క్యాలరీలు అన్నింటిని కూచిపూడితో కరిగించేస్తుంది!
తాజాగా మమితాబైజు డైట్ సీక్రెట్ కూడా రివీల్ చేసింది. ఈ అమ్మడు కూడా పుడ్ విషయంలో ఎక్కడా రాజీ పడనంటోంది.
By: Srikanth Kontham | 25 Dec 2025 6:00 AM ISTసెలబ్రిటీ లైప్ లో డైట్ ఫాలో అవ్వడం తప్పనిసరి. అప్పుడప్పుడు ఆ డైట్ బ్రేక్ అవుతుంటుంది. వారమంతా డైట్ ఫాలో అయినా సండే ఒక్కరోజు మాత్రం కడుపు నిండా నచ్చిన వంటకాలు భుజించే వారు చాలా మంది ఉన్నారు. ఆదివారం మాత్రం రాజీ పడేదే లేదు. కానీ ఆ మరుసటి రోజే రెగ్యులర్ టైమింగ్ కంటే? ఎక్కువగా జిమ్ లో కసరత్తులు చేస్తారు. తిన్న క్యాలరీలు అన్నింటిని వర్కౌట్లతో బయటకు పంపిస్తారు. కింగ్ నాగార్జున ఇదే విధానాన్ని ఫాలో అవుతారు. సోమవారం నుంచి శనివారం వరకూ మితంగా ఆహారం తీసుకుంటారు.
ఆదివారం మాత్రం తనకు నచ్చినవి తింటారు. చిరంజీవి కూడా ఒకప్పుడు నాన్ వెజ్ ప్రియులే. ఇప్పుడు మాత్రం డైట్ ఫాలో అవుతున్నారు. వయసు మీద పడటంతో? అందుకు తగ్గట్టు ప్రణాళిక సిద్దం చేసుకుని ముందు కెళ్తున్నారు. అందుకే చిరు ఇప్పుడు అంత స్మార్ట్ గా కనిపిస్తున్నారు. ఇక హీరోయిన్ల విషయాకి వస్తే వీరు కూడా ఎంత మాత్రం తగ్గేవారు కాదనే చెప్పాలి. అందులోనూ మలయాళం నుంచి దిగుమతి అయిన భామలైతే నాన్ వెజ్ ప్రియులే ఎక్కువ. అక్కడ లైఫ్ స్టైల్ కు తగ్గట్టు ఉంటారు. వీరిలో చాలా మంది టాలీవుడ్ కి వచ్చిన తర్వాత ఎక్కువగా డైట్లు ఫాలో అవుతుంటారు.
తాజాగా మమితాబైజు డైట్ సీక్రెట్ కూడా రివీల్ చేసింది. ఈ అమ్మడు కూడా పుడ్ విషయంలో ఎక్కడా రాజీ పడనంటోంది. చేపల కూర, పులుసు ఎంతో ఇష్టంగా తింటానంది. హైదరాబాద్ వచ్చిన తర్వాత చికెన్, దమ్ భిర్యానీ సహా ఇక్కడ దొరికే అన్ని రకాల నాన్ వెజ్ వంటకాలకు వీరాభిమానిగా మారిపోయానంది. కేరళ బిర్యానీలు తినలేం గానీ ఇక్కడ మాత్రం బిర్యానీ కోసమేఉండిపోవాల నిపిస్తుందంది. దోశెలు..చిరుతిళ్లు కూడా ఎంతో రుచిగా ఉంటాయని తెలిపింది. హైదరాబాద్ కి వచ్చిన కొత్తలో వాటన్నింటిని ఆస్వాదించినట్లు గుర్తు చేసుకుంది.
ఇప్పటికీ హైదరాబాద్ లో ఉంటే మాత్రం బిర్యానీ లాగించేస్తానంది. అయినా తాను ఎంత తిన్నా? ఆ మొత్తం క్యాల రీలను కూచిపూడితో కరిగించేస్తానంది. కూచిపూడి డాన్స్ ఆగడకుండా ఆడితే ఎంత తిన్నా కరిగిపోతుందని ,తనకు అది ఎంతో ఉత్తమమైన వ్యాయామంగా పని చేస్తుందని తెలిపింది. ముందు రోజు రాత్రి ఎక్కువగా తింటే ఉదయం కూచిపూడి ఆడే టైమింగ్ పెంచుతానంది. నాన్ వెజ్ వంటకాలు ఆరగించిన సమయంలో కూచిపూడి మాత్రం తప్పక ఆడాల్సిందే అంటోంది.
