Begin typing your search above and press return to search.

న‌ల్ల‌గా ఉన్నాడ‌ని నో చెప్పిన నాయిక‌లు!

విజ‌య్ కాంత్ సంచ‌ల‌నాల గురించి తెలిసిందే. సినీ-రాజ‌కీయ రంగాల్లో త‌న‌దైన ముద్ర‌వేసి త‌మిళ‌నాడు ప్ర‌జ‌ల గుండెల్లో నిలిచారు

By:  Tupaki Desk   |   29 Dec 2023 7:30 AM GMT
న‌ల్ల‌గా ఉన్నాడ‌ని నో చెప్పిన నాయిక‌లు!
X

విజ‌య్ కాంత్ సంచ‌ల‌నాల గురించి తెలిసిందే. సినీ-రాజ‌కీయ రంగాల్లో త‌న‌దైన ముద్ర‌వేసి త‌మిళ‌నాడు ప్ర‌జ‌ల గుండెల్లో నిలిచారు. ఇక న‌టుడిగా ఎదిగే క్ర‌మంలో ఆయ‌న చాలా స‌వాళ్లు ఎదుర్కున్నారు. ఈ నేప‌థ్యంలో ఆయ‌న గురించి మ‌రికొన్ని ఆస‌క్తిర సంగ‌తులు తెలుస్తున్నాయి. విజ‌య్ కాంత్ కి ఆరంభంలో సినిమాలు పెద్ద‌గా పేరు తెచ్చిపెట్ట‌లేదు. కానీ 1990 లో రిలీజ్ అయిన 'నీరొట్టం' మంచి గుర్తింపును తెచ్చి పెట్టింది. అయిన‌ప్ప‌టికీ అప్ప‌ట్లో ప‌లువురు స్టార్ హీరోయిన్లు ఆయ‌న‌తో సినిమాలు చేసేందుకు నిరాక‌రించేవారుట‌.

న‌ల్ల‌గా ఉన్నాడ‌ని...ఛీ అని అత‌ను హీరోనా? అత‌ని ప‌క్క‌న నేను న‌టించాలా? అని అప్ప‌ట్లో పేరున్న చాలా మంది హీరోయిన్లు ఆయ‌న‌తో సినిమాలు చేయ‌డానికి అంగీక‌రించ‌లేదుట‌. ఈ విష‌యాన్ని స్వ‌యంగా విజయ్ కాంత్ ప‌లు వేదిక‌ల‌పై చెప్పిన‌ట్లు తెలుస్తోంది. కానీ త‌ర్వాతి రోజుల్లో అలా తిరస్క‌రించిన నాయిక‌లే విజ‌య్ కాంత్ తో న‌టించ‌డానికి పోటీ ప‌డేవారు అన‌డంలో అతిశ‌యోక్లి లేదు. ఆయ‌న స్టార్ డ‌మ్ చూసి ఆయ‌న స‌ర‌స‌న ఒక్క సినిమా అయినా చేయాల‌ని చాలా మంది భామ‌లు క‌ల‌లు క‌నేవారు.

విజ‌య్ తండ్రి ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన 'స‌ట్టం ఒరు ఇరుట్ట‌రై' విజ‌య్ కాంత్ లో చాలా మార్పులు తీసుకొచ్చింది. ఈసినిమా తెలుగు..క‌న్న‌డ‌...మ‌ల‌యాళం..హిందీ భాష‌ల్లోనూ రీమేక్ అయి సంచ‌ల‌న విజ‌యం సాధించింది. దీంతో ఆయ‌న డేట్లు కోసం నిర్మాత‌లు ఆయ‌న వెంట ప‌డేవారుట‌. 'శివ‌ప్పు మ‌ల్లి'...'సాదిక్కొరు నిది' లాంటి సినిమాలు గ్రామీణ ప్రేక్ష‌కుల‌కు మ‌రింత ద‌గ్గ‌ర చేసాయి.

దీంతో మార్కెట్ లో అప్ప‌టికే స్టార్ల‌గా వెలిగిపోతున్న సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్..విశ్వ న‌టుడు క‌మ‌ల్ హాస‌న్ ల‌కు కెప్టెన్ పోటీగా త‌య‌రయ్యారు. పోలీస్..మిల‌ట‌రీ లాంటి పాత్ర‌లు విజ‌య్ కాంత్ ని సూప‌ర్ స్టార్ గా మ‌లిచాయి. ఇక 'కెప్టెన్ ప్ర‌భాక‌ర‌న్' సినిమా త‌మిళ సినిమా రికార్డుల‌నే తిర‌గ‌రాసింది. ఇది ఆయ‌న 100 చిత్రం. ఇప్ప‌టివర‌కూ ఏ హీరో 100వ సినిమా కెప్టెన్ 100వ సినిమా వ‌సూళ్ల రికార్డును బ్రేక్ చేయ‌లేదు.