Begin typing your search above and press return to search.

చై​-సామ్​ మంచి మనసు.. ఆ విషయంలో ఎంతో ఫ్రెండ్లీగా!

అయితే సమంత జంతు ప్రేమికురాలు అన్న విషయం తెలిసిందే. చై - సామ్ కలిసి ఉండే సమయంలోనూ వారి ఇంట్లో హష్ అనే పెట్ ఉండేది.

By:  Tupaki Desk   |   10 Oct 2023 12:49 PM GMT
చై​-సామ్​ మంచి మనసు.. ఆ విషయంలో ఎంతో ఫ్రెండ్లీగా!
X

నాగ చైతన్య - సమంత విడిపోయిన తర్వాత... ఈ జంటపై వచ్చిన రూమర్లు, వాటిపై వీరిద్దరు స్పందించిన తీరు సినీ ప్రియులకు తెలిసిన విషయమే. సమంతపై ఎన్ని రకాల రూమర్స్​ వచ్చాయో.. నాగ చైతన్యపై కూడా డేటింగ్ వార్తలు అలానే వచ్చాయి. అదే సమయంలో చైతూపై సామ్​ పరోక్షంగా వ్యాఖ్యలు చేసున్నా.. కానీ నాగ చైతన్య మాత్రం సమంతపై ప్రేమ, గౌరవం ఉన్నట్టుగానే మాట్లాడేవాడు.

అయితే సమంత జంతు ప్రేమికురాలు అన్న విషయం తెలిసిందే. చై - సామ్ కలిసి ఉండే సమయంలోనూ వారి ఇంట్లో హష్ అనే పెట్ ఉండేది. అందటే ఈ జంటకు బాగా ఇష్టం. సామ్ జామ్ షోలోనూ హష్​పై తమకున్న ప్రేమను.. నాగ చైతన్య, సమంతలు మాట్లాడారు.

అయితే విడాకుల తర్వాత సమంత - నాగచైతన్య కెరీర్​ పరంగా ఎవరీ లైఫ్​లో వారు ఫుల్ బిజీ అయిపోయారు. సమంత ప్రొఫెషనల్​ లైఫ్​ను సక్సెస్​ఫుల్​గా సాగిస్తూనే పర్సనల్​ లైఫ్​ను కూడా బాగానే ఎంజాయ్ చేస్తోంది. పెట్స్‌ను కూడా పెంచుకుంటోంది. హష్ కూడా సమంతోనే చాలా సార్లు కనిపించింది. వాటికి సంబంధించిన ఫొటోలను సమంత షేర్ చేస్తూనే ఉంటుంది.


అయితే తాజాగా నాగ చైతన్యకు పోస్ట్ చేసిన ఓ ఫొటో అందరీ దృష్టిని ఆకర్షించింది. చైతూ దగ్గర హష్ ఉన్నట్లు కనిపించింది. కారులో పచ్చని పొలాలను చూస్తూ కనిపించింది. రీసెంట్​గా కూడా చైతూ సంబంధించిన ఓ వీడియోలో అది కనిపించింది. దీంతో నెటిజన్లు, అభిమానులు హ్యాపీగా ఫీలవుతున్నారు.

సమంత ప్రస్తుతం విదేశాల్లో ఉన్న కారణంగా చైతూ దగ్గర వదిలి వెళ్లి ఉండొచ్చని అభిప్రాయపడుతున్నారు. హష్ విషయంలో ఈ జంట​ చాలా ఫ్రెండ్లీగా ఆలోచించి మంచి ఆలోచన తీసుకున్నారని అభిప్రాయపడుతున్నారు. సామ్ చైతన్య మళ్లీ కలవాలని ఆశిస్తూ.. లవ్​ ఎమోజీలతో హష్​ పేరును షేర్ చేస్తున్నారు. మరోవైపు సమంత కూడా తాజాగా హష్ ఫొటోను తన ఇన్​స్టా స్టోరీస్​లో పోస్ట్ చేసింది.

కాగా, నాగ చైతన్య ప్రస్తుతం చందూ మొండేటితో ఓ సినిమా చేస్తున్నారు. ఇందులో సాయి పల్లవి హీరోయిన్‌గా నటిస్తోంది. లవ్ స్టోరీ తరువాత మళ్లీ ఈ క్రేజీ కాంబో సెట్ అయింది. సమంత ప్రస్తుతం ఏడాది పాటు సినిమాలకు బ్రేక్ ఇచ్చి.. పర్సనల్​ లైఫ్​ను విదేశాల్లో ఎంజాయ్ చేస్తోంది. అక్కడ విశేషాలను, దిగిన ఫొటోలను సోషల్​ మీడియాలో అభిమానులతో పంచుకుంటోంది.