Begin typing your search above and press return to search.

ఏడాది త‌ర్వాత డ‌ల్లాస్ లో తేలిన బ్యూటీ!

కానీ సోష‌ల్ మీడియాలో మాత్రం యాక్టివ్ గానే ఉందండొయ్. ఎప్ప‌టిక‌ప్పుడు కొత్త ఫోటోల‌తో కుర్రాకారుని అల‌రిస్తుంది. ప్ర‌స్తుతం అమ్మ‌డు డ‌ల్లాస్ లో ఉన్న‌ట్లు తెలుస్తోంది.

By:  Tupaki Desk   |   6 April 2024 10:30 AM GMT
ఏడాది త‌ర్వాత డ‌ల్లాస్ లో తేలిన బ్యూటీ!
X

క్యాథ‌రిన్ ట్రెసా 'వాల్తేరు వీర‌య్య' త‌ర్వాత మ‌ళ్లీ క‌నిపించింది లేదు. ఆ సినిమా విజ‌యం సాధించినా అమ్మ‌డికి అవ‌కాశాలు రాలేదు. అప్ప‌టికే ప్లాప్ ల్లో ఉన్న భామ‌కి బాబి-చిరంజీవి పిలిచిమ‌రీ అవ‌కాశం ఇచ్చారు. కానీ ఆ ఛాన్స్ ని మాత్రం అమ్మ‌డు స‌ద్వినియోగం చేసుకోలేకోయింది. సినిమా విజ‌యం సాధించినా ఇంత‌వ‌ర‌కూ కొత్త ప్రాజెక్ట్ ప‌ట్టుకో లేక‌పోయింది. ముందు న‌టించిన 'మాచ‌ర్ల నియోజ‌క‌వ‌ర్గం' ఫెయిలైనా అంత‌కు ముందు న‌టించిన 'బింబిసార'..ఆ త‌ర్వాత చేసిన 'వాల్తేరు వీర‌య్య' బ్లాక్ బ‌స్ట‌ర్ అయినా ఖాళీగానే ఉంది.

'వాల్తేరు వీరయ్య' రిలీజ్ అయి ఏడాది దాటి పోయింది. ఇంత‌వ‌ర‌కూ కొత్త సినిమా కి సైన్ చేయ‌లేదంటే? క్యాథ‌రిన్ కెరీర్ ముగింపులో ప‌డ్డ‌ట్లేనా? అన్న సందేహాలు మొద‌లైపోతున్నాయి. ప‌దేళ్ల సినిమా కెరీర్ లో అమ్మ‌డు గ్యాప్ తీసుకుంది కేవ‌లం 2021 లోనే..ఆ త‌ర్వాత మ‌ళ్లీ ఎలాంటి గ్యాప్ లు లేకుండా బండి నెట్టుకుంటూ వ‌చ్చింది. కానీ మ‌ళ్లీ ఇప్పుడా వ్య‌వ‌ధి పెరిగిపోతుంటేనే అవ‌కాశాలు రావ‌డం లేద‌నే విమ‌ర్శ‌లు మొద‌ల‌వుతున్నాయి.

దీంతో క్యాథ‌రీన్ ఇప్పుడు ఏం చేస్తున్న‌ట్లు? ఎక్క‌డ ఉంది? అనే సందేహాలు మొద‌ల‌య్యాయి. వాల్తేరు వీర‌య్య రిలీజ్ త‌ర్వాత క్యాథ‌రీన్ హైద‌రాబాద్ లోక‌నిపిచింది లేదు. అలాగ‌ని ఇత‌ర భాష‌ల్లో ఇప్పుడేవైనా సినిమాలు చేస్తుందా? అదీ లేదు. దీంతో క్యాథ‌రీన్ ఇంటికే పరిమిత‌మైన‌ట్లు క‌నిపిస్తుంది. కానీ సోష‌ల్ మీడియాలో మాత్రం యాక్టివ్ గానే ఉందండొయ్. ఎప్ప‌టిక‌ప్పుడు కొత్త ఫోటోల‌తో కుర్రాకారుని అల‌రిస్తుంది. ప్ర‌స్తుతం అమ్మ‌డు డ‌ల్లాస్ లో ఉన్న‌ట్లు తెలుస్తోంది.

అక్క‌డ నుంచి ఓ ఫోటో షూట్ ని నెట్టింట షేర్ చేసింది. అందులో అమ్మ‌డు టైట్ ఫిట్ ప్యంట్ లో...మ్యాచింగ్ ఇన్న‌ర్..బ్లూ జీన్స్ ష‌ర్ట్ ధ‌రించి బాండ్ బ్యూటీలా రెడీ అయింది. క‌ళ్ల‌కి న‌ల్ల‌టి అద్దాలు ధ‌రించింది. వివిధ భంగిమ‌ల్లో కెమెరాకి ఫోజులిచ్చింది. డ‌ల్లాస్ గ్రీన‌రీ అందాల మ‌ధ్యలో ఓ చిన్న చెరువు...ఆ గ‌ట్టున క్యాథ‌రీన్ హోయ‌లు నెట్టింట నెటి జ‌నుల‌తో ఆహా అనిపిస్తున్నాయి. ప్ర‌స్తుతం ఈ ఫోటోలు వైర‌ల్ గా మారాయి.