Begin typing your search above and press return to search.

దెయ్యాలంటే చైత‌న్య‌కి అంత భ‌య‌మా

ఈ నేప‌థ్యంలోనే మ‌రోసారి అదే ఫ్యామిలీ హీరోతో వెబ్ సిరీస్ ని తెర‌కెక్కించారు.

By:  Tupaki Desk   |   30 Nov 2023 6:20 AM GMT
దెయ్యాలంటే చైత‌న్య‌కి అంత భ‌య‌మా
X

అక్కినేని వార‌సుడు నాగ‌చైత‌న్యకి దెయ్యాలంటే భ‌య‌మే? ఆయ‌న క‌నీసం దెయ్యం సినిమా చూడ‌ను కూడా చూడ‌రా? అలాంటి క‌థ‌ల్లో న‌టించ‌డం అంటే చైత‌న్య కి టెర్రరా? అంటే అవున‌నే తెలుస్తోంది. విక్ర‌మ్ కుమార్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన `దూత` వెబ్ సిరీస్ తో చైత‌న్య ప్రేక్ష‌కుల ముందుకు రావ‌డానికి రెడీ అవు తోన్న సంగ‌తి తెలిసిందే. వీరిద్దరి కాంబినేష‌న్ లో గ‌తంలో `మ‌నం` తెర‌కెక్కింది. ఆ త‌ర్వాత అఖిల్ తో మ‌రో చిత్రాన్ని తెర‌కెక్కించారు విక్ర‌మ్.

అప్ప‌టి నుంచి అక్కినేని ఫ్యామిలీ అంటే విక్ర‌మ్ కి ఎంతో క్లోజ్. ఈ నేప‌థ్యంలోనే మ‌రోసారి అదే ఫ్యామిలీ హీరోతో వెబ్ సిరీస్ ని తెర‌కెక్కించారు. దూత‌ని ప‌లు భాగాలు గా తెర‌కెక్కించ‌నున్నారు. మొద‌టి భాగం డిసెంబ‌ర్ లో రిలీజ్ అవుతుంది. ఇంకా దూత రెండు మూడు భాగాలు కూడా ఉన్నాయి. తాజాగా ఓ ఇంట‌ర్వ్యూలో చైత‌న్య కి దెయ్యాలంటే ఎంత భ‌య‌మో! విక్ర‌మ్ రివీల్ చేసారు. 'చైతో మంచి స్నేహం ఉంది. `మ‌నం` స‌మ‌యంలోనే చైత‌న్య ఓ హార‌ర్ క‌థ చెప్పా.

దీంతో ఆయ‌న భ‌య‌ప‌డిపోయాడు. నాకు దెయ్యం సినిమాలంటే భ‌యం. నేను చూడ‌టానికి కూడా ఇష్ట‌ప‌డ‌ను అన్నారు. కానీ `దూత` క‌థ మాత్రం చాలా బాగా న‌చ్చింది. ఇది బ‌య‌పెట్టే సిరీస్ కాదు. ఇదెలా జ‌రిగింది? త‌ర్వాత ఎం జ‌రుగుతుంద‌నే ఉత్సుక‌త క‌లుగుతుంది. క‌థ అంతా వ‌ర్షంలోనే సాగుతుంది. వంద రోజులు వ‌ర్షంలోనే షూట్ చేసాం. శ‌ర‌త్ మరార్ లాంటి నిర్మాత లేక‌పోతే సాధ్య‌మ‌య్యేది కాదు` అన్నారు.

వాస్త‌వానికి `దూత‌`ని హార‌ర్ థ్రిల్ల‌ర్ అనుకున్నంతా ఇంత‌ర‌కూ కానీ ఇది కేవ‌లం స‌స్పన్స్ థ్రిల్ల‌ర్ అని విక్ర‌మ్ వ్యాఖ్య‌ల్ని బ‌ట్టి తెలుస్తోంది. అదే దెయ్యం క‌థ అయితే చైత‌న్య మ‌ళ్లీ ఎస్కేప్ అయ్యేవాడేమో. ప్ర‌స్తు తం చైత‌న్య `తండేల్` కోసం రెడీ అవుతున్నాడు. ఇప్ప‌టికే లుక్ ప‌రంగా శ‌రీరంలో కొన్ని మార్పులు చేసిన సంగ‌తి తెలిసిందే.