బూతు ప్రమోషన్ భావ్యమేనా?
వాళ్లెంతటి గొప్ప కళాఖండాలు తీసారో తెలియదు గానీ సినిమా పేరుతో ప్రచార చిత్రాలను అలా రిలీజ్ చేయడంపై చాలా సోషల్ మీడియాలో చాలా వ్యతిరేకత వ్యక్త మైంది.
By: Tupaki Desk | 5 April 2025 6:00 AMసినిమా రిలీజ్ కు ముందు సెన్సార్ అనేది ఒకటుంటంది. అసభ్యకర సన్నివేశాలు.. అభ్యంతరాలు ఏవైనా.. బూతు పదజాలం ఏవైనా ఉంటే? సెన్సార్ నుంచి క్లియరెన్స్ వచ్చినా తర్వాతే ఆ సినిమాలు రిలీజ్ అవు తుంటాయి. అవసరం మేర ఆయా సన్నివేశాలను తొలగించడం... లేదా మ్యూట్ చేయడం జరుగుతుంది. ఆ తర్వాతే థియేటర్ కాపీ రెడీ అవుతుంది. సెన్సార్ ఇచ్చిన సర్టిఫికెట్ ను బట్టి ఎంత వయసు ఉన్నవారు సినిమా చూడొచ్చు? అన్న కండీషన్లు అప్లై అవుతుంటాయి.
మరి సినిమా రిలీజ్ కు ముందు పరిస్థితి ఎలా ఉంటుందంటే? అదే సినిమాని వీలైనంతగా జనాల్లోకి తీసుకెళ్లే ప్రక్రియలో భాగంగా రిలీజ్ అయ్యే టీజర్లు, ట్రైలర్లు..గ్లింప్స్ లో ఎలాంటి బూతు పదజాలం దొర్లుతుందో తెలిసిందే. ఈ మధ్యనే `జాక్`, సహా నాని కొత్త సినిమా `ప్యారడైజ్` ప్రచార చిత్రాల్లో అసభ్యతో ఏ రేంజ్ లో తాండవం చేసిందో తెలిసిందే. ఈ రెండు ప్రచార చిత్రాల్లో కూడా బూతులు నింపేసారు.
వాళ్లెంతటి గొప్ప కళాఖండాలు తీసారో తెలియదు గానీ సినిమా పేరుతో ప్రచార చిత్రాలను అలా రిలీజ్ చేయడంపై చాలా సోషల్ మీడియాలో చాలా వ్యతిరేకత వ్యక్త మైంది. అంతకు ముందు మరో యంగ్ హీరో విశ్వక్ సేన్ నటించిన కొన్ని సినిమాల్లో కూడా ఇలాంటి బూతు పదజాలం దొర్లింది. వాస్తవానికి ఈ ట్రెండ్ `అర్జున్ రెడ్డి` నుంచి మొదలైంది. ఆ తర్వాత కొంత మంది హీరోలు అనుసరించారు.
ఇంకా మూలాలోకి వెళ్తే రాంగోపాల్ వర్మ ఈ ట్రెండ్ కి సృష్టి కర్తగా చెప్పాలి. ఇలాంటి వాటితో సినిమాకి మంచి పబ్లిసిటీ దక్కుతుం దన్నది వాస్తవం. అలాంటి వాటినే చూడటానికి యువత పోటీ పడుతుంది. అదే సమయంలో ఆ ప్రభావం యువతపై కూడా పడుతుందని సామాజిక సంఘాలు మండిపడుతు న్నాయి. బూతు ప్రచారం భావ్యమేనా? అన్న అసహనాన్ని వ్యక్తం చేస్తున్నాయి. దీంతో రిలీజ్ కుముందు సెన్సార్ ఎలా ఉంటుందో? టీజర్, ట్రైలర్ కూడా సెన్సార్ రివ్యూ ఇచ్చిన తర్వాత రిలీజ్ చేయాలి? అనే నిబంధన ప్రతీ సినిమాకు తీసుకురావాని డిమాండ్ చేస్తున్నారు.