దుబాయ్ ను గట్టిగా మిస్ అవుతున్న సెలబ్రిటీలు..
హైదరాబాద్ లో ప్రజల దృష్టి ఎప్పుడూ సెలబ్రిటీలపైనే ఉండటంతో వారికి పర్సనల్ లైఫ్ అనుభవించడం కష్టమవుతుంది.
By: M Prashanth | 18 March 2026 7:00 AM ISTటాలీవుడ్ సినీ ప్రముఖులకు దుబాయ్ తో ప్రత్యేకమైన అనుబంధం ఉందనే విషయం తెలిసిందే. షూటింగ్ గ్యాప్ వచ్చినా, వీకెండ్ అయినా, లేదంటే కుటుంబంతో కాస్త సమయం గడపాలనుకున్నా చాలామంది సెలబ్రిటీలు దుబాయ్ నే ఎంపిక చేసుకుంటుంటారు. ముఖ్యంగా అక్కడి లైఫ్ స్టైల్, షాపింగ్ ఫెసిలిటీస్, ప్రైవసీ వంటి అంశాలు వారిని ఆకర్షిస్తుంటాయి.
హైదరాబాద్ లో ప్రజల దృష్టి ఎప్పుడూ సెలబ్రిటీలపైనే ఉండటంతో వారికి పర్సనల్ లైఫ్ అనుభవించడం కష్టమవుతుంది. దీంతో చాలా మంది నటీనటులు, దర్శకులు, నిర్మాతలు తరచుగా దుబాయ్ కు వెళ్లి కొంత సమయం గడిపి తిరిగి వస్తుంటారు. అక్కడి లగ్జరీ లైఫ్ స్టైల్, ఇంటర్నేషనల్ రేంజ్ ఫెసిలిటీస్ , ప్రశాంత వాతావరణం వారికి రిలాక్సేషన్ ను ఇస్తాయని చెబుతుంటారు.
అయితే ఇటీవల మిడిల్ ఈస్ట్ దేశాల్లో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు కారణంగా దుబాయ్ కు వెళ్లే ప్రయాణాలు కొంత తగ్గినట్లు తెలుస్తోంది. భద్రతాపరమైన ఆందోళనల నేపథ్యంలో పలువురు సినీ ప్రముఖులు తమ ట్రావెల్ ప్లాన్లను మార్చుకుంటున్నారు. దుబాయ్ కు బదులుగా ఇతర దేశాలను ఎంచుకుంటున్నారు. ప్రస్తుతం సింగపూర్, థాయిలాండ్, వియత్నాం వంటి దేశాలు కొత్తగా ఫేవరెట్ డెస్టినేషన్లుగా మారుతున్నాయి.
ముఖ్యంగా థాయిలాండ్ రాజధాని బ్యాంకాక్ కు ఇటీవల కాలంలో పలువురు సెలబ్రిటీలు వెళ్లినట్లు సమాచారం. దుబాయ్ వెళ్లాల్సిన ఒక స్టార్ ఫ్యామిలీ కూడా చివరి నిమిషంలో తమ ప్లాన్ మార్చుకుని బ్యాంకాక్ వెళ్లినట్లు తెలుస్తోంది. వారు తమ కుటుంబ సభ్యులతో పాటు స్నేహితుల జంటలతో కలిసి ట్రిప్ ను ప్లాన్ చేసినట్లు సమాచారం. మరోవైపు దుబాయ్ రియల్ ఎస్టేట్ మార్కెట్ లో ఇండియన్స్ డామినేషన్ పెరుగుతున్నట్లు తాజా నివేదికలు చెబుతున్నాయి.
అక్కడ ఆస్తులు కొనుగోలు చేసిన వారిలో భారతీయులు సుమారు 22 శాతం ఉన్నారని సమాచారం. ఆ జాబితాలో భారత్ తర్వాత యునైటెడ్ కింగ్డమ్, చైనా, సౌదీ అరేబియా, రష్యా దేశాలకు చెందిన పెట్టుబడిదారులు కూడా ఉన్నారు. యునైటెడ్ కింగ్డమ్ నుంచి 17 శాతం మంది దుబాయ్ లో ఆస్తులు కొనుగోలు చేయగా.. చైనా ప్రజలు 14 శాతం, సౌదీ అరేబియా సిటిజన్లు 11 శాతం, రష్యా పీపుల్ 9 శాతం మంది అక్కడ ఇన్వెస్ట్ చేశారు.
అయితే టాలీవుడ్ కు చెందిన పలువురు ప్రముఖులు ఇప్పటికే దుబాయ్ లో కోట్ల విలువైన లగ్జరీ ప్రాపర్టీస్ కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. అందువల్ల దుబాయ్ తో వారి అనుబంధం మరింత స్ట్రాంగ్ గా మారింది. ప్రస్తుతం పరిస్థితులు సర్దుకుంటే మళ్లీ దుబాయ్ నే తమ ఫేవరెట్ ట్రావెల్ డెస్టినేషన్ గా సెలబ్రిటీలు ఎంచుకునే అవకాశం ఉందని చెప్పడంలో డౌట్ అక్కర్లేదు. మరి చూడాలి ఏం జరుగుతుందో..
