Begin typing your search above and press return to search.

విశాల్ ఆరోప‌ణ‌ల‌పై రంగంలోకి కేంద్రం!

ముంబై సెన్సార్ బోర్డ్ పై కోలీవుడ్ న‌టుడు విశాల్ సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేసిన సంగ‌తి తెలిసిందే. ఆయ‌న హీరోగా న‌టించిన 'మార్క్ ఆంటోనీ' హిందీ వెర్ష‌న్ రిలీజ్ నేప‌థ్యంలో 6.5 ల‌క్ష‌లు లంచం తీసుకున్న‌ట్లు ఆరోపించారు.

By:  Tupaki Desk   |   29 Sep 2023 11:40 AM GMT
విశాల్ ఆరోప‌ణ‌ల‌పై రంగంలోకి కేంద్రం!
X

ముంబై సెన్సార్ బోర్డ్ పై కోలీవుడ్ న‌టుడు విశాల్ సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేసిన సంగ‌తి తెలిసిందే. ఆయ‌న హీరోగా న‌టించిన 'మార్క్ ఆంటోనీ' హిందీ వెర్ష‌న్ రిలీజ్ నేప‌థ్యంలో 6.5 ల‌క్ష‌లు లంచం తీసుకున్న‌ట్లు ఆరోపించారు. డ‌బ్బులు వరెవరికి పంపించారో ఆ వివరాలను కూడా వెల్లడిస్తూ ప్రధాని మోదీ- మహా సీఎం షిండేలను ట్యాగ్ చేశారు. ఈ విష‌యాన్ని ప్ర‌ధాని మోదీ...ముఖ్య‌మంత్రి ఏక్ నాధ్ షిండేల దృష్టికి తీసుకెళ్తాన‌ని.. న్యాయ‌పోరాటం చేస్తాన‌ని ప్ర‌క‌టించారు. విశాల్ ఆరోప‌ణ‌ల నేప‌థ్యంలో తాజాగా ఈ వివాదంపై కేంద్ర ప్రభుత్వం స్పందించింది.

ఈ మేరకు కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ సోషల్ మీడియా అనుసంధాన ఎక్స్ వేదికగా ఓ పోస్ట్ పెట్టింది. విశాల్ వ్యాఖ్య‌ల నేప‌థ్య‌లో విచార‌ణ చేస్తున్న‌ట్లు తెలిపింది. సెన్సార్ బోర్డ్‌లో అవినీతి జరిగినట్లుగా ఆరోపణలు రావడం బాధాకరమని.. అవినీతి జరిగితే ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లోనూ సహించదని స్పష్టం చేసింది. ఎవరైనా అవినీతికి పాల్పడినట్లు రుజువైతే తప్పకుండా చర్యలు తీసుకుంటామ‌ని పేర్కొంది.

సమాచార.. ప్రసార మంత్రిత్వ శాఖకు చెందిన ఓ సీనియర్ అధికారి ఆధ్వ్యంలో విచార‌ణ జ‌రుపుతున్న‌ట్లు తెలుస్తోంది. విశాల్ వ్యాఖ్య‌ల నేప‌థ్యంలో కేంద్ర‌ప్రభుత్వం ఇంత వేగంగా స్పందించ‌డం విశేషం. హుటాహుటిన అధికారులు రంగంలోకి దిగి లంచాలు తీసుకున్న వారెవ‌రో తెలుసుకునే ప్ర‌య‌త్నాలు చేస్తున్న‌ట్లు తెలుస్తోంది. విశాల్ ద‌గ్గ‌ర ఎలాంటి ఆధారాలున్నాయి వంటి విష‌యాల‌పై ఆరా తీస్తున్న‌ట్లు స‌మాచారం.

సెన్సార్ పై ఇప్ప‌టివ‌ర‌కూ ఇలాంటి ఆరోప‌ణ‌లు ఎప్పుడూ తెర‌పైకి రాలేదు. రిలీజ్ స‌మ‌యంలో ద‌ర్శ‌క-నిర్మాత‌లు ఎలాంటి క‌ట్ లు లేకుండా సినిమా కి స‌ర్టిపికెట్ వ‌స్తే చాలు అనుకుని..ఎలాగూ లా ప‌ట్టా కోసం ప్ర‌య‌త్నాలు చేస్తారు. మ‌రి విశాల్ ఆరోప‌ణ‌ల‌పై స‌మాచార శాఖ ఎలాంటి నిగ్గు తేలుస్తుందో చూడాలి.