Begin typing your search above and press return to search.

'సార్‌' సెంటిమెంట్ తో రానున్న కెప్టెన్‌..!

తమిళ స్టార్‌ హీరో ధనుష్ తాజా చిత్రం 'కెప్టెన్‌ మిల్లర్‌' పాజిటివ్‌ రెస్పాన్స్ ను దక్కించుకుంది

By:  Tupaki Desk   |   23 Jan 2024 7:56 AM GMT
సార్‌ సెంటిమెంట్ తో రానున్న కెప్టెన్‌..!
X

తమిళ స్టార్‌ హీరో ధనుష్ తాజా చిత్రం 'కెప్టెన్‌ మిల్లర్‌' పాజిటివ్‌ రెస్పాన్స్ ను దక్కించుకుంది. సంక్రాంతి కానుకగా తమిళనాట విడుదల అయ్యి మంచి వసూళ్లు సాధించినట్లుగా కొన్ని తమిళ మీడియా సంస్థలు రిపోర్ట్‌ చేస్తున్నాయి. సంక్రాంతికే తెలుగు లో కూడా ఈ సినిమా డబ్బింగ్ వర్షన్‌ విడుదల అవ్వాల్సి ఉంది.

తెలుగు సంక్రాంతి సినిమాల పోటీ నేపథ్యంలో డబ్బింగ్‌ సినిమాలను విడుదల చేయలేదు. రిపబ్లిక్ డే సందర్భంగా తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ధనుష్‌ 'కెప్టెన్‌ మిల్లర్‌' సినిమా అన్ని వర్గాల వారిని ఆకట్టుకోబోతుందనే నమ్మకంను ఆయన తెలుగు ఫ్యాన్స్ వ్యక్తం చేస్తున్నారు.

ధనుష్ రఘువరన్‌ తర్వాత 'సార్‌' సినిమా తో తెలుగు రాష్ట్రాల్లో విజయాన్ని సొంతం చేసుకున్నాడు. మళ్లీ ఇప్పుడు కెప్టెన్ మిల్లర్ సినిమాతో హిట్‌ కొట్టబోతున్నాడు అనే విశ్వాసం ను చాలా మంది వ్యక్తం చేస్తున్నారు. అందుకు తగ్గట్లుగానే కెప్టెన్‌ మిల్లర్‌ పై యూనిట్‌ సభ్యులు నమ్మకంగా ఉన్నారు.

సార్ సినిమాను విడుదలకు ముందు రోజే పెయిడ్‌ ప్రీమియర్స్ తో ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చారు. ఇప్పుడు కెప్టెన్‌ మిల్లర్‌ సినిమాను కూడా ముందు రోజే పెద్ద ఎత్తున పెయిడ్‌ ప్రీమియర్స్ తో ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చి సార్ మాదిరిగానే మంచి విజయాన్ని సొంతం చేసుకోవాలని భావిస్తున్నారు.

సార్‌ సినిమా విజయంతో తెలుగు మార్కెట్‌ పరిధి పెంచుకున్న ధనుష్ కెప్టెన్‌ మిల్లర్ కి భారీ ఎత్తున థియేటర్లను దక్కించుకున్నాడు. ఇప్పటికే తమిళనాట రిలీజ్ అయినా కూడా ఈ సినిమాకు తెలుగు ప్రేక్షకుల్లో మంచి బజ్ ఉంది. దాంతో ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్‌ లో దూకుడు కనిపిస్తోంది.