Begin typing your search above and press return to search.

9ఏళ్ల తర్వాత తెలుగమ్మాయికి సక్సెస్

ఆ తర్వాత మహేశ్ బాబు బ్రహ్మోత్సవంలో క్యామియో రోల్ చేసింది. అలా చిన్నచిన్న సినిమాలు చేసుకుంటూ రాణిస్తోంది.

By:  Tupaki Desk   |   11 March 2024 4:18 AM GMT
9ఏళ్ల తర్వాత తెలుగమ్మాయికి సక్సెస్
X

చాందినీ చౌదరి.. యూట్యూబ్ లో షార్ట్ ఫిల్మ్స్ చేస్తూ కెరీర్ స్టార్ చేసింది ఈ బ్యూటీ. దాదాపు పదేళ్ల క్రితం మధురం షార్ట్ ఫిల్మ్ తో కుర్రకారు గుండెల్ని పిండేసింది. అందులో చాందిని తన లుక్స్, యాక్టింగ్, మేకోవర్తో ఓ రేంజ్ లో ఆకట్టుకుంది. ఇప్పటికీ ఆ షార్ట్ ఫిల్మ్ ఎవర్ గ్రీనే. ఆ తర్వాత కేటుగాడు మూవీతో సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ ఇచ్చిందీ తెలుగు అందం. 2015లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.


ఆ తర్వాత మహేశ్ బాబు బ్రహ్మోత్సవంలో క్యామియో రోల్ చేసింది. అలా చిన్నచిన్న సినిమాలు చేసుకుంటూ రాణిస్తోంది. కొవిడ్ టైమ్ లో ఓటీటీలోకి వచ్చిన బ్లాక్ బస్టర్ హిట్ అయిన కలర్ ఫొటో సినిమాలో యాక్ట్ చేసినా అంత గుర్తింపు సంపాదించుకోలేకపోయింది. తమిళంలో ఇటీవల సబా నాయగన్ తో ఎంట్రీ ఇచ్చినా మెప్పించలేకపోయింది. అందం, టాలెంట్ రెండూ ఉన్నా అనుకున్నంత స్థాయిలో బడా సినీ అవకాశాలు దక్కించుకోలేకపోయింది.

ఇప్పుడు ఆరేళ్ల క్రితం తాను గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన గామి మూవీతో ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చింది. శివరాత్రి కానుకగా విడుదలైన ఈ సినిమాలో హీరో విశ్వక్ సేన్ తో సమానంగా డాక్టర్ జాహ్నవి పాత్రలో యాక్ట్ చేసింది. ఇప్పుడు తన నటనకు మూవీ లవర్స్ తోపాటు క్రిటిక్స్ నుంచి ప్రశంసలు కురుస్తున్నాయి. జాహ్నవి రోల్ లో చాందిని అదరగొట్టేసిందని నెటిజన్లు చెబుతున్నారు. పాత్రలో ఒదిగిపోయిందని అంటున్నారు.

అయితే గామి సినిమా షూటింగ్ టైమ్ లో చాందిని కష్టాలను విశ్వక్ ఇటీవల బయటపెట్టిన విషయం తెలిసిందే. గడ్డ కట్టే చలిలో చాందిని తనతోపాటు నటించిందని విశ్వక్ చెప్పారు. వాష్ రూమ్ లేకపోవడం వల్ల వాటర్ కూడా తాగకుండా షూటింగ్ పూర్తిచేసేదని గుర్తు చేసుకున్నారు. షూటింగ్ టైమ్ లో ఆమె చాలా రిస్క్ తీసుకున్నట్లు చెప్పారు. అప్పుడు చాందిని పడ్డ కష్టానికి ఇప్పుడు ఫలితం దక్కుతుందని అంటున్నారు ఫ్యాన్స్.

ప్రస్తుతం చాందిని.. నందమూరి బాలకృష్ణ అప్కమింగ్ మూవీ NBK 109లో ఓ కీలక పాత్ర పోషిస్తోంది. ఆమె రోల్ కు సంబంధించిన పూర్తి వివరాలు బయటకు రానప్పటికీ.. డైరెక్టర్ బాబీ చాందిని పాత్రను సూపర్ గా డిజైన్ చేశారట. బాలయ్యతో మంచి బాండింగ్ ఉన్న రోల్ ను చాందిని చేస్తోందట. మరి గామితో 9ఏళ్ల తర్వాత సక్సెస్ అందుకున్న చాందినీ చౌదరి.. ఫ్యూచర్ లో ఎలాంటి అవకాశాలు అందుకుంటుందో చూడాలి.