Begin typing your search above and press return to search.

తార‌క్ కోసం మ‌హేష్‌..చ‌ర‌ణ్ ఇలా!

నేడు యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ పుట్టిన రోజు సంద‌ర్భంగా ఒక్క‌సారిగా సోష‌ల్ మీడియా వెడెక్కింది

By:  Tupaki Desk   |   20 May 2024 7:06 AM GMT
తార‌క్ కోసం మ‌హేష్‌..చ‌ర‌ణ్ ఇలా!
X

నేడు యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ పుట్టిన రోజు సంద‌ర్భంగా ఒక్క‌సారిగా సోష‌ల్ మీడియా వెడెక్కింది. టైగ‌ర్ కి అభిమానులంతా గ్రాండ్ గా విషెస్ తెలియ‌జేస్తున్నారు. ఇండస్ట్రీ నుంచి స్టార్ హీరోలంతా శుభాకాంక్ష‌ల‌తో మోతెక్కిస్తున్నారు. ఇంకా తార‌క్ స్నేహితులు..స‌న్నిహితులు..కుటుంబ స‌భ్యులు అంతా త‌మ‌దైన శైలిలో విషెస్ తెలియ‌జేస్తున్నారు. ఈ నేప‌థ్యంలో తాజాగా సూప‌ర్ స్టార్ మ‌హేష్‌..మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ కూడా బ‌ర్త్ డే విషెస్ తెలియ‌జేసారు.

హ్యాపియెస్ట్ బ‌ర్త్ డే టూ మైడియ‌రెస్ట్ తార‌క్ అంటూ చ‌ర‌ణ్‌.. జీవితంలో ఇంకా ఉన్న‌త శిఖ‌రాల‌కు చేరాలంటూ మ‌హేష్ విస్ చేసారు. చ‌ర‌ణ్ ..తార‌క్ తో ఉన్న అనుబంధాన్ని మ‌రింత ప్ర‌త్యేకంగా షేర్ చేసారు. `ఆర్ ఆర్ ఆర్` చిత్రంలోని షూట్ స‌మ‌యంలో తీసిన ఓ ఫోటోని పోస్ట్ చేసాడు. అందులో ఇద్ద‌రు బ్రిట‌న్ కోట‌పై దిగిన ఫోటో అది. ఇద్దరు త‌మ ఆహార్యాల్లో ఉన్నారు. కోట గోడ‌పై చ‌ర‌ణ్ కూర్చుని ఉండ‌గా..కింద నుంచుని ఉన్న తార‌క్ ..చ‌ర‌ణ్ చేతిని ప‌ట్టుకున్న‌ట్లు క‌నిపిస్తున్నారు.

ప్ర‌స్తుతం ఆ పోస్ట్ లు..ఫోటోలు నెట్టింట వైర‌ల్ అవుతున్నాయి. ముగ్గురు హీరోల అభిమానులు వాటిని చూసి మురిసిపోతున్నారు. ఈ ముగ్గురు హీరోల మధ్య ఉన్న స్పెష‌ల్ బాండింగ్ గురించి చెప్పాల్సిన ప‌నిలేదు. ఆ మూడు ఫ్యామిలీలు కూడా అకేష‌న‌ల్ గా క‌లుస్తుంటారు. గెట్ టూ గెద‌ర్ పార్టీలు కూడా ఏర్పాటు చేసుకుంటారు. మ‌రి ఆ ముగ్గురు హీరోలు క‌లిసి ఓ సినిమా చేస్తే ఎలా ఉంటుంది? అన్న ఐడియా కూడా అభిమానుల‌కు వ‌చ్చేస్తుంది.

అదే సాధ్య‌మైతే ఆ త్ర‌యాన్ని చూడ‌టానికి అభిమానుల‌కు రెండు క‌ళ్లు స‌రిపోతాయా? ప్ర‌స్తుతం ముగ్గురు వారి సినిమా ప‌నుల్లో బిజీగా ఉన్నారు. తార‌క్ `దేవ‌ర` షూటింగ్ లో....చ‌ర‌ణ్ `గేమ్ ఛేంజ‌ర్` షూట్ లో ఉన్నారు. ఇక మ‌హేష్ పాన్ ఇండియా ప్రాజెక్ట్ ప‌నుల్లో నిమ‌గ్న‌మ‌య్యారు. తొలిసారి రాజ‌మౌళితో క‌లిసి పని చేస్తోన్న చిత్రం కావ‌డంతో ఏకాగ్ర‌త అంతా ఆ సినిమాపైనే పెట్టి ప‌నిచేస్తున్నారు.