Begin typing your search above and press return to search.

ఈ వైల్డ్‌ డైరెక్టర్‌ ని గుర్తు పట్టగలరా..?

ఇన్ని రోజులు పెద్ద గడ్డం మరియు పొడవాటి జుట్టు తో ఈయన కనిపించేవాడు.

By:  Tupaki Desk   |   6 March 2024 10:36 AM GMT
ఈ వైల్డ్‌ డైరెక్టర్‌ ని గుర్తు పట్టగలరా..?
X

గుండు తో కనిపిస్తున్న ఈ దర్శకుడు చాలా ఫేమస్‌. మన తెలుగు వాడే అయినా కూడా ఈ మధ్య బ్యాక్ టు బ్యాక్ తెలుగు లో రెండు భారీ విజయాలను దక్కించుకోవడంతో అక్కడ మోస్ట్‌ వాంటెడ్‌ దర్శకుడిగా మారాడు. ఇన్ని రోజులు పెద్ద గడ్డం మరియు పొడవాటి జుట్టు తో ఈయన కనిపించేవాడు.

ఆయన తాజా చిత్రం దాదాపు వెయ్యి కోట్ల వసూళ్లు నమోదు చేసిన నేపథ్యంలో తిరుమల శ్రీవారిని దర్శించుకుని ఇలా గుండు చేయించుకున్నాడు. ఇన్నాళ్లు గడ్డం మరియు జుట్టు తో చూసిన ఈయన్ను ఇలా గుండుతో చూస్తే ఎంతటి వారైనా కొన్ని సెకన్ల పాటు గుర్తు పట్టలేక ఎవరా అని చూడటం ఖాయం.

ఇప్పటికే మీకు ఈయన ఎవరో గుర్తు వచ్చి ఉంటుంది. ఔను.. మన సందీప్ వంగ. మన తెలుగు దర్శకుడు.. యానిమల్‌ సినిమాతో బాలీవుడ్‌ ను షేక్ చేసిన మన రౌడీ స్టార్‌ క్రియేటర్ సందీప్‌ వంగ. ఇటీవల తిరుమల శ్రీవారిని దర్శించుకుని గుండు కొట్టించుకున్నారు. గుర్తు పట్టనంతగా మార్పు ఆయనలో కనిపిస్తుంది.

యానిమల్‌ సినిమాతో బ్లాక్‌ బస్టర్ హిట్‌ కొట్టిన దర్శకుడు సందీప్‌ వంగ తదుపరి సినిమా ప్రభాస్ తో అనే విషయం తెల్సిందే. ఇప్పటికే వీరిద్దరి కాంబోలో స్పిరిట్ అనే మూవీ రాబోతున్నట్లు అధికారికంగా ప్రకటన వచ్చింది. త్వరలోనే ప్రీ ప్రొడక్షన్ వర్క్ షురూ అయ్యే అవకాశాలు ఉన్నాయి.

ప్రభాస్ తో స్పిరిట్ మూవీని పూర్తి చేసిన తర్వాత దర్శకుడు సందీప్ వంగ తన యానిమల్‌ సినిమాకు సీక్వెల్‌ గా యానిమల్‌ పార్క్ ను చేయబోతున్నట్లు ప్రకటించాడు. యానిమల్‌ పార్క్ సినిమా కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.