స్పెషల్ సాంగ్ లో కేథరిన్ హై గ్లామర్ ట్రీట్
ఈ సాంగ్ కోసం ప్రత్యేకంగా రిహార్సల్స్ చేసిన కేథరిన్, ఫిట్‌నెస్ పరంగా కూడా శ్రమించి తన ఫిజిక్‌ను మెయింటైన్ చేసింది.
By: Tupaki Desk | 15 April 2025 4:55 PM ISTగత కొన్నేళ్లుగా తెలుగు సినిమాల్లో బిజీగా ఉన్న కేథరిన్ త్రెసా, తాజాగా తమిళ పరిశ్రమలోకి మళ్లీ అడుగుపెట్టింది. హీరో, దర్శకుడు సుందర్.సి నటిస్తున్న తాజా సినిమా 'గ్యాంగర్స్' లో కేథరిన్ స్పెషల్ సాంగ్ లో మెరిసింది. 'కుప్పన్' అంటూ సాగే ఈ సాంగ్ ప్రస్తుతం సోషల్ మీడియాలో సెన్సేషన్ అవుతోంది. ఇటీవల తమన్నా, రాశి ఖన్నా కాంబినేషన్‌లో రూపొందిన అరణ్మణై 4 లో "అచ్చాచో" పాటకి మంచి రెస్పాన్స్ వచ్చింది.
ఇప్పుడు ఆ ఫార్మూలాను సుందర్.సి మరోసారి వాడేలా కనిపిస్తున్నారు. గ్యాంగర్స్ లో వస్తున్న ఈ సాంగ్ లో కేథరిన్ తన గ్లామర్, ఎనర్జీతో ప్రేక్షకుల మనసు దోచేసింది. సుందర్.సి - వడివేలు కాంబినేషన్ తిరిగి వస్తుండటంతో అంచనాలు భారీగానే ఉన్న ఈ చిత్రానికి ఈ పాట మరింత క్రేజ్ తీసుకొచ్చింది. పాటలోని విజువల్స్ కలర్‌ఫుల్‌గా ఉండగా.. కేథరిన్ డాన్స్ మూవ్స్, ఎక్స్‌ప్రెషన్స్ ప్రత్యేకంగా నిలిచాయి.
ఇంతకాలంగా తమిళంలో కనిపించని ఈ బ్యూటీ.. మళ్లీ అక్కడి ప్రేక్షకుల హృదయాలను దోచేందుకు రెడీ అయ్యింది. మద్రాస్ సినిమాతో తమిళంలో ఎంట్రీ ఇచ్చిన కేథరిన్.. ఆ తర్వాత తెలుగు సినిమాల్లో మంచి గుర్తింపు పొందింది. ఈ సాంగ్ కోసం ప్రత్యేకంగా రిహార్సల్స్ చేసిన కేథరిన్, ఫిట్‌నెస్ పరంగా కూడా శ్రమించి తన ఫిజిక్‌ను మెయింటైన్ చేసింది.
సంగీతం, కొరియోగ్రఫీకి సోషల్ మీడియాలో మంచి ఫీడ్‌బ్యాక్ వస్తోంది. ప్రేక్షకులు ఈ పాటను మళ్లీ మళ్లీ చూస్తున్నారంటే.. కేథరిన్ స్టెప్పుల మ్యాజిక్ పనిచేసిందని చెప్పొచ్చు. గ్యాంగర్స్ సినిమా ఏప్రిల్ 24న విడుదలకు సిద్ధంగా ఉంది. కేథరిన్ సాంగ్ ఈ సినిమా హైలైట్‌గా నిలవనుందని టాక్. ఇప్పటికే ఈ పాట వలన సినిమా మీద మరింత పాజిటివ్ బజ్ క్రియేట్ అయింది.
బాక్సాఫీస్ వద్ద ఈ స్పెషల్ సాంగ్ ఎంతవరకు వర్కౌట్ అవుతుందో చూడాలి. తమిళ పరిశ్రమలో మళ్లీ తన స్థానం సంపాదించాలన్న కేథరిన్ ప్రయత్నానికి ఇది పాజిటివ్ స్టెప్ అనే చెప్పాలి. గ్యాంగర్స్ ద్వారా ఆమె తిరిగి అక్కడ ఫుల్ ఫామ్ లోకి వస్తుందేమో చూడాలి. అలాగే టాలీవుడ్ లో కూడా ఆమె మళ్ళీ పెద్ద సినిమాల్లో ఛాన్సులు అందుకోవాలని ప్రయత్నం చేస్తోంది.