Begin typing your search above and press return to search.

కల్కి - పవన్.. ఇది నిజమైతే మాత్రం..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన పాన్ వరల్డ్ మూవీ కల్కి 2898ఏడీ.

By:  Tupaki Desk   |   17 Jun 2024 4:23 AM GMT
కల్కి - పవన్.. ఇది నిజమైతే మాత్రం..
X

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన పాన్ వరల్డ్ మూవీ కల్కి 2898ఏడీ. ఈ సినిమా జూన్ 27న వరల్డ్ వైడ్ గా ప్రేక్షకుల ముందుకి రాబోతోంది. ఇండియన్ ఫస్ట్ ఫ్యూచరిస్టిక్ కాన్సెప్ట్ చిత్రంగా రాబోతున్న కల్కిపై దేశ వ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. ఇప్పటికే ప్రేక్షకుల ముందుకి వచ్చిన ట్రైలర్ కి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. మూవీపైన ఫ్యాన్స్ కి నమ్మకం పెరిగింది.

కచ్చితంగా కల్కి 2898 ఏడీ మూవీ ఇండియన్ మూవీ స్టాండర్డ్స్ ని హాలీవుడ్ స్థాయిలో రిప్రజెంట్ చేసే సినిమా అవుతుందని ట్రేడ్ పండితులు భావిస్తున్నారు. వైజయంతీ మూవీస్ 600+ కోట్ల బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మించింది. ఇదిలా ఉంటే ఈ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా ప్రీరిలీజ్ ఈవెంట్ గ్రాండ్ గా నిర్వహించబోతున్నారు. ఏపీ క్యాపిటల్ అమరావతిలో కల్కి ప్రీరిలీజ్ ఈవెంట్ కి ప్లాన్ చేస్తున్నారు.

ఏపీలో ప్రభుత్వం మారిన తర్వాత అమరావతి రాజధానిలో జరగబోయే మొట్టమొదటి మూవీ ఈవెంట్ ఇదే కాబోతోంది. ఇదిలా ఉంటే ఈ ప్రీరిలీజ్ ఈవెంట్ కి చీఫ్ గెస్ట్స్ గా ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యణ్ పాల్గొనే అవకాశం ఉందంట. పవన్ కళ్యాణ్ స్టార్ గా కాకుండా అధికారిక హోదాలో పాల్గొనే మొట్టమొదటి సినిమా ఈవెంట్ కల్కిదే అవుతుంది.

ఒకే స్టేజ్ పై యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఉంటే ఈవెంట్ కి నెక్స్ట్ లెవల్ హైప్ వస్తుందని చెప్పొచ్చు. ఫ్యాన్స్ కూడా భారీ ఎత్తున హాజరయ్యే అవకాశాలు ఉన్నాయి. అలాగే నేషనల్ వైడ్ గా ఈ ఈవెంట్ సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్ అవుతుందనే మాట కూడా వినిపిస్తోంది. అయితే సోషల్ మీడియాలో అయితే చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కల్కి ప్రీరిలీజ్ ఈవెంట్ లో పాల్గొంటారనే ప్రచారం నడుస్తోంది.

కానీ చిత్ర యూనిట్ అఫీషియల్ గా ఇంకా ఎలాంటి ప్రకటన చేయలేదు. త్వరలో దీనిపై స్పష్టత రావొచ్చనే మాట వినిపిస్తోంది. ఏది ఏమైనా పవన్ కళ్యాణ్, ప్రభాస్ ఒకే స్టేజ్ పై కనిపిస్తే ఫ్యాన్స్ కి పూనకాలు రావడం గ్యారెంటీ అని చెప్పొచ్చు. ఇది ఎంత వరకు సాధ్యం అవుతుందనేది వేచి చూడాలి.