Begin typing your search above and press return to search.

దూత..చైతు గేమ్ ఛేంజర్

అక్కినేని నాగచైతన్య - దర్శకుడు విక్రమ్‌ కె.కుమార్‌ల కాంబినేషన్‌లో 'దూత' వెబ్‌సిరీస్‌. మనం, థ్యాంక్‌ యూ వంటి చిత్రాల తర్వాత ఈ ఇద్దరి కలయికలో రూపొందిన మూడో ప్రాజెక్ట్‌ ఇది.

By:  Tupaki Desk   |   2 Nov 2023 8:44 AM GMT
దూత..చైతు గేమ్ ఛేంజర్
X

అక్కినేని నాగచైతన్య - దర్శకుడు విక్రమ్‌ కె.కుమార్‌ల కాంబినేషన్‌లో 'దూత' వెబ్‌సిరీస్‌. మనం, థ్యాంక్‌ యూ వంటి చిత్రాల తర్వాత ఈ ఇద్దరి కలయికలో రూపొందిన మూడో ప్రాజెక్ట్‌ ఇది. భిన్నమైన హారర్‌ కథాంశంతో తెరకెక్కించారు. అయితే ఎంతో కాలంగా రిలీజ్​కు నోచుకుని ఈ సిరీస్​ ఎట్టకేలకు డిసెంబర్​ 1 నుంచి అమెజాన్ ప్రైమ్​ వీడిలో స్ట్రీమింగ్​కు రెడీ అవుతోందని సమాచారం అందింది.

అయితే నాగచైతన్య.. కెరీర్ ప్రస్తుతం డౌన్​ స్టేజ్​లో ఉన్న సంగతి తెలిసిందే. వరుస పరాజయాలను అందుకుంటున్నారు. లవ్ స్టోరీ, బంగార్రాజు చిత్రాల తర్వాత చైతూ సరైన హిట్​ను అందుకోలేదు. ఆయన చేసిన థ్యాంక్యూ, లాల్ సింగ్ చద్దా, రీసెంట్​గా వచ్చిన కస్టడీ అన్నీ చిత్రాలు దారుణంగా డిజాస్టర్​గా నిలిచాయి.

దీంతో ఆయన చాలా గ్యాప్ తీసుకుని ఆచితూచి తన ప్రేమమ్ వంటి క్లాసిక్ హిట్ ఇచ్చిన చందూ మొండేటితో ఓ సినిమా చేస్తన్నారు. బతుకు తెరువు కోసం గుజరాత్‌లోని వీరవల్‌కు వెళ్లి సముద్రవేట చేస్తూ పాకిస్థాన్‌ కోస్టుగార్డులకు చిక్కిన మత్స్యకారుల ఇతివృత్తం ఆధారంగా సినిమాను తెరకెక్కిస్తున్నారు. అయితే ఈ చిత్రం ఇంకా సెట్స్​పైకి కూడా వెళ్లలేదు. ఒకవేళ త్వరలోనే వెళ్లినా ఈ సినిమా షూటింగ్​ పూర్తి చేసుకుని, థియేటర్లలోకి రావడానికి కాస్త ఎక్కువే సమయం పడుతుంది.

ఈ లోగా చైతూ క్రైమ్​ థ్రిల్లర్​ దూత ప్రేక్షకుల ముందుకు రావడం మంచి విషయమే! ఒకవేళ ఇది మంచి రెస్పాన్స్​ అందుకుంటే.. వరుస ఫ్లాపుల్లో ఉన్న చైతూకు కాస్త ఉపశమనం కలిగి నట్టవుతుంది. అంతే కాకుండా రాబోయే NC23 మార్కెట్ కు కూడా హెల్ప్ అవుతుంది. అసలే అది పాన్ ఇండియా మూవీ. ఇక

లాంగ్​ గ్యాప్​ ఇవ్వకుండా చైతూ తన ఫ్యాన్స్​ను అలరించినట్టు కూడా అవుతుంది.

అదే తేడా కొడితే మాత్రం.. మరో డిజాస్టర్​ను వరుసగా ఖాతాలో వేసుకున్నట్టే. చూడాలి మరి ఏం జరుగుతుందో.. ఇక దూత సిరీస్​ విషయానికొస్తే.. ఇందులో చైతన్య సరసన ఇద్దరు కథానాయికలు కనిపించనున్నారు. వీరిలో ఒకరు కోలీవుడ్‌ భామ ప్రియా భవానిశంకర్‌, మరో పాత్రలో మలయాళీ నటి పార్వతి తిరువోతు నటిస్తున్నారు. ఇంకా ప్రాచీ దేశాయ్​, తరుణ్​ భాస్కర్​ కూడా కీలక పాత్ర పోషిస్తున్నారు.