పిల్లల కోసం విడాకులు తీసుకున్న నటి!
పెళ్లైన నాలుగు నెలల్లోనే వీగిపోయింది. అటుపై 2013 లో పర్హాన్ మీర్జాను పెళ్లాడింది. కానీ ఐదేళ్ల కాపురం అనంతరం ఆ జోడీ కూడా విడాకులతో వేరైంది.
By: Tupaki Desk | 5 July 2025 12:00 AM ISTబాలీవుడ్ నటి ఛాహత్ ఖన్నా గురించి పరిచయం అవసరం లేదు. 'ది ఫిలిం', 'థాంక్యూ', 'ప్రస్థానం', 'యాత్రాస్' లాంటి చిత్రాలతో సుపరిచితమే. బుల్లి తెరపైనా అమ్మడు బాగా ఫేమస్. 'ఖుబూల్' హై వంటి సీరియల్ ఆమెకు అక్కడా మంచి గుర్తింపును తెచ్చి పెట్టింది. కెరీర్ పరంగా ఎలాంటి ఢోకాలేదు. కానీ వ్యక్తి గత జీవితంలో మాత్రం ఛాహత్ కూడా చాలా ఎదురుదెబ్బలే తిన్నది. 2006 లో భరత్ నర్సింగ్ ను వివాహం చేసుకుంది. కానీ ఆ బంధం ఏడాది కూడా నిలబడలేదు.
పెళ్లైన నాలుగు నెలల్లోనే వీగిపోయింది. అటుపై 2013 లో పర్హాన్ మీర్జాను పెళ్లాడింది. కానీ ఐదేళ్ల కాపురం అనంతరం ఆ జోడీ కూడా విడాకులతో వేరైంది. అయితే రెండవ సారి విడాకుల విషయంలో ఛాహత్ ఖాన్నా ఓ కొత్త కారణాన్ని రివీల్ చేసింది. ఆమె మాటలు ప్రకారం భర్తతో ఎలాంటి వివాదం లేకుండానే విడాకులు తీసుకున్నట్లు కనిపిస్తుంది. పిల్లల భవిష్యత్ కోసమే విడాకులు తప్ప మరో కారణం లేదంది. `నాకెప్పుడు సరైంది అనిపిస్తేనే చేస్తాను. దానికే కట్టుబడి ఉంటాను. ఏదైనా తప్పు అనిపిస్తే అలాంటి పని జోలికి వెళ్లను.
ఎవరైనా తప్పు చేసినా ధైర్యంగా నిలబడి ప్రశ్నిస్తాను. ఆ ధైర్యం, తెగువ నాలో ఉన్నాయి. తప్పు విష యంలో ప్రపంచమంతా ఒక్క వైపు ఉన్నా? నేను మరోవైపు ఉంటాను. ఆ రకమైన నమ్మకం, ధైర్యం నాకున్నాయి. అలాంటి స్వభావం నాకు చిన్నప్పటి నుంచే అలవాటైంది. పిల్లల కోసం ఎక్కువగా లోచిస్తాను. అలాగే వివాహ బంధం ఎంత బలంగా ఉందన్నది చూసుకుంటాను. సరిగ్గా లేని బంధంలో కొనసాగకూడదు అన్నది నా అభిప్రాయం. ఎందుకంటే పిల్లల కంటే ఏదీ ఎక్కువ కాదు.
మనకంటే ఎక్కువగా పిల్లలు ప్రభావితం అవుతారు. అది కలిగించే నష్టం మనకు తెలియకుండానే జరిగిపోతుంది. వారు పెద్దాయ్యాక వారి స్నేహితుల నుంచే ఇలాంటి విషయలు మనకు తెలుస్తాయి. అందుకే కుమార్తెల కోసం కొన్ని నిర్ణయాలు తీసుకోక తప్పలేదని` తెలిపింది.
