Begin typing your search above and press return to search.

మంగళవారం సెన్సార్ రిపోర్ట్… కంటెంట్ గట్టిగానే..

మంగళవారం మూవీకి తాజాగా సెన్సార్ జరిగింది. ఎలాంటి కట్ లేకుండా మూవీకి సెన్సార్ బోర్డు ఏ సర్టిఫికేట్ ఇచ్చింది.

By:  Tupaki Desk   |   14 Nov 2023 4:46 AM GMT
మంగళవారం సెన్సార్ రిపోర్ట్… కంటెంట్ గట్టిగానే..
X

అజయ్ భూపతి దర్శకత్వంలో పాయల్ రాజ్ పుత్ లీడ్ రోల్ లో తెరకెక్కి ప్రేక్షకుల ముందుకి వస్తోన్న సినిమా మంగళవారం. ఈ మూవీ నవంబర్ 17న ప్రపంచ వ్యాప్తంగా పాన్ ఇండియా రేంజ్ లో థియేటర్స్ లోకి వస్తోంది. థ్రిల్లర్ ఎలిమెంట్స్ తో ఇంటరెస్టింగ్ కథ, కథనంతో మంగళవారం సినిమాని అజయ్ భూపతి సిల్వర్ స్క్రీన్ పై ఆవిష్కరించారు. దానికి తగ్గట్లుగానే ఇప్పటికే వచ్చిన ట్రైలర్, సాంగ్స్ మూవీపై ఎక్స్ పెక్టేషన్స్ పెంచేశాయి.

కాంతారా ఫేం అజనీష్ లోకనాథ్ ఈ చిత్రానికి మ్యూజిక్ అందిస్తున్నారు. ఆయన సౌండ్ స్టామినా ఏంటి అనేది ట్రైలర్ లోనే చూపించేశారు. కచ్చితంగా మంగళవారం సినిమాకి బ్యాగ్రౌండ్ మ్యూజిక్ ప్లస్ అవుతుందని అందరూ నమ్ముతున్నారు, అజయ్ భూపతి కూడా అదే విషయాన్ని ప్రస్తావించారు. మంగళవారం మూవీకి తాజాగా సెన్సార్ జరిగింది. ఎలాంటి కట్ లేకుండా మూవీకి సెన్సార్ బోర్డు ఏ సర్టిఫికేట్ ఇచ్చింది.

అయితే అశ్లీలత ఉందని సెన్సార్ మంగళవారం సినిమాకి ఏ సర్టిఫికేట్ ఇవ్వలేదని, మూవీలో మ్యూజిక్ సౌండ్స్ కాస్తా భయపెట్టే విధంగా ఉంటాయని, అలాగే ఎలిమెంట్స్ కూడా కొత్తగా ఎవ్వరూ ఊహించని విధంగా సీట్ ఎడ్జ్ లో కూర్చోబెడతాయని అన్నారు. ఈ కారణంగా మూవీకి ఏ సర్టిఫికేట్ వచ్చిందని తెలిపారు. నందితా శ్వేత, దివ్య పిళ్లై, అజ్మల్, రవీంద్ర విజయ్, కృష్ణచైతన్య, అజయ్ ఘోష్ తదితరులు నటిస్తున్నారు.

క్రియేటివ్ వర్క్స్, ముద్ర మీడియా వర్క్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రంతో అల్లు అర్జున్ ఫ్రెండ్ స్వాతి నిర్మాతగా పరిచయం అవుతున్నారు. అలాగే అజయ్ భూపతి బ్రదర్ ఒక నిర్మాతగా ఉన్నారు. ఓ విధంగా అజయ్ భూపతి సొంత ప్రొడక్షన్ లో మంగళవారం మూవీ చేసాడని చెప్పొచ్చు. అందుకే సినిమాని మార్కెట్ లోకి తీసుకెళ్ళే బాద్యతని పూర్తిగా తన భుజాలపై వేసుకున్నాడు.

ఇప్పటికే సినిమా బిజినెస్ డీల్స్ క్లోజ్ అయిపోయాయి. థీయాట్రికల్, నాన్ థీయాట్రికల్ రైట్స్ కూడా అమ్ముడైపోయాయి. కచ్చితంగా నెక్స్ట్ వీక్ సాలిడ్ ఓపెనింగ్స్ అందుకునే చిత్రాలలో మంగళవారం ఉంటుందనే మాట ట్రేడ్ పండితుల నుంచి వినిపిస్తోంది. మహా సముద్రం లాంటి డిజాస్టర్ తర్వాత గ్యాప్ తీసుకొని పెర్ఫెక్ట్ ప్లాన్ తో ఆడియన్స్ కి కనెక్ట్ అయ్యే ట్రెండింగ్ కాన్సెప్ట్ తో మంగళవారం సినిమాని అజయ్ భూపతి చేయడం విశేషం.