Begin typing your search above and press return to search.

వేధింపుల కేసు.. ఈ న‌టుడి గొప్ప‌ను కీర్తించ‌డాన్ని ఆపాలి!

మాతృభూమి వెల్ల‌డించిన వివ‌రాల‌ ప్రకారం.. ఇటీవల కోర్టుకు సమర్పించిన దాని ప్రకారం.

By:  Tupaki Desk   |   21 Oct 2024 9:30 AM GMT
వేధింపుల కేసు.. ఈ న‌టుడి గొప్ప‌ను కీర్తించ‌డాన్ని ఆపాలి!
X

మలయాళ నటుడు సిద్ధిఖ్ త‌న‌ను వేధించాడంటూ ప్ర‌ముఖ న‌టి ఆరోపించిన సంగ‌తి తెలిసిందే. ప్ర‌స్తుతం ఈ కేసుపై సుప్రీంలో విచార‌ణ సాగుతోంది. అతడిపై వ‌చ్చిన‌ ఆరోపణలపై కేరళ ప్రభుత్వం ఒక స్టాండ్ తీసుకుంది, భవిష్యత్ తరానికి చారిత్రాత్మక వ్యక్తిగా కీర్తించబడే ముందు నటుడు సిద్ధిఖ్ పై ఉన్న ఆరోప‌ణ‌లు, అత‌డి స్వ‌రూప స్వ‌భావాల‌కు సంబంధించిన‌ పూర్తి నిజాన్ని బయటకు తీసుకురావాలని సుప్రీంకోర్టును కేర‌ళ ప్ర‌భుత్వం కోరింది.

మాతృభూమి వెల్ల‌డించిన వివ‌రాల‌ ప్రకారం.. ఇటీవల కోర్టుకు సమర్పించిన దాని ప్రకారం.. అతనిపై నమోదైన లైంగిక వేధింపుల కేసుకు సంబంధించి సిద్ధిక్‌కు కోర్టు ముందస్తు బెయిల్ ఇవ్వ‌కూడ‌ద‌ని ప్ర‌భుత్వం కోరింది. ప్రజల దృష్టిలో అత‌డు గొప్ప వ్య‌క్తి అని కీర్తించడాన్ని నివారించాలని కోరింది. నటుడు సిద్ధిఖ్ కి ముందస్తు బెయిల్ మంజూరు చేస్తే ఫిర్యాదుదారు తన కేసును ఉపసంహరించుకోవచ్చని భయం ఉంది. ఫిర్యాదుదారు కేసుకు సంబంధించిన పరిస్థితులు చేజార‌కుండా జాగ్రత్తగా చూసుకోవాలని, న్యాయం జరిగేలా చూడాలని కేరళ ప్రభుత్వం కోర్టును అభ్యర్థించింది. అయితే అధికారులు జరిపిన ప్రాథమిక విచారణలో ఇప్పటికే సిద్ధిఖ్ కి సంబంధించిన‌ ఆధారాలు సేకరించారు.

అతడి నిజస్వరూపం బయటపెట్టకపోతే భవిష్యత్తు తరానికి ఆరాధ్యుడు అవుతాడని కేరళ ప్రభుత్వం హెచ్చరిక జారీ చేసినట్లు క‌థ‌నాలొచ్చాయి. విచారణకు సహకరించేందుకు సిద్ధిఖ్‌ విముఖత వ్యక్తం చేసిన నేపథ్యంలో కేరళ ప్రభుత్వం ఈ వాద‌న‌లు వినిపించింది. సుప్రీంకోర్టు నుండి మధ్యంతర బెయిల్ పొందితే సిద్ధిఖ్ నేర‌ పరిశోధకులకు సహాయం చేయడానికి నిరాకరించినట్లు క‌థ‌నం వ‌చ్చింది. ఇది కోర్టుకు సమర్పించిన అధికారిక నివేదికలలో హైలైట్ అయింది.

2016లో సంఘటన జరిగినప్పటికీ ఎనిమిదేళ్ల తర్వాత ఈ కేసు ఫైల్ అయింది. దీనిలో గ‌త‌ విచారణల సమయంలో, ఫిర్యాదు దాఖలు చేయడంలో జాప్యాన్ని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. సంఘటన సమయంలో 21 ఏళ్ల బాధితురాలు ఫిర్యాదు చేయ‌లేక‌పోవ‌డానికి కార‌ణం... సిద్ధిక్ ప్రభావం, మలయాళ చిత్ర పరిశ్రమలోని పవర్ డైనమిక్స్ కారణంగా తాను ఇంతకుముందు ఫిర్యాదు చేయ‌లేక‌పోయాన‌ని స‌ద‌రు న‌టీమ‌ణి తెలిపింది. కెరీర్ మ్యాట‌ర్ కి వ‌స్తే.. సిద్దిఖ్‌ చివరిసారిగా కామెడీ ఎంటర్‌టైనర్ `నునక్కుజి`లో కనిపించాడు.