Begin typing your search above and press return to search.

సింహం సెట్స్ లో ఆట‌ప‌ట్టించిందా?

అయితే సినిమా సెట్స్ లో బాల‌య్య‌-చాందిని కలిసి ప్రాంక్ లు సైతం చేసారుట‌. ఆ విష‌యాన్ని చాందిని చౌద‌రి తెలిపింది.

By:  Tupaki Desk   |   11 Jun 2024 9:47 AM GMT
సింహం సెట్స్ లో ఆట‌ప‌ట్టించిందా?
X

న‌ట‌సింహ బాల‌కృష్ణ వ్య‌క్తిగ‌తంగా ఎలా ఉంటారు? అన్న‌ది అంద‌రి తెలిసిందే. సెట్స్ లో ఎంత స‌ర‌దాగా ఉంటారో? తేడా జరిగితే అత‌డి రియాక్ష‌న్ కూడా అంతే వైలెంట్ గా ఉంటుంది. బాల‌య్య మూడ్ ఎప్పుడు ఏర‌కంగా ఉంటుందో? చెప్ప‌డం క‌ష్టం. అందుకే అత‌నితో కొంద‌రు చాలా జాగ్ర‌త్త‌గా వ్య‌వ‌హ‌రిస్తారు. అలాగే అత‌నితో ప‌నిచేసిన ద‌ర్శ‌కులు గానీ, నిర్మాత‌లుగానీ, న‌టీన‌టులు గానీ మ‌ళ్లి తిరిగి ఎప్పుడు ప‌నిచేస్తామా? అన్న వాతావ‌ర‌ణాన్ని క్రియేట్ చేయ‌డం అన్న‌ది బాల‌య్య‌కే ద‌క్కుతుంది.

అంత గొప్ప వాతావ‌ర‌ణాన్ని సెట్స్ లో క‌ల్పిస్తుంటారు. ప్ర‌స్తుతం బాల‌య్య క‌థానాయ‌కుడిగా బాబి ద‌ర్శ‌క‌త్వంలో 109వ సినిమా తెర‌కెక్కుతోన్న సంగ‌తి తెలిసిందే. ఇందులో ఓ కీల‌క పాత్ర‌లో చాందిని చౌద‌రి కూడా న‌టిస్తోంది. అయితే సినిమా సెట్స్ లో బాల‌య్య‌-చాందిని కలిసి ప్రాంక్ లు సైతం చేసారుట‌. ఆ విష‌యాన్ని చాందిని చౌద‌రి తెలిపింది. సెట్స్ లో ఇద్ద‌రు క‌లిసి మిగ‌తా వారిపై ప్రాంక్ లు చేసేవాళ్ల మ‌ని..అవి ఎంతో స‌ర‌దాగా ఉండేవని అంది.

బాల‌య్య అంద‌రితో స‌ర‌దాగా క‌లిసిపోతారని...స్టార్ అనే ఫీలింగ్ ఎక్క‌డా ఉండ‌ద‌ని అభిప్రాయ‌ప‌డింది. అలాగే సినిమాలో ఓ ప‌వ‌ర్ ఫుల్ పాత్ర పోషిస్తుందిట‌. చాలా కాలం త‌ర్వాత స్టార్ హీరో సినిమాలు చేయ‌డం సంతోషంగా ఉందంది. షూటింగ్ కూడా 50 శాతం పూర్త‌యింద‌ని రివీల్ చేసింది. జూన్ 10 బాల‌య్య బ‌ర్త్ డే సంద‌ర్భంగా సింహంతో దిగిన కొన్ని ఫోటోలు కూడా షేర్ చేసుకున్న సంగ‌తి తెలిసిందే.

ఈ సినిమాపై మంచి అంచ‌నాలున్నాయి. ఇప్ప‌టికే బాల‌య్య వ‌రుస‌గా నాలుగు విజ‌యాలు అందుకు న్నాడు. అఖండ‌, వీర‌సింహారెడ్డి, భ‌గ‌వంత్ కేస‌రి తో హ్యాట్రిక్ న‌మోదు చేసాడు. 109వ సినిమా కూడా విజ‌యం సాధిస్తే డ‌బుల్ హ్యాట్రిక్ పై గ‌ట్టిగానే గురిపెడ‌తారు.