Begin typing your search above and press return to search.

సెల‌బ్రిటీ థండ‌ర్.. ఆ ముగ్గురిలో ఎవ‌రు హాట్?

అన్నే హాత్వే ప్ర‌శంస‌, త‌న వ్య‌క్తిత్వాన్ని చాలా మంది మెచ్చుకున్నారు. ఎందుకంటే ప్రియాంక చోప్రా అందం, మచ్చలేని చర్మం నిజానికి అభిమానులు.. తోటి సెలబ్రిటీల ప్రశంసలను అందుకుంది.

By:  Tupaki Desk   |   27 Oct 2023 5:30 PM GMT
సెల‌బ్రిటీ థండ‌ర్.. ఆ ముగ్గురిలో ఎవ‌రు హాట్?
X

సెలబ్రిటీలు స‌హ‌చ‌రుల‌ ప్రతిభ అందాలను ఆరాధిస్తారనేది అందరికీ తెలిసిన విషయమే. కానీ ఒక A-లిస్టర్ న‌టి మరొక స్టార్ పై తమకున్న రహస్య అభిమానం గురించి ఓపెనైనప్పుడు అది హెడ్‌లైన్స్ లో నిలుస్తుంది. 2019లో ఓ ఇంటర్వ్యూలో పాపుల‌ర్ హాలీవుడ్ న‌టి అన్నే హాత్వే తన సహనటుడు మాథ్యూ మెక్‌కోనాఘేతో కలిసి తన చిత్రం 'సెరినిటీ'ని ప్రమోట్ చేస్తున్నప్పుడు భార‌తీయ న‌టి ప్రియాంక చోప్రా మచ్చలేని ఛాయపై ప్రశంసలను కురిపించింది. ప్రియాంకను అన్నే మెచ్చుకోవడం క్షణికావేశంలో జ‌రిగినది కాదు. అన్నే త‌న‌కు వీరాభిమాని. అందుకే ఆమె ఎంతో హాస్యభరితంగా ఇలా వ్యాఖ్యానించింది. "ప్రియాంక చోప్రా చర్మ సౌంద‌ర్యం.. ఎంత‌టి అందం. దేవుడా! నేను ప్రతి రాత్రి ఆన్‌లైన్‌లో ఉంటాను..త‌ననే వెంబ‌డిస్తాను. ఆమె (పీసీ) ఏమిటి... ఆమె ఎలా దీనిని సాధిస్తోంది? తెలుసుకుంటాను" అని వ్యాఖ్యానించింది. అన్నే హాత్వే ప్రతి రాత్రి ప్రియాంక చోప్రాను వెంబడిస్తాన‌ని తన రహస్య వ్యామోహాన్ని వెల్లడించింది!


అన్నే హాత్వే ప్ర‌శంస‌, త‌న వ్య‌క్తిత్వాన్ని చాలా మంది మెచ్చుకున్నారు. ఎందుకంటే ప్రియాంక చోప్రా అందం, మచ్చలేని చర్మం నిజానికి అభిమానులు.. తోటి సెలబ్రిటీల ప్రశంసలను అందుకుంది. ప్రియాంక చర్మ సంరక్షణ నియమావళి చాలామందికి ఒక‌ రహస్యంగా మిగిలిపోయింది. వయస్సుతో ప‌ని లేకుండా అందాన్ని మెయింటెయిన్ చేయ‌డం త‌న‌కే చెల్లింది.


2023లో మ‌రోసారి ఆ ఇద్ద‌రూ క‌లిసారు. అన్నే హాత్వే- ప్రియాంక చోప్రా జోనాస్‌లు ప్యారిస్‌లోని పాపుల‌ర్ లగ్జరీ బ్రాండ్‌కు అంబాసిడర్‌లుగా నియ‌మితుల‌య్యారు. అలా వ్యక్తిగతంగా కలుసుకునే అవకాశం ఇప్పుడు వారికి లభించింది. శుభాకాంక్ష‌ల అనంత‌రం వారు క‌లిసి పోజులిచ్చిన ఆహ్లాదకరమైన ఫోటోలు ప్రపంచవ్యాప్తంగా ఉన్న అభిమానుల హృదయాలను గెలుచుకున్నాయి. హాలీవుడ్‌లోని ఇద్దరు ప్రముఖ క‌థానాయిక‌ల మధ్య ఇంత అంద‌మైన సంబంధం ఆస‌క్తిని క‌లిగిస్తోంది.

ఒకరిపై ఒక‌రు అభిమానం చాటుకోవ‌డం, గౌరవాన్ని ప్రదర్శించడమే కాకుండా అసూయ లోను అడ్డుకోలేరని దీనిని బ‌ట్టి అర్థ‌మైంది. హాలీవుడ్‌లోని గొప్ప తారలు కూడా ప్రియాంక చోప్రాకు అభిమానులుగా ఉండవచ్చని ఇప్పుడు ప్రూవైంది. అన్నే హ‌త్ వే- జెండ‌యాల‌తో క‌లిసి ఉన్న‌ ప్రియాంక చోప్రా ఫోటోలు అంత‌ర్జాలంలో వైర‌ల్ గా మారుతున్నాయి. ఆ ముగ్గురిలో ఎవ‌రు హాట్? అంటూ ఒక సెక్ష‌న్ నెటిజ‌నులు డిబేట్లు పెడుతున్నారు. అయితే ఆ ముగ్గురిలో ప్రియాంక చోప్రా వెరీ హాట్ అంటూ ప్ర‌శంస‌లు అందుకుంటోంది.