Begin typing your search above and press return to search.

చైతూ వస్తున్నాడు.. మరి సామ్‌ ఎప్పుడో?

డిసెంబర్‌ నెలలో ధూత వెబ్‌ సిరీస్ ను అమెజాన్ ప్రైమ్‌ ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలు ఉన్నాయి అంటూ ప్రచారం జరుగుతోంది.

By:  Tupaki Desk   |   1 Nov 2023 5:19 AM GMT
చైతూ వస్తున్నాడు.. మరి సామ్‌ ఎప్పుడో?
X

టాలీవుడ్‌ హీరోలతో పాటు ఇతర భాషల హీరోలు చాలా మంది కూడా వెబ్ సిరీస్ లు చేయడం మొదలు పెట్టారు. కానీ ఎక్కువ శాతం మంది సక్సెస్ ను దక్కించుకోవడం లో విఫలం అయ్యారు. నాగ చైతన్య హీరోగా వరుస సినిమాలు చేస్తూ విక్రమ్‌ కే కుమార్‌ దర్శకత్వంలో 'ధూత' అనే వెబ్‌ సిరీస్ ను చేయడం జరిగింది. ఆ వెబ్‌ సిరీస్ ను అమెజాన్ చాలా రోజుల క్రితమే షూటింగ్‌ పూర్తి అయిందని ప్రకటించడం జరిగింది.

నాగ చైతన్య మరియు విక్రమ్‌ కుమార్‌ కాంబినేషన్ లో వచ్చిన థాంక్యూ సినిమా నిరాశ పరిచిన కారణంగా ఈ వెబ్‌ సిరీస్ ను వాయిదా వేస్తూ వస్తున్నారనే టాక్‌ వినిపించింది. ఈ ఏడాది ఆరంభం నుంచి అదుగో ఇదుగో అంటూ వాయిదా వేస్తూ వచ్చిన ఈ వెబ్‌ సిరీస్ ను ఎట్టకేలకు ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు సిద్ధం అవుతున్నట్లు సమాచారం అందుతోంది.

డిసెంబర్‌ నెలలో ధూత వెబ్‌ సిరీస్ ను అమెజాన్ ప్రైమ్‌ ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలు ఉన్నాయి అంటూ ప్రచారం జరుగుతోంది. అమెజాన్ ఎప్పుడైనా స్ట్రీమింగ్‌ కి రెండు వారాల ముందు అధికారికంగా ప్రకటన చేస్తుంది. కనుక ధూత విషయంలో కూడా అలాగే ఉంటుందా లేదంటే ముందు ప్రకటిస్తుందా చూడాలి.

నాగ చైతన్య వెబ్‌ సిరీస్‌ తో పాటు సమంత వెబ్‌ సిరీస్ సిటాడెల్ కోసం తెలుగు ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇంగ్లీష్ లో సూపర్‌ హిట్ అయిన సిటాడెల్‌ ను హిందీ లో సమంత చేయడం ద్వారా అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. ఈ సిరీస్ కోసం సమంత బోల్డ్‌ సన్నివేశాల్లో నటించడం తో పాటు యాక్షన్ సన్నివేశాల్లో కూడా నటించింది.

నాగ చైతన్య ధూత మరియు సమంత సిటాడెల్ సిరీస్‌ లను అమెజాన్ స్ట్రీమింగ్‌ చేయకుండా ఫ్యాన్స్ ను వెయిట్‌ చేయిస్తూ ఉన్నారు. ఎట్టకేలకు ధూత సిరీస్‌ ను స్ట్రీమింగ్‌ చేసేందుకు రెడీ అవుతున్న అమెజాన్ వారు సమంత 'సిటాడెల్‌' ను ఎప్పటికి స్ట్రీమింగ్‌ చేస్తారో అంటూ అంతా కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.