Begin typing your search above and press return to search.

నెంబర్ 1 ట్రెండింగ్ లో దూత..!

నాగ చైతన్య డిజిటల్ ఎంట్రీ గ్రాండ్ సక్సెస్ అయ్యింది. ఈమధ్య స్టార్ హీరోలు సినిమాలతో పాటుగా వెబ్ సీరీస్ లను కూడా చేస్తున్నారు.

By:  Tupaki Desk   |   15 Dec 2023 10:18 AM GMT
నెంబర్ 1 ట్రెండింగ్ లో దూత..!
X

నాగ చైతన్య డిజిటల్ ఎంట్రీ గ్రాండ్ సక్సెస్ అయ్యింది. ఈమధ్య స్టార్ హీరోలు సినిమాలతో పాటుగా వెబ్ సీరీస్ లను కూడా చేస్తున్నారు. తెలుగులో స్టార్స్ వెబ్ సీరీస్ మీద అంతగా ఆసక్తి చూపించట్లేదు. అయితే అక్కినేని హీరో నాగ చైతన్య మాత్రం తన డిజిటల్ డెబ్యూ ఇచ్చేశాడు. ప్రైమ్ వీడియోస్ లో నాగ చైతన్య నటించిన దూత వెబ్ సీరీస్ రీసెంట్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. నాగ చైతన్యతో మనం, థాంక్యు సినిమాలు చేసిన విక్రమ్ కె కుమార్ ఈ సీరీస్ డైరెక్ట్ చేశారు.

సీరీస్ లో జర్నలిస్ట్ గా నటించిన నాగ చైతన్య మంచి పర్ఫార్మెన్స్ తో మెప్పించారు. దూత సీరీస్ ప్రైమ్ వీడియో వారు నిర్మించారు. ఈ సీరీస్ నెంబర్ 1 ట్రెండింగ్ లో ఉంది. రిలీజైన నాటి నుంచి దూత మంచి వాచ్ అవర్స్ ని సంపాదిస్తుంది. ఆకట్టుకునే కథ, దర్శకత్వం, మంచి పర్ఫార్మెన్స్ తో వచ్చిన దూత సీరీస్ ప్రేక్షకులను ఇంప్రెస్ చేసిన సూపర్ న్యాచురల్ థ్రిల్లర్ గా ఆదరణ పొందుతుంది.

జర్నలిస్ట్ సాగర్ పాత్రలో నాగ చైతన్య తన పెర్ఫార్మెన్స్ తో ఆకట్టుకోగా ప్రేక్షకుల నుంచి మంచి అప్రిసియేషన్ అందుకుంటున్నారు. నేషనల్ అవార్డ్ విన్నింగ్ డైరెక్టర్ విక్రమ్ కె కుమార్ ఈ సీరీస్ ను ఎంతో ఫోకస్డ్ గా తెరకెక్కించారు. ప్రియా భవాని శంకర్, ప్రాచి తిరువొతు, ప్రాచి దేశాయ్ నటించిన దూత వెబ్ సీరీస్ 240 కంట్రీస్ లో తెలుగుతో పాటుగా తమిళ, హిందీ, కన్నడ, మలయాళం భాషల్లో రిలీజైంది.

థియేటర్ కి వెళ్లి సినిమా చూసే ఆడియన్స్ కన్నా ఓటీటీలో రిలీజైన వెబ్ సీరీస్ ల మీద ప్రేక్షకులు ఆసక్తి చూపిస్తున్నారు. ఇక వాటిలో ఏమాత్రం కథ కథనాలు బాగున్నట్టు అనిపించినా సీరీస్ లను సూపర్ హిట్ చేస్తున్నారు. నాగ చైతన్య దూత విషయంలో కూడా అది ప్రూవ్ అవుతుంది. దూత సీరీస్ సెకండ్ సీజన్ కూడా ఉంటుందని తెలుస్తుంది. ఏది ఏమైనా టాలీవుడ్ స్టార్స్ చేస్తున్న వెబ్ సీరీస్ లు కూడా డిజిటల్ స్ట్రీమింగ్ లో మంచి ఫలితాన్ని అందిస్తున్నాయి.