Begin typing your search above and press return to search.

మిమిక్రీతో సంపాదించి సూప‌ర్‌స్టార్ ఇల్లు కొనేసింది!

పాపుల‌ర్ హిందీ హీరోయిన్ అలియా భట్ ని ఇమ్మిటేట్ చేస్తూ మిమిక్రీ వీడియోల‌తో వైరల్ అయిన 24 ఏళ్ల చాందినీ ముంబై ఫ్లాట్‌ను కొనుగోలు చేసిందనే వార్త సంచ‌ల‌న‌మైంది.

By:  Tupaki Desk   |   12 Feb 2024 11:30 AM GMT
మిమిక్రీతో సంపాదించి సూప‌ర్‌స్టార్ ఇల్లు కొనేసింది!
X

ఆమె ఒక సాధారణ మిమిక్రీ ఆర్టిస్ట్. ముఖ్యంగా ఆలియా భ‌ట్ ని ఇమ్మిటేట్ చేస్తుంది. అలా ఇమ్మిటేట్ చేసిన వీడియోల‌కు భారీ ఫాలోయింగ్ ఏర్ప‌డింది. సోష‌ల్ మీడియా ట్రెండ్ లో మిమిక్రీ ఆర్టిస్ట్ బాగానే ఆర్జిస్తోంది. అంతేకాదు.. ఇప్పుడు అలా ఆర్జించిన సొమ్ముతో ఏకంగా బాలీవుడ్ సూప‌ర్ స్టార్ అక్ష‌య్ కుమార్ ఇంటినే కొనుగోలు చేసేయ‌డం ముంబై మీడియాలో చ‌ర్చ‌నీయాంశ‌మైంది.

పాపుల‌ర్ హిందీ హీరోయిన్ అలియా భట్ ని ఇమ్మిటేట్ చేస్తూ మిమిక్రీ వీడియోల‌తో వైరల్ అయిన 24 ఏళ్ల చాందినీ ముంబై ఫ్లాట్‌ను కొనుగోలు చేసిందనే వార్త సంచ‌ల‌న‌మైంది. చాందినీ భబ్దా త‌న ప్ర‌తిభ‌తో ఒక్కో పైసా పోగేసి, ఇల్లు కొనడానికి ప్ర‌య‌త్నించింది. డబ్బును పొదుపు చేస్తున్నందున త‌న‌ ఎంపికల విష‌యంలో ఎంత జాగ్ర‌త్త‌గా ఉందో కూడా వెల్ల‌డించింది.

గతంలో నటుడు అక్షయ్ కుమార్ సొంతం చేసుకున్న ఇంటిని కొనుగోలు చేసాక‌.. గృహ‌ప్ర‌వేశ‌ వేడుకకు సంబంధించిన ఫోటోల‌ను ఇన్ స్టాలో షేర్ చేసింది. ముంబై ప‌శ్చిమాన‌ శివార్లలోని అంధేరిలో భాబ్దా రుణం తీసుకుని ఈ అపార్ట్‌మెంట్ ని కొనుగులో చేసింది. ప్ర‌స్తుతం EMIలు (ఈక్వేటెడ్ నెలవారీ వాయిదాలు) చెల్లిస్తున్నాన‌ని ఆమె తెలిపింది. వందలాది మంది ఆమె అనుచరులు, తోటి కంటెంట్ సృష్టికర్తలు ఈ ఇంటి కొనుగోలు విష‌యంలో ఆమెను అభినందించారు.

తన అపార్ట్‌మెంట్ ఇంటీరియర్ గురించిన వీడియోలు, ఫోటోల‌ను త్వరలోనే షేర్ చేస్తాన‌ని కూడా భాబ్దా అన్నారు. రాజస్థానీ హంగులను తన ఇంటికి తీసుకురావాలని యోచిస్తున్నట్లు భబ్దా చెప్పారు. రాజస్థాన్, ఫర్నీచర్ దిగ్గజం IKEA ముంబైలోని క్రాఫోర్డ్ మార్కెట్ వంటి స్థానిక మార్కెట్‌లను సందర్శించి తన ఇంటికి వస్తువులను కొనుగోలు చేయాలని యోచిస్తున్నట్లు చెప్పారు. ఇందులో హై-ఫై అలంకరణ ఉండదని ఆమె చెప్పారు.

ఈ ఇల్లు కొనుగోలు చేసాక త‌న‌ కుటుంబం మొత్తం చాలా సంతోషంగా ఉంద‌ని, నా విష‌యంలో చాలా గర్వంగా ఉంద‌ని ఇన్‌స్టా స్టోరీస్‌లోని వీడియోలో తెలిపింది. ప్ర‌జ‌లు సెలవులు తీసుకొని ఇతర దేశాలకు ప్రయాణించడాన్ని చూసినప్పుడు నాకు అలా చేయాల‌ని అనిపించింది. నేను విదేశీ ట్రిప్ లు వెళ్లాలనుకున్నాను కానీ వెళ్ళలేదు. ఎందుకంటే నేను పొదుపు చేస్తున్నాను.. నిరంతరం పొదుపు చేస్తున్నాను. నేను సంతృప్తి చెందే ప‌ని కోసం ఈ పొదుపు" అని తెలిపింది. గృహ‌ప్ర‌వేశానికి ముందు నగరంలోని ముంబా దేవి ఆలయంలో ప్రార్థన చేస్తున్న ఫోటోలను కూడా ఆమె షేర్ చేసారు.