Begin typing your search above and press return to search.

'యానిమల్' రణబీర్‌పై కేసు నమోదు

ఈ వీడియోపై తీవ్ర అభ్యంత‌రాలు వ్య‌క్తం చేస్తూ స్వయం ప్రకటిత సనాతన ధర్మ బోధకుడు సంజ‌య్ తివారీ కేసు న‌మోదు చేసారు.

By:  Tupaki Desk   |   28 Dec 2023 11:03 AM GMT
యానిమల్ రణబీర్‌పై కేసు నమోదు
X

సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం వహించిన యానిమ‌ల్ సంచ‌ల‌న విజ‌యం సాధించిన సంగ‌తి తెలిసిందే. ఈ సినిమా బాక్సాఫీస్ వ‌ద్ద దాదాపు 850 కోట్ల వ‌సూళ్లను సాధించింది. అయితే యానిమల్ అద్భుత‌ విజయాన్ని ఆస్వాధిస్తున్న వేళ ఈ చిత్ర క‌థానాయ‌కుడు, బాలీవుడ్ సూపర్ స్టార్ రణబీర్ కపూర్ న్యాయపరమైన సవాళ్ల‌ను ఎదుర్కొంటున్నాడు. అతడిపై ముంబైలో కేసు నమోదైంది.

రణబీర్ కపూర్ తన భార్య అలియా భట్, కుమార్తె రాహాతో కలిసి కపూర్ కుటుంబం వార్షిక క్రిస్మస్ లంచ్‌కు హాజర‌య్యారు. రణబీర్ కేక్ వెలిగిస్తూ 'జై మాతా ది' అంటూ నినాదాలు చేస్తున్నట్టు పార్టీ నుండి ఒక వీడియో బయటకు వచ్చింది. ఈ వీడియోపై తీవ్ర అభ్యంత‌రాలు వ్య‌క్తం చేస్తూ స్వయం ప్రకటిత సనాతన ధర్మ బోధకుడు సంజ‌య్ తివారీ కేసు న‌మోదు చేసారు. రణ్‌బీర్ కపూర్‌పై ఘాట్‌కోపర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ర‌ణ‌బీర్ కుటుంబానికి వ్యతిరేకంగా IPCలోని వివిధ సెక్షన్‌లను అమలు చేయాలని అధికారులను కోరారు. రణబీర్ మతపరమైన మనోభావాలను కించపరిచారని తివారీ తన ప్రకటనలో ఆరోపించారు.

కపూర్ కుటుంబం ఉద్దేశపూర్వకంగా దేవతలను ఆరాధించేపుడు మ‌ద్యం ఉప‌యోగించింద‌ని, తద్వారా మతపరమైన మనోభావాలను దెబ్బతీస్తోందని ఫిర్యాదుదారు ఆరోపించారు. న్యాయవాది మాట్లాడుతూ, ''మేము ఘట్కోపర్ పోలీసులకు కేసు పెట్టాము.. కేసు నమోదు చేసిన తర్వాత వారితో సమావేశమయ్యాము. రణబీర్ చేసిన పని ప్రజలను బాధించింది. ఎందుకంటే వారు ఒక కర్మ కోసం మద్యం ఉపయోగించారు. వారు జై మాతా ది అని నినాదాలు చేస్తున్నప్పుడు మంటలు వ్యాపించాయి. హిందూ మతంలో అగ్ని జ్వాలాదేవిని సూచిస్తుంది. ఆమె కూడా దేవత. కపూర్ కుటుంబం వార్షిక క్రిస్మస్ లంచ్ వీడియో ఆన్‌లైన్‌లో వైరల్ కావడంతో ఇదంతా ప్రారంభమైంది. రణబీర్ కేక్‌కు నిప్పంటించే ముందు ఎవరో మద్యం పోస్తున్నట్లు ఇందులో క‌నిపించింది. అయితే ఈ ఫిర్యాదు నేప‌థ్యంలో ప్రస్తుతం ఎటువంటి FIR దాఖలు చేయలేదు. సమస్య తాలూకా ఫలితం అనిశ్చితంగా ఉంది. పీఎస్‌లో తదుపరి పరిణామాలు పెండింగ్‌లో ఉన్నాయి.