Begin typing your search above and press return to search.

మరదలు పెళ్లిలో కనిపించి షాక్ ఇచ్చిన చైతూ...!

విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం ప్రస్తుతం చందూ మొండేటి దర్శకత్వంలో నాగ చైతన్య సినిమా చేసేందుకు రెడీ అవుతున్నాడు.

By:  Tupaki Desk   |   27 Oct 2023 11:04 AM GMT
మరదలు పెళ్లిలో కనిపించి షాక్ ఇచ్చిన చైతూ...!
X

టాలీవుడ్‌ స్టార్‌ హీరో వెంకటేష్ రెండో కూతురు హయ వాహిని వివాహ నిశ్చితార్థం తాజాగా వైభవంగా జరిగింది. సినీ ప్రముఖులతో పాటు రాజకీయ రంగానికి చెందిన వారు కూడా చాలా మంది ఈ వివాహ నిశ్చితార్థ వేడుకలో పాల్గొన్నారు. ఈ నిశ్చితార్థం సందర్భంగా చాలా మంది సెలబ్రెటీలు ఎదురు పడటం.. అందుకు సంబంధించిన ఫోటోలు వీడియోలు వైరల్‌ అవ్వడం జరిగింది.

ఇదే వేడుకలో పాల్గొన్న టాలీవుడ్‌ యంగ్‌ స్టార్ హీరో అక్కినేని నాగ చైతన్య తన లుక్స్ తో అక్కడికి వచ్చిన వారిని మరియు మీడియా వారిని కూడా ఆశ్చర్యానికి గురి అయ్యాడు. వెంకీ మామ కూతురు అయిన మరదలు హయ వాహిని వివాహ నిశ్చితార్థ వేడుకలో నాగ చైతన్య కనిపించింది కొద్ది సమయం అయినా కూడా ఆయన లుక్‌, మరియు ఈ మధ్య కాలంలో ఆయన మారిపోయిన తీరు అందరికీ ఆశ్చర్యం ను కలిగిస్తుంది.

ఫిజిక్ విషయంలో పెద్దగా మార్పులు కనిపించకున్నా కూడా లైట్‌ గా మార్పులు వచ్చినట్లుగా క్లోజ్ గా అబ్జర్వ్‌ చేసిన వారు అంటున్నారు. ఇక పొడవాటి జుట్టు తో చైతూ మొదటి సారి సర్‌ ప్రైజ్ చేశాడు. అంతే కాకుండా నాగ చైతన్య గుబురు గడ్డంతో కూడా నాగ చైతన్య కనిపించి చాలా మందిని ఆశ్చర్యపరిచాడు. ఈ కొత్త లుక్ ఏంటి అంటూ ఆయన్ను చాలా మంది ప్రశ్నించారట.

విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం ప్రస్తుతం చందూ మొండేటి దర్శకత్వంలో నాగ చైతన్య సినిమా చేసేందుకు రెడీ అవుతున్నాడు. ఆ సినిమా కోసమే ఈ కొత్త లుక్ ను చైతూ ట్రై చేస్తున్నాడు. మత్స్యకారుడి పాత్ర లో నాగ చైతన్య కనిపించబోతున్నాడు.

శ్రీకాకుళం జిల్లాలో జరిగిన వాస్తవిక సంఘటనల ఆధారంగా, అక్కడి మత్స్యకారుల జీవితాల గురించి ఒక మత్స్యకారుడి గా చూపించేందుకు గాను నాగ చైతన్య సిద్ధం అయ్యాడు. చందూ మొండేటి గత సినిమా ఫలితం నేపథ్యం లో ఈ సినిమా ను పాన్ ఇండియా రేంజ్ లో విడుదల చేస్తారట. ఇక ఈ సినిమా షూటింగ్‌ పూర్తి అయ్యే వరకు చైతూ మరే సినిమాకు కమిట్‌ అవ్వడనే వార్తలు వస్తున్నాయి.