Begin typing your search above and press return to search.

అదరగొట్టిన అనిరుధ్... షారుఖ్ స్టన్నింగ్ రియాక్షన్!

తాజాగా ఈ పాటను మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రీ క్రియేట్ చేశారు. కీబోర్డ్ ప్లే చేస్తూ, చెలియా సాంగ్ పాడాడు. చాలా అద్భుతంగా ఆలపించి, ఈ పాటను సోషల్ మీడియాలో షేర్ చేశాడు.

By:  Tupaki Desk   |   15 Sep 2023 6:10 PM GMT
అదరగొట్టిన అనిరుధ్... షారుఖ్ స్టన్నింగ్ రియాక్షన్!
X

బాలీవుడ్ బాద్షా షారూక్ ఖాన్ హీరోగా నటించిన చిత్రం జవాన్. ఈ మూవీ ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ మూవీకి తమిళ డైరెక్టర్ అట్లీ దర్శకత్వం వహించాడు. ఈ మూవీ బాక్సాఫీసు వద్ద కాసల వర్షం కురిపించింది. పఠాన్ తర్వాత షారూక్ ఈ హిట్ అందుకున్నాడు. ఈ మూవీ విజయం సాధించడంతో, ఆనందంలో మునిగి తేలుతున్నాడు. ఈ మూవీ క్లిక్ అవ్వడానికి డైరెక్షన్ స్క్రీన్ ప్లే తో పాటు, మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ అందించిన సంగతం కూడా ప్రధాన ఆకర్షణగా నిలిచాయి.

ముఖ్యంగా చెలేయా పాట విపరీతంగా ఆకట్టుకుంది. ప్రతి ఒక్కరూ ఇన్ స్టాగ్రామ్ లో ఈ పాటకు స్టెప్పులు వేసినవారే. ఆఖరికి డైరెక్టర్ అట్లీ భార్య, స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్ కూడా డ్యాన్స్ వేశారు. ఈ పాటలోని ఐకానిక్ స్టెప్స్ సేమ్ టూ సేమ్ దించేశారు. కాగా, తాజాగా ఈ పాటను మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రీ క్రియేట్ చేశారు. కీబోర్డ్ ప్లే చేస్తూ, చెలియా సాంగ్ పాడాడు. చాలా అద్భుతంగా ఆలపించి, ఈ పాటను సోషల్ మీడియాలో షేర్ చేశాడు.

'చాలా రోజులైంది. మీరు ఎంతగానో అభిమాంచిన చలేయా పాటతో మీ ముందుకు వచ్చాను' అంటూ తన వీడియోకి క్యాప్షన్ కూడా పెట్టేశాడు. కాగా, అనిరుధ్ చేసిన ట్వీట్ వెంటనే నెట్టింట వైరల్ గా మారింది. ఈ ట్వీట్ కి ఏకంగా షారూక్ ఖాన్ కూడా స్పందించారు. ' నువ్వు ఈ పాట పాడితే నేను డ్యాన్స్ వేస్తా. ఒకవేళ నేను స్టెప్ రాంగ్ గా వేస్తే, దానికి తగినట్లు రిథమ్ మార్చ, అప్పుడు నా డ్యాన్స్ కూడా అందరికీ నచ్చుతుంది.' అంటూ షారూక్ కూడా ట్వీట్ చేశారు.

అయితే, ఆ ట్వీట్ లో షారూక్ , అనిరుధ్ ని బేటా అంటూ ప్రేమగా పిలవడం విశేషం. ఇదిలా ఉండగా, ఇప్పుడు వీరిద్దరి సంభాషణ నెట్టింట వైరల్ గా మారింది. ఇక జవాన్ మూవీ సెప్టెంబర్ 7వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

ఇదిలా ఉండగా, ప్రస్తుతం దక్షిణాదిన టాప్ సినిమాలు అన్నింటికీ మ్యూజిక్ అనిరుధ్ అందిస్తుండటం విశేషం. రీసెంట్ గా రజినీకాంత్ నటించిన జైలర్ మూవీకి కూడా అనిరుధే మ్యూజిక్ అందించాడు. జైలర్, జవాన్ ఈ రెండు సినిమాల హిట్ అవ్వడానికి అనిరుధ్ మ్యూజిక్ కూడా ఒక కారణం అని చెప్పడం లో అతిశయోక్తి లేదు.