Begin typing your search above and press return to search.

థ్రిల్లర్ సీక్వెల్.. చైతు మాటతో కన్ఫ్యూజన్ తీరినట్లే..

టాలీవుడ్ యంగ్ హీరో అక్కినేని నాగ చైతన్య.. ప్రస్తుతం తండేల్ మూవీతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే.

By:  Tupaki Desk   |   5 April 2024 9:16 AM GMT
థ్రిల్లర్ సీక్వెల్.. చైతు మాటతో కన్ఫ్యూజన్ తీరినట్లే..
X

టాలీవుడ్ యంగ్ హీరో అక్కినేని నాగ చైతన్య.. ప్రస్తుతం తండేల్ మూవీతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. చందూ మొండేటి తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తుండగా.. ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఎప్పటికప్పుడు షూటింగ్ అప్డేట్స్ ఇస్తూ.. సినిమాపై మంచి హైప్ క్రియేట్ చేస్తున్నారు మేకర్స్. ఉత్తరాంధ్ర కు చెందిన కొందరు మత్స్యకారుల నిజ జీవితం ఆధారంగా ఈ చిత్రం రూపొందుతోంది.

అయితే ఈ మూవీ కన్నా ముందు దూత వెబ్ సిరీస్ తో సూపర్ హిట్ కొట్టారు నాగచైతన్య. విక్రమ్ కె కుమార్ తెరకెక్కించిన ఈ హారర్ థ్రిల్లర్ వెబ్ సిరీస్.. అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అయ్యి అదిరిపోయే రెస్పాన్స్ అందుకుంది. అనేక రికార్డులు సృష్టించింది. కొన్ని నెలలపాటు ట్రెండింగ్ నెం.1లో నిలిచింది. దీంతో ఆడియన్స్.. ఈ సిరీస్ సీక్వెల్ కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నారు. త్వరలోనే దూత-2 రానుందని ఆ మధ్య వార్తలు కూడా వచ్చాయి.

కానీ ఇటీవల జరిగిన అమెజాన్ ప్రైమ్ వీడియో ఈవెంట్ లో దూత-2 గురించి ఎలాంటి ప్రకటన రాకపోవడంతో ఫ్యాన్స్ అంతా నిరాశ వ్యక్తం చేశారు. తాజాగా నాగచైతన్య దూత-2 గురించి హింట్ ఇచ్చారు. ఆ సిరీస్ టీమ్ తో దిగిన పిక్ ను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. "దూత విజయం పిలుపు! ఇది చాలా సంతృప్తికరంగా ఉంది! త్వరలో మరిన్నిటి కోసం ఎదురు చూస్తున్నాను" అని ట్వీట్ చేశారు.

దీంతో త్వరలోనే దూత-2 అధికారిక అప్డేట్ రానుందని ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. ఈ సిరీస్ లో పార్వతి, ప్రాచీ దేశాయ్, ప్రియా భవానీ శంకర్ ముఖ్య పాత్రల్లో నటించారు. విక్రమ్ కుమార్ తన మార్క్ ను చూపించారు. చైతూతో తీసిన థాంక్యూ మూవీ ఫ్లాప్ అయినా.. ఈ సిరీస్ తో మాత్రం అందరి దృష్టిని ఆకర్షించారు డైరెక్టర్ విక్రమ్. ఇంతకముందు ఆయన అక్కినేని కుటుంబంతో మనం మూవీ తీసిన విషయం తెలిసిందే.

ఇక దూతలో నాగచైతన్య ఓ పత్రిక ఎడిటర్ సాగర్ వర్మగా కనిపించారు. అనుకోని పరిస్థితుల్లో భవిష్యత్తులో జరగబోయే హత్యల వివరాలు తెలుసుకుంటారు. ఆ తర్వాత మర్డర్లకు సాక్షిగా మారుతారు. దీంతో ఆయన ఫ్యామిలీ ఇబ్బందుల్లో పడుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందనేది సిరీస్. ఇక దూత సీజన్ 2లో ఎలాంటి థ్రిల్లింగ్ సీన్స్ ఉంటాయో, అఫీషియల్ అప్డేట్ ఎప్పుడు వస్తుందోనని ప్రేక్షకులు వెయిట్ చేస్తున్నారు.