అనగనగనగ కథ: చంద్రబోస్ నుంచి పవర్‌ఫుల్ సాహిత్యం
నాటు నాటు కోసం బోస్ ఎంపిక చేసుకున్న తెలుగు పదాలను తెల్లోళ్లు కూడా అవలీలగా పాడుకున్నారు. అది ఆయన ఘనత. దశాబ్ధాలుగా పాటల రచనలో ఆయన అనుభవం సమున్నతమైనది.
By: Tupaki Desk | 18 Jun 2025 9:56 PM ISTRRR `నాటు నాటు` ప్రపంచవ్యాప్త గుర్తింపు పొందడం వెనక, భారతదేశానికి ఆస్కార్ ని అందించడం వెనక ఎం.ఎం.కీరవాణితో కలిసి పని చేసిన బృందంలో కీలక వ్యక్తి, ఆ పాటను రాసిన సీనియర్ లిరిసిస్ట్ చంద్రబోస్. ఆయన సాహిత్యంలో పదజాలం సార్వజనీనతతో మ్యాజిక్ చేస్తుంది గనుకే ఈ రోజు అంతటి గుర్తింపు. నాటు నాటు కోసం బోస్ ఎంపిక చేసుకున్న తెలుగు పదాలను తెల్లోళ్లు కూడా అవలీలగా పాడుకున్నారు. అది ఆయన ఘనత. దశాబ్ధాలుగా పాటల రచనలో ఆయన అనుభవం సమున్నతమైనది.
ఇప్పుడు అదే అనభవంతో ఆయన రాసిన ఓ పాట ప్రజల హృదయాలను గెలుచుకుంటోంది. అది `కుబేర` కోసం ``అనగనగ కథ.. అందరికీ తెలిసిన కథ...`` సాంగ్. డబ్బు కేంద్రంగా సాగే ఈ పొలిటికల్ డ్రామా థీమ్ ని ఈ పాట ఎలివేట్ చేస్తోంది. చంద్రబోస్ చాలా పవర్‌ఫుల్ పదజాలాన్ని ఉపయోగించి పాటను అద్భుతంగా రాసారు. ఎదిగేవాడిని తొక్కేవాడి కథ, పేదలు బలహీనుల కథ, అంతం లేని అరాచకుల కథ ఎలా ఉంటుందో ఆయన వర్ణించిన తీరు ఉత్కంఠను పెంచుతోంది. రాక్ స్టార్ దేవీశ్రీ ప్రసాద్ సంగీతం, బోస్ సాహిత్యం కార్తీ, కరీముల్లా ఎనర్జిటిక్ గానం కూడా పెద్ద ప్లస్. కమ్ముల నిజ జీవితం సంఘటనల ఆధారంగా కొన్ని సన్నివేశాల్ని ఇందులో చూపిస్తున్నారన్న గుసగుస ఉంది. ఈ సీజన్ లో మోస్ట్ అవైటెడ్ చిత్రంగా రానున్న కుబేరకు సాహిత్యం, సంగీతం ప్రధాన అస్సెట్ కానున్నాయి.
ఈ పాన్-ఇండియన్ చిత్రంలో ధనుష్ ప్రధాన పాత్రను పోషిస్తుందగా, నాగార్జున అక్కినేని, రష్మిక ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. శేఖర్ కమ్ముల దర్శకుడు. ఈ చిత్రం సెన్సార్ ఫార్మాలిటీలను పూర్తి చేసుకుంది. 181 నిమిషాలు - అంటే మూడు గంటల ఒక నిమిషం నిడివితో యుఏ సర్టిఫికేట్ పొందింది. ప్రమోషనల్ మెటీరియల్ ఇప్పటికే ప్రేక్షకులలో ఆసక్తిని రేకెత్తించింది. బుకింగ్‌లు బావున్నాయన్న టాక్ ఉంది. సునీల్ నారంగ్ - పుస్కుర్ రామ్ మోహన్ రావు ఈ చిత్రాన్ని నిర్మించారు.
