Begin typing your search above and press return to search.

చైతూ- శోభిత.. కొత్త మ్యాటరేంటి?

అక్కినేని ఫ్యామిలీ నుంచి వచ్చిన ఆయన.. టాలీవుడ్ లో తనకంటూ స్పెషల్ ఇమేజ్ సొంతం చేసుకున్నారు.

By:  Tupaki Desk   |   22 April 2024 10:49 AM GMT
చైతూ- శోభిత.. కొత్త మ్యాటరేంటి?
X

సెలబ్రిటీల్లో చాలా మంది సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉంటారు. కొందరు డైలీ అప్డేట్స్ ఇస్తుంటే.. ఇంకొందరు అప్పుడప్పుడు తమ ఫ్యాన్స్ ను పలకరిస్తుంటారు. మరికొందరైతే సోషల్ మీడియాకు పెద్దగా ఇంపార్టెన్స్ ఇవ్వరు. నెట్టింట చాలా తక్కువగా కనిపిస్తుంటారు. అలాంటి వారిలో యంగ్ హీరో నాగచైతన్య ఒకరు. అక్కినేని ఫ్యామిలీ నుంచి వచ్చిన ఆయన.. టాలీవుడ్ లో తనకంటూ స్పెషల్ ఇమేజ్ సొంతం చేసుకున్నారు.

కొన్నేళ్ల క్రితం స్టార్ హీరోయిన్ సమంతను నాగ చైతన్య పెళ్లి చేసుకోవడం, ఆ తర్వాత ఇద్దరూ విడాకులు తీసుకోవడం అందరికీ తెలిసిందే. ఇక విడాకుల తర్వాత ఇద్దరూ తమ తమ పర్సనల్ లైఫ్ లో బిజీ అయ్యారు. అయితే నాగచైతన్య.. యంగ్ హీరోయిన్ శోభితా ధూళిపాళ్లతో ప్రేమలో ఉన్నారని ఎప్పటి నుంచో వార్తలు వస్తున్నాయి. ఆ మధ్య వీరిద్దరూ కలిసి వెకేషన్ కు వెళ్లినట్లు ఫోటోలు కూడా వైరల్ అయ్యాయి.

కొన్నేళ్లుగా చైతూ, శోభిత డేటింగ్ లో ఉన్నట్లు చెబుతుంటారు నెటిజన్లు. కానీ వీరిద్దరూ ఎప్పటికప్పుడు ఆ రూమర్లును ఖండిస్తూనే ఉంటారు. తాజాగా మరోసారి వీరిద్దరి మధ్య ఏదో ఉందనే ప్రచారం జోరుగా జరుగుతోంది. అందుకు కారణం ఒకే ఒక్క లైక్. చైతన్య ఇటీవల ఇన్ స్టాలో సన్ సెట్ ను ఎంజాయ్ చేస్తున్న పిక్ షేర్ చేశారు. ఆ ఫోటోకు శోభిత వెంటనే లైక్ కొట్టింది. దీంతో ఇప్పుడు ఆ లైక్ హాట్ టాపిక్ గా మారింది.

అదితి- సిద్ధార్థ్ లా వీరిద్దరూ కూడా సడెన్ షాక్ ఇస్తారని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. ఆ ఫోటో శోభితానే తీసి ఉంటుందని అంటున్నారు. ఇద్దరూ కలిసే వెళ్లి ఉంటారని చెబుతున్నారు. అయితే లైక్ కొట్టినంత మాత్రాన.. డేటింగ్ లో ఉన్నారనడం కరెక్ట్ కాదని కొందరు నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. ఏదైనా ఈ విషయంపై చైతూ, శోభిత క్లారిటీగా స్టేట్ మెంట్ ఇవ్వాలని అభిప్రాయపడుతున్నారు.

ఇక విడాకుల తర్వాత నాగ చైతన్య, సమంత సింగిల్ గానే ఉంటున్నారు. సమంత త్వరలో సిటాడెల్ హనీ బన్నీ వెబ్ సిరీస్ తో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక చైతూ తండేల్ మూవీతో బిజీగా ఉన్నారు. చందూ మొండేటి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా 2024లో విడుదల కానుంది. ఈ మూవీలో నేచురల్ బ్యూటీ సాయి పల్లవి హీరోయిన్ గా యాక్ట్ చేస్తోంది. మరి సామ్, చైతూ తమ కొత్త ప్రాజెక్టులతో ఎలాంటి హిట్లు అందుకుంటారో చూడాలి.