ఇలా దూరమైతే డ్యామేజ్ తప్పదేమో!
సెలబ్రిటీలకు సోషల్ మీడియా అన్నది ప్రచారం కోసం ఓ స్ట్రాంగ్ వెపన్ లాంటింది. పాతాళానికి పడిపోయిన వారిని సైతం పైకి లేపే సత్తా నేటి సోషల్ మీడియాకు ఉంది
By: Tupaki Desk | 13 Sept 2025 12:13 PM ISTసెలబ్రిటీలకు సోషల్ మీడియా అన్నది ప్రచారం కోసం ఓ స్ట్రాంగ్ వెపన్ లాంటింది. పాతాళానికి పడిపోయిన వారిని సైతం పైకి లేపే సత్తా నేటి సోషల్ మీడియాకు ఉంది. తమ కోసం ఎవరో మరొకరు రావాల్సిన పనిలేదు. తమని తామే సొంతంగా పైసా ఖర్చు లేకుండా ప్రచారం చేసుకునే గొప్ప మాధ్యమం ఇది. ప్రస్తుతం సెలబ్రిటీలు ఇన్ స్టా, పేస్ బుక్, యూట్యూబ్, ఎక్స్ లాంటి ఖాతాలను, యాప్స్ ను ఏ రేంజ్లో వినియోగిస్తున్నారో తెలిసిందే. తమని తాము ప్రచారం చేసు కోవడంతో పాటు లక్షల ఆదాయం కూడా సమకూరుతుంది. ఎంత ఫాలోయింగ్ ఉంటే? అంత ఆదాయం సమ కూరుతుంది.
మునుపటిలా ఉంటే కుదరదు:
వాటి ద్వారా సినిమా అవకాశాలు వస్తున్నాయి. ఓటీటీ , వెబ్ సిరీస్ ఛాన్స్ లు అందుకుంటున్నారు. తప్పు జరిగినా వాటిని కరెక్ట్ చేయడానికి ఇదే మాధ్యమం ఎంతో గొప్పగా ఉపయోగపడుతుంది. ఫామ్...ఫేమ్ కోల్పోయిన వారు సైతం మళ్లీ ఫాంలోకి రాగలుగుతున్నారంటే? తమని తాము ప్రమోట్ చేసుకునే విధానంతోనే అన్నది అతే వాస్తవం. సోషల్ మీడియా కారణంగా హీరోలైంది? హీరోలైంది ఎంతోమంది. అలాంటి సోషల్ మీడియాకు స్వీటీ అనుష్క ఎప్పుడూ దూరంగానే ఉంటుంది. ఆమె పెద్దగా యాక్టివ్ గా ఉండదని అందరికీ తెలిసిందే.
సోషల్ మీడియా పవర్ ఇది:
కానీ ఆమె ఇప్పుడిలా సోషల్ మీడియాకు దూరంగా ఉండటం అన్నది అమ్మడి కెరీర్ పైనే ప్రభావం పడుతుందని చర్చ జరుగుతోంది. సోషల్ మీడియాకు, ఫోన్ కు దూరంగా ఉండటం వల్ల సమాజంలో ఏం జరుగుతోందో తెలియక ఓ రాష్ట్ర ఎన్నికల్లో సీఎం పదవినే పొగొట్టుకన్న ఓ వ్యక్తి గురించి అంతా విన్నారు. అదే సోషల్ మీడియాలో అతడు ఉండి ఉంటే ఎన్నికల్లో గెలిచేవారేమో! అన్న సందేహాలు అంతే బలంగా వ్యక్తమయ్యాయి. అలా అతడి రాత రాత్రికి రాత్రే మారిపోయింది. అంతటి ప్రభావం చూపే సోషల్ మీడియాకే దూరంగా ఉండటం అన్నది అనుష్క భవిష్యత్ పై మరింత ప్రభావం చూపిస్తుందనే టాక్ వినిపిస్తోంది.
దూరంగా ఉంటే నష్టమే:
ఇప్పటికే అనుష్క అరకొరకగా సినిమాలు చేయడంతో జనాలు కూడా లైట్ తీసుకునే పరిస్థితి వచ్చేసింది. కాంపిటీ షన్ లో చాలా మంది కొత్త భామలు ఉండటంతో చర్చ వాళ్ల గురించే జరుగుతోంది తప్ప! అనుష్క గురించి కాదన్నది గ్రహించాల్సిన విషయంగా ఓ అభిమాను పోస్ట్ పెట్టాడు. ఇప్పటికైనా అనుష్క సోషల్మీడియాలోకి వచ్చి యాక్టివ్ గా ఉంటే జరిగిన కొంత నష్టంతో పాటు, రాబోయే నష్టాన్ని కూడా ఆపడానికి అవకాశం ఉందంటున్నాడు. అలా కాకుండా ఇంటికే పరిమితమైతే గనుక మరిన్ని ప్రతికూల పరిస్థితులు తప్పవనే చర్చ జోరుగా సాగుతోంది.
