2026 ప్రథమార్ధంలో స్వర్గస్తులైన ఇండియన్ సెలబ్రిటీస్ వీరే!
మరి ఈ ఏడాది జనవరి 1 నుండి ఇప్పటివరకు 2026 ప్రథమార్గంలో స్వర్గస్తులైన సెలబ్రిటీలు ఎవరో ఎప్పుడు చూద్దాం.
By: Madhu Reddy | 11 Jun 2026 1:19 PM ISTఒకరు కాదు ఇద్దరు కాదు వేల సంఖ్యలో ఎంతోమంది నటీనటులు తమ అద్భుతమైన నటనతో తెరపై విలక్షణమైన ప్రతిభ కనబరిచి ప్రేక్షకులను మెప్పిస్తున్నారు. ప్రేక్షకుడికి వినోదాన్ని పంచడమే కాదు ఎన్నో సహాయాలు చేస్తూ వారి గుండెల్లో దేవుడిగా గుర్తింపు తెచ్చుకుంటున్నారు. అంతేకాదు సినీ పరిశ్రమకు విశిష్ట సేవను అందిస్తున్న ఇలాంటి ఎంతోమంది సెలబ్రిటీలు అనుకోకుండా లేదా అనారోగ్య సమస్యలతో తుది శ్వాస విడిస్తే.. ప్రేక్షకులను ఎంతగానో ఎంటర్టైన్ చేసిన సెలబ్రిటీలు ఇక లేరని తెలిస్తే.. అభిమానులు తట్టుకుంటారా? ముఖ్యంగా ఈ 2026 ప్రథమార్ధంలో ఇలా ఎంతోమంది సెలబ్రిటీలు అనారోగ్య సమస్యలతో, వృద్ధాప్య సమస్యలతో, యాక్సిడెంట్ కారణంగా ఇలా వివిధ కారణాల వల్ల స్వర్గస్తులయ్యారు. మరి ఈ ఏడాది జనవరి 1 నుండి ఇప్పటివరకు 2026 ప్రథమార్గంలో స్వర్గస్తులైన సెలబ్రిటీలు ఎవరో ఎప్పుడు చూద్దాం.
రఘునాథ్ రెడ్డి - ఫిబ్రవరి 1
విలక్షణమైన నటనతో సుమారుగా 370 కి పైగా చిత్రాలలో నటించిన సీనియర్ నటుడు రఘునాథ్ రెడ్డి తన కుమారుడి మరణం తర్వాత తీవ్ర డిప్రెషన్ తో గుండెపోటుకు గురై ఫిబ్రవరి 1 2026న తుది శ్వాస విడిచారు.
జయవాహిని -ఫిబ్రవరి 4
ఒకవైపు కామెడీతో మరొకవైపు వ్యాంప్ పాత్రలతో ఆడియన్స్ హృదయాలను దోచుకున్న వాహిని అలియాస్ జయవాహిని గత కొంతకాలంగా రొమ్ము క్యాన్సర్ తో బాధపడిన విషయం తెలిసిందే. రొమ్ము క్యాన్సర్ చికిత్సకు అవసరమయ్యే ఆర్థిక సహాయాన్ని కొంతమంది సెలబ్రిటీలు కూడా అందించారు. కానీ వ్యాధి ముదరడంతో ఫిబ్రవరి 4 2026న ఆమె క్యాన్సర్ తో పోరాడుతూ జయించలేక కన్నుమూశారు. సినిమాలలోనే కాదు సీరియల్స్ లో కూడా నటించి బుల్లితెర ఆడియన్స్ ని కూడా ఆకట్టుకుంది
ఆనంద్ సాగర్ - ఫిబ్రవరి 13
ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు, నిర్మాత రామానంద్ సాగర్ కుమారుడైన ఆనంద్ సాగర్ 84 సంవత్సరాల వయసులో ఫిబ్రవరి 13వ తేదీన స్వర్గస్తులయ్యారు.
బెల్లి జనార్దన్ -మార్చి 22
దర్శకుడు బాబ్జి దర్శకత్వంలో అజయ్ ఘోష్, అఖిల్ సన్నీ కాంబినేషన్లో వచ్చిన పోలీస్ వారి హెచ్చరిక అనే చిత్రానికి నిర్మాతగా వ్యవహరించిన బెల్లి జనార్ధన్ మార్చి 22న మరణించారు. ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని సరదాగా జరిగిన సంబరాలలో స్విమ్మింగ్ పూల్ లో ఈత కొడుతుండగా భారీ ప్రమాదం చోటుచేసుకుంది. నీటి అడుగుభాగానికి తల బలంగా తగలడంతో తీవ్ర గాయమై ఆయన అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఇకపోతే ఈయన నిర్మాత మాత్రమే కాదు దేశానికి విశిష్ట సేవలు అందించిన మాజీ సైనికుడు కూడా..
ఆశా భోంస్లే -ఏప్రిల్ 12
ప్రముఖ గాయని , భారతీయ గాన కోకిల, పద్మ విభూషణ్ ఆశాభోంస్లే ఏప్రిల్ 12,2026న ముంబైలోని బ్రీచ్ క్యాండీ హాస్పిటల్లో 92 సంవత్సరాల వయసులో బహుళ అవయవ వైఫల్యం కారణంగా ఆమె తుది శ్వాస విడిచారు.
ఆర్.బి చౌదరి- మే 5
ప్రముఖ టాలీవుడ్ నిర్మాత , సూపర్ గుడ్ ఫిలిమ్స్ అధినేత ఆర్.బి చౌదరి రాజస్థాన్ లో జరిగిన రోడ్డు ప్రమాదంలో మే 5 న హఠాన్మరణం చెందారు. ఈయన ఎవరో కాదు ప్రముఖ సినీ హీరో జీవా తండ్రి.
సంతోష్ కే నాయర్ - మే 5
ప్రముఖ మలయాళ నటుడు సంతోష్ కే నాయర్ రోడ్డు ప్రమాదంలో మే 5న తుది శ్వాస విడిచారు. అప్పటికి ఆయన వయసు 65 సంవత్సరాలు.
కే భరత్ కాంత్ -మే 10
31 సంవత్సరాలు యువ నటుడు , డాన్సర్ , యూట్యూబర్ కే భరత్ కాంత్ హైదరాబాదులోని ఔటర్ రింగ్ రోడ్డుపై జరిగిన రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందారు.
జి హరి - మే 24
ప్రముఖ డిస్ట్రిబ్యూటర్ , డబ్బింగ్ చిత్రాల నిర్మాత జి హరి అలియాస్ నెల్లూరు హరి హైదరాబాదులో గుండెపోటుతో మే 24న కన్నుమూశారు. ఆ సమయంలో ఆయన వయసు కేవలం 47 సంవత్సరాలు కావడం గమనార్హం.
సలీం కుమార్ - జూన్ 6
జాతీయ అవార్డు అందుకున్న ప్రముఖ మలయాళ నటుడు, హాస్యనటుడు సలీం కుమార్ 56 సంవత్సరాల వయసులో కొచ్చిలో జూన్ 6న అనారోగ్య సమస్యలతో తుదిశ్వాస విడిచారు.
భారతీ రాజా:
సీతాకోకచిలుక సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించిన ప్రముఖ తమిళ దర్శకుడు, నటుడు, పద్మశ్రీ అవార్డు గ్రహీత భారతీ రాజా జూన్ 10న చెన్నైలో వృద్ధాప్య సమస్యల కారణంగా కన్నుమూసారు. ప్రస్తుతం ఆయన వయసు 84 సంవత్సరాలు. 16 వయదినిలే, ముతల్ మరియాదై వంటి క్లాసిక్ చిత్రాలకు దర్శకత్వం వహించిన ఈయన మరణం భారతీయ సినీ పరిశ్రమకు తీరనిలోటు అని చెప్పాలి.
