Begin typing your search above and press return to search.

ధనుష్.​​.. పాన్ ఇండియా మెషిన్ గన్​​ పేలుతుందా?

సౌత్​ టు నార్త్​ వయా హాలీవుడ్​లోనూ సినిమాలు చేసిన ధనుశ్

By:  Tupaki Desk   |   29 July 2023 7:00 AM GMT
ధనుష్.​​.. పాన్ ఇండియా మెషిన్ గన్​​ పేలుతుందా?
X

సినిమా బాలేదు.. కానీ హీరో హీరోయిన్ల యాక్టింగ్ సూపర్​' అనే మాట చాలా సార్లు వింటూనే ఉంటాం. 'సినిమా కథ సూపర్​. కానీ హీరోనే బాగోలేదు' అనే మాటల్ని చాలా అరుదుగా వింటుంటాం. ఒకప్పుడు ఈ రెండో కేటగిరీకి చెందినవాడే తమిళ హీరో ధనుశ్​. లుక్‌ చూసి ఇలా ఉన్నాడేంటి అని అనిపించున్న అతడు.. ఇప్పుడు లక్షల మంది అభిమానుల్ని సంపాదించుకున్నారు. హాలీవుడ్‌లోనూ సినిమా చేసే రేంజ్​కు ఎదిగారు.

అలా సౌత్​ టు నార్త్​ వయా హాలీవుడ్​లోనూ సినిమాలు చేసిన ధనుశ్​.. విలక్షణ నటుడిగా మంచి పేరు తెచ్చుకున్నారు. ఆయన సినిమా మంచి వసూళ్లు కూడా వస్తుంటాయి. కానీ ఆయన మిగతా హీరోలతో సమానంగా ఇప్పటివరకు పాన్ ఇండియా స్థాయిలో భారీ బ్లాక్ బాస్టర్​ హిట్​ను అందుకోలేదు. అయితే ఇప్పుడాయన ఎలాగైనా అలాంటి భారీ హిట్​ను అందుకోవాలని పట్టుదలతో ఉన్నారు.

అందులో భాగంగే ప్రస్తుతం కెప్టెన్ మిల్లర్​ సినిమాతో త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. తాజాగా టీజర్​ కూడా విడుదలై అభిమానులను ఆకట్టుకుంది. తుపాకి చేతపట్టి స్వాతంత్ర్యం కోసం పోరాటం చేసిన వీరుడిగా ధనుశ్​ కెప్టెన్ మిల్లర్ పాత్రను పవర్ ఫుల్​గా డిజైన్ చేశారు. ఒకటిన్నర నిమిషం ఉన్న ఈ ప్రచార చిత్రం పూర్తి యాక్షన్ బ్లాక్‌లతో నిండిపోయింది. ఆద్యంతం తుపాకుల మోతే వినిపించింది. ధనుశ్​ అయితే మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ 'మిల్లర్' పాత్రలో అదరగొట్టేశారు. విజువల్​ కట్టింగ్​, బ్యాక్​గ్రౌండ్​ స్కౌర్​, సౌండ్​ డిజైన్​.. ప్రతీది ఫుల్​ మీల్స్ ట్రీట్​ ఇచ్చే రేంజ్​లో ఉన్నాయి.

యాక్షన్ అవతార్‌లో ధనుశ్​ అద్భుతంగా నటించేశారు. ఆయన ఎక్స్‌ప్రెషన్స్ ఎంతో వైల్డ్‌గా గూస్​ బంప్స్​ తెప్పించాయి. ఇక సినిమాలో ఉపయోగించిన వెపన్స్​, అలానే బ్రిటీషర్స్​పై పోరాడే సన్నివేశాలైతే చెప్పడానికి మాటలు కూడా లేనంత రేంజ్​లో చాలా బాగున్నాయి. ఆఖర్లో మిల్లర్‌ ఓ భారీ మిషన్‌ గన్‌తో బ్రిటిష్‌ సైన్యంపై కాల్పులు జరపడం హైలైట్​ గా నిలిచింది. ఫైనల్​గా ధనుశ్​ టెర్రిఫిక్​ స్క్రీన్​ ప్రెజెన్స్​, అలాగే గెస్ట్ రోల్​లో శివా రాజ్​కుమార్​ ఎంట్రీ ప్రచార చిత్రానికే హైలైట్​గా నిలిచింది.

ఇక ఇది చూసిన అభిమానులు సినిమా కంటెంట్​ గ్లోబల్​ వైడ్​లో రీచ్​ అయ్యే విధంగా ఉంటూ కామెంట్లు చేస్తున్నారు. తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళం.. అలాగే అంతర్జాతీయ స్థాయిలోనూ ఆకట్టుకోవడం పక్కా అని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. చూడాలి మరి ఈ సారి ధనుశ్​ స్వాతంత్ర్య పోరాటం.. తొలి భారీ పాన్ ఇండియా సక్సెస్​ను అందిస్తుందో లేదో...