Begin typing your search above and press return to search.

తండేల్.. సముద్రం మద్యలో చైతూ సాహసం

సక్సెస్ ఫెయిల్యూర్స్ తో సంబంధం లేకుండా డిఫరెంట్ సినిమాలు చేస్తున్న అతికొద్ది మంది యువ హీరోలలో నాగచైతన్య ఒకరు.

By:  Tupaki Desk   |   26 Dec 2023 4:26 AM GMT
తండేల్.. సముద్రం మద్యలో చైతూ సాహసం
X

సక్సెస్ ఫెయిల్యూర్స్ తో సంబంధం లేకుండా డిఫరెంట్ సినిమాలు చేస్తున్న అతికొద్ది మంది యువ హీరోలలో నాగచైతన్య ఒకరు. ఈ అక్కినేని అబ్బాయి నెక్స్ట్ తన 23వ సినిమా తండేల్ తో ఒక సరికొత్త ప్రపంచాన్ని చూపించబోతున్నాడు. ఇప్పటివరకు తన కెరీర్ లో ఎప్పుడు లేనంత మాస్ లుక్ తో పాటు బలమైన ఏమోషన్ ను చూపించబోతున్నాడు.


ఇక టాలెంటెడ్ యువ దర్శకుడు చందూ మొండేటి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా గాసిప్స్ తోనే హై రేంజ్ లో బజ్ క్రియేట్ చేసింది. సినిమాలో సాయి పల్లవి కథానాయికగా నటిస్తున్న విషయం తెలిసిందే. టాప్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణలో గీతా ఆర్ట్స్‌పై భారీ కాన్వాస్‌పై బన్నీ వాసు ఈ చిత్రాన్ని పాన్ ఇండియా రేంజ్ కు తగ్గట్టుగా నిర్మిస్తున్నారు.

ఇక తండేల్ రెగ్యులర్ షూటింగ్ కొద్ది రోజుల క్రితం ఉడిపిలో ప్రారంభమైంది. అలాగే ఈ సుదీర్ఘ షెడ్యూల్‌ లో టీమ్ కొన్ని కీలకమైన సన్నివేశాలు యాక్షన్ భాగాలను షూట్ చేయబోతోంది. ప్రస్తుతం సముద్రం మధ్యలో కొన్ని ఆసక్తికరమైన సీన్స్ ను చిత్రీకరిస్తున్నారు. టీమ్ షేర్ చేసిన ఫోటోలో నాగ చైతన్య డైనమిక్ గా కనిపిస్తున్నాడు. సముద్రం వైపు వెళుతూ కనిపిస్తున్న చైతు నెవ్వర్ బిఫోర్ అనేలా హైలెట్ అయ్యాడు.

ఇక ఈ షెడ్యూల్ అనంతరం మేకర్స్ త్వరలో మరికొన్ని ఆసక్తికరమైన అప్డేట్స్ కూడా అందించబోతున్నారు. పూర్తి మేకోవర్‌ ను చేంజ్ చేసిన నాగ చైతన్య ఈ సినిమాలో మునుపెన్నడూ లేని గెటప్‌లో కనిపించనున్నాడు. షూట్ ప్రారంభించడానికి ముందు ప్రత్యేకంగా శిక్షణ తీసుకున్న నాగచైతన్య వర్క్ షాప్ లో కూడా పాల్గొన్నారు. యదార్థ సంఘటనల ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో నాగ చైతన్య సరసన సాయి పల్లవి హీరోయిన్‌గా నటిస్తోంది.

ఈ సినిమాకు ప్రముఖ టెక్నీషియన్స్ వర్క్ చేస్తున్నారు. కథలో సంగీతానికి మంచి స్కోప్ ఉన్నందున, నేషనల్ అవార్డ్ విజేత స్వరకర్త రాక్‌స్టార్ దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తుండగా శ్రీనాగేంద్ర తంగాల ఆర్ట్ డైరెక్టర్ గా షామ్‌దత్ సినిమాటోగ్రాఫర్ గా వర్క్ చేస్తున్నారు. ఇక 2018లో సముద్రంలో వేటకు వెళ్లిన శ్రీకాకుళం మత్స్యకారులు పాకిస్తాన్ కోస్ట్ గోర్డ్ లకు ఎలా బందీలుగా దొరికారు? దాదాపు సంవత్సరం పాటు జైలులో ఎలా ఉన్నారు? అనే అంశాల నేపథ్యంలో ఈ సినిమాను రూపొందిస్తున్నారు.