..క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్ గానూ త‌న‌దైన ముద్ర వేసారు. 55 ఏళ్ల సినీ ప్ర‌యాణంలో మొత్తంగా 932 సినిమాలు చేసారు. 1966లో `రంగులరాట్నం` చిత్రంతో చంద్ర‌మోహ‌న్ సినీ ప్రస్థానం ప్రారంభ‌మైంది. నాటి నుంచి 2022 వ‌ర‌కూ ఆయ‌న ప్ర‌యాణంతో ఎంతో దిగ్విజ‌యంగా సాగింది.

నాటి..మేటి న‌టీన‌టుల‌తో క‌లిసి న‌టించిన ఓ లెజెండ్ ఆయ‌న‌. మేటిత‌రం న‌టుల‌తో ఆయ‌న ఎక్కువ‌గా కామెడీ త‌ర‌హా పాత్ర‌లు పోషించారు. వాటితోనే నేటి జ‌న‌రేషన్ యువ‌తికి ప‌రిచ‌య‌స్తులు. ఆయ‌న లో మరో ప్ర‌త్యేక‌త కూడా ఉంది. అప్ప‌ట్లో యువ‌ నాయిక‌ల‌కు చంద్ర‌మోహ‌న్ ని ల‌క్కీగా చెబుతుంటారు. `సిరిసిరిమువ్వ`లో జయప్రద.. `పదహారేళ్ళ వయసు`లో శ్రీదేవి నటజీవితం చంద్ర‌మోహ‌న్ తోనే ప్రారంభ‌మైంది. ఆ సినిమాలు మంచి విజ‌యం సాధించ‌డంతో స్టార్ హీరోయిన్ల‌గా ఓ వెలుగు వెలిగారు.

దీంతో చంద్ర‌మోహ‌న్ తో న‌టించ‌డానికి చాలా మంది హీరోయిన్లు ఆస‌క్తి చూపించేవారు. అత‌న్ని నిర్మాత‌ల హీరో అనేవారు. కేవలం విజ‌యాల‌తోనే ఆయ‌న‌కు ఈ ర‌క‌మైన గుర్తింపు ద‌క్కింది. `రంగులరాట్నం` త‌ర్వా త `సుఖ‌దు ఖాలు`(1967)..`బంగారు పిచ్చుక‌`( 1698)..`ఆత్మియులు`( 1969).. `త‌ల్లిదం డ్రులు`..`పెళ్లికూతురు`.. `బొమ్మాబొరుసా`..`రామాల‌యం`.. `కాలం మారింది`..`మేము మ‌నుషుల‌మే` ..`జీవ‌న‌త రంగాలు` ..`అల్లూరి సీతారామ‌రాజు`..`ఓ సీత క‌థ‌`..`దేవ‌దాసు` లాంటి ఎన్నో సినిమాలు చేసారు.

చంద్రమోహన్ కృష్ణా జిల్లాకు చెందిన పమిడిముక్కల గ్రామంలో 1942- మే 23న మల్లంపల్లి వీరభద్రశాస్త్రి, శాంభవి దంపతులకు జన్మించారు. ఇతని అసలు పేరు మల్లంపల్లి చంద్రశేఖర్ రావు. ఆయ‌న‌ వ్యవసాయ కళాశాల బాపట్లలో బి.యస్.సి. పూర్తిచేసారు. అనంత‌రం కొంతకాలం ఏలూరులో పనిచేశారు. సినిమాలలో నటించాలనే ఉత్సాహంతో మద్రాసు చేరి ప్రయత్నించారు.

900ల‌కు పైగా సినిమాలు చేయ‌డంతో చంద్ర‌మోహ‌న్ 1000 సినిమాలు పూర్తి చేస్తారు అనుకునే స‌మ‌యం లోనే రిటైర్మెంట్ ప్ర‌క‌టించారు. అనారోగ్యంతో వెండి తెర‌కు దూరం కావాల్సి వ‌చ్చింది. అయితే అన్ని సినిమాలు చేసినా పెద్ద‌గా ఆస్తి పాస్తులేవి సంపాదించ‌ని న‌టుడ‌ని అంటారు. 35 ఎర‌కాల ద్రాక్ష తోట‌ని సైతం అమ్మేసాన‌ని ఓ సంద‌ర్భంలో చంద్ర‌మోహ‌న్ తెలిపారు.