Begin typing your search above and press return to search.

పాపుల‌ర్ ర్యాప‌ర్‌పై అత్యాచారం వేధింపుల కేసు

యువ‌తి వేసిన దావాలో డిడ్డీపై అత్యాచారం, కిడ్నాప్, మానవ అక్రమ రవాణా, మాదక ద్రవ్యాల దుర్వినియోగం, బహిరంగ అసభ్యత వంటి అభియోగాలు ఉన్నాయి.

By:  Tupaki Desk   |   17 Nov 2023 4:48 PM GMT
పాపుల‌ర్ ర్యాప‌ర్‌పై అత్యాచారం వేధింపుల కేసు
X

ప్ర‌ముఖ ర్యాప‌ర్ త‌న‌పై అత్యాచారం చేసాడంటూ గుర్తుతెలియని యువ‌తి ఆరోపించ‌గా దీనిపై సీరియ‌స్ గా పోలీసుల విచార‌ణ సాగుతోంది. స‌ద‌రు యువ‌తి ఆరోపణలపై పోలీస్ డిపార్ట్‌మెంట్ నేర విచారణ సాగిస్తోంది. ర్యాప‌ర్ అసలు పేరు సీన్ కాంబ్స్.. కాగా డిడ్డీగా సుప్ర‌సిద్ధుడు. అత‌డు త‌న ప్ర‌తిభ‌కు మ్యూజిక్ మొఘ‌ల్ గా కీర్తిని అందుకున్నాడు. యువ‌తి వేసిన దావాలో డిడ్డీపై అత్యాచారం, కిడ్నాప్, మానవ అక్రమ రవాణా, మాదక ద్రవ్యాల దుర్వినియోగం, బహిరంగ అసభ్యత వంటి అభియోగాలు ఉన్నాయి. ఎవరు ఈ కేసు వేసారు? ఎవ‌రు ఈ అభియోగాలు నమోదు చేశారు? అనే దానిపై స్పష్టత రాలేదు. దీని వెనుక అతడి మాజీ ప్రియురాలు కాస్సీ వెంచురా ఉన్నట్లు ఇప్పుడు అనుమానిస్తున్నారు.


ప్ర‌స్తుతం న్యూయార్క్ కి చెందిన పోలీస్ శాఖ ఎన్.వై.పి.డి దీనిని ద‌ర్యాప్తు చేస్తోంది. NYPDలో `సీన్ కాంబ్స్` పేరుతో మొత్తం దావా వేసార‌ని చట్ట అమలు అధికారులు ప్ర‌ఖ్యాత‌ TMZకి తెలిపారు. దీనిని యాక్టివ్ కేసుగా ఇంకా నిర్ధారించక‌పోయినా అధికారుల స‌మాచారం ప్రకారం కేసు ఇప్ప‌టికే లాక్ అయింది. ఈ కేసులో సున్నిత అంశాల‌ను దృష్టిలో పెట్టుకుని పరిమిత పబ్లిక్ యాక్సెస్‌తో అత్యంత గోప్యంగా డీల్ చేస్తున్నార‌ని తెలిసింది.

వ్యాజ్యం గురించి NYPD అధికారులు వివ‌రించారు. ``లైంగిక వేధింపులు అత్యాచారం కేసులను NYPD చాలా సీరియస్‌గా తీసుకుంటుంది. బాధితుడు ఎవరైనా పోలీసు రిపోర్టును ఫైల్ చేస్తుంది. తద్వారా మేం సమగ్ర విచారణను నిర్వహించి, ప్రాణాలతో బయటపడిన వారికి మద్దతుగా నిలిచి అవ‌స‌ర‌మైన సేవలను అందిస్తాము`` అని తెలిపారు. ఇంతకు ముందు డిడ్డీపై ఇలాంటి ఫిర్యాదులు చేసిన ఇతర బాధితుల కోసం NYPD వెతుకుతోంది. అయితే 2016లో డిడ్డీ త‌న ప్రియురాలు కాస్సీ నుంచి బ్రేక‌ప్ అయ్యాడు. ఈ బ్రేక‌ప్ హ్యాపీ ఎండింగ్ కాదు. అపఖ్యాతి పాలైన వ్యవహారం కాబట్టి నేటి ఆరోపణల ప్రామాణికత కూడా ప్రశ్నార్థకంగా ఉంది. విచార‌ణ‌ సమయంలోనే కాస్సీ త‌న ప్రియుడు డిడ్డీపై అత్యాచారం- దాడి -మానవ అక్రమ రవాణా స‌హా చాలా కేసులు పెట్టింది. రాష్ట్ర పరిధిలోని పురుష వేశ్యలతో లైంగిక సంబంధం పెట్టుకోమని డిడ్డీ బలవంతం చేశాడని కూడా కాస్సీ ఆరోపించింది.

అయితే ఈ ఆరోపణలను సమర్ధించే ఆధారాలు లేనందున కేసును మూసివేయటానికి ముందు జిల్లా అటార్నీ వరకు వెళ్ళిన ఫెడరల్ అధికారులు దర్యాప్తును ప్రారంభించారు. అలాగే డిడ్డీ త‌ర‌పు న్యాయవాది ఈ ఆరోపణలను పూర్తిగా అర్ధంలేనివిగా పేర్కొన్నారు. కాస్సీ అన్ని ఆరోపణలను హాస్యాస్పదంగా పేర్కొన్న న్యాయవాది, పరిమితుల శాసనం ఆధారంగా ఆమె వాదనలు క్రిమినల్ ప్రాసిక్యూషన్ నుండి నిరోధించబడతాయని చెప్పారు.

అయితే కాస్సీ రేప్ క్లెయిమ్ ఇప్పటికీ కాలిఫోర్నియా కోర్టులో కొనసాగే వీలుంది. అయినప్పటికీ ఆమె ఇప్పటివరకు అక్కడ ఎలాంటి క్రిమినల్ ఫిర్యాదును దాఖలు చేయలేదు. అయితే త‌న‌పై కాస్సీ చేసిన‌ అన్ని ఆరోపణలను ర్యాప‌ర్ డిడ్డీ తీవ్రంగా ఖండించాడు. 30 మిలియన్ డాల‌ర్లు త‌న‌నుంచి వసూలు చేయాల‌ని నాట‌క‌మాడుతున్న‌ట్టు అత‌డు ప్ర‌త్యారోప‌ణ‌లు చేసాడు.