Begin typing your search above and press return to search.

అఖండ 2 ఆ హీరోయిన్ ఫిక్స్ అవ్వొచ్చా..?

తెలుగులో అవకాశాలు సన్నగిల్లాయి అనుకున్న టైం లో కోలీవుడ్ పైన ఫోకస్ చేసిన అమ్మడు అక్కడ టాప్ ప్లేస్ లో కొనసాగింది.

By:  Tupaki Desk   |   23 Feb 2024 4:30 PM GMT
అఖండ 2 ఆ హీరోయిన్ ఫిక్స్ అవ్వొచ్చా..?
X

చెన్నై చిన్నది త్రిష కృష్ణన్ కెరీర్ మళ్లీ ఊపందుకుంది. తమిళ్ లో ఇప్పటికీ అమ్మడు తన ఫాం కొనసాగిస్తుండగా తెలుగులో అమ్మడికి ఆఫర్లు వస్తున్నా కూడా ఎందుకో ఆసక్తి చూపించలేదు. సౌత్ హీరోయిన్ గా సూపర్ క్రేజ్ తెచ్చుకున్న త్రిషకు తెలుగు సినిమాలే తనకు స్టార్ డం తెచ్చి పెట్టాయి. తెలుగులో అవకాశాలు సన్నగిల్లాయి అనుకున్న టైం లో కోలీవుడ్ పైన ఫోకస్ చేసిన అమ్మడు అక్కడ టాప్ ప్లేస్ లో కొనసాగింది. కెరీర్ మధ్యలో కాస్త వెనకబడ్డా కూడా తమిళ్ లో తిరిగి ఫాంలోకి వచ్చింది.


కోలీవుడ్ లో రీసెంట్ గ వచ్చిన పి.ఎస్ 1, 2 సినిమాలతో పాటుగా దళపతి విజయ్ లియో సినిమాల్లో త్రిష గ్లామర్ సినిమాకు చాలా ప్లస్ అయ్యింది. అదే క్రేజ్ తో తెలుగులో కూడా వరుస అవకాశాలు అందుకుంటుంది అమ్మడు. 2015 లో బాలకృష్ణ లయన్ చేసిన త్రిష ఆ తర్వాత తెలుగులో సినిమాలు చేయలేదు. మళ్లీ ఇన్నాళ్లకు అమ్మడు తెలుగు ప్రాజెక్ట్ కి ఓకే చేసింది. మెగాస్టార్ చిరంజీవి విశ్వంభర సినిమాలో త్రిష హీరోయిన్ గా ఓకే అయ్యింది. ఈ సినిమాలో నటించేందుకు గాను త్రిష భారీ రెమ్యునరేషన్ అందుకుంటుందని తెలుస్తుంది.

చిరు సినిమాతో టాలీవుడ్ రీ ఎంట్రీ ఇస్తున్న త్రిషకు ఆఫర్లు క్యూ కడుతున్నాయని తెలుస్తుంది. విశ్వంభర తర్వాత విక్టరీ వెంకటేష్ అనిల్ రావిపుడి హ్యాట్రిక్ మూవీలో కూడా త్రిష హీరోయిన్ గా తీసుకున్నట్టు టాక్. అయితే ఈ విషయాన్ని చిత్ర యూనిట్ అఫీషియల్ గా అనౌన్స్ చేయాల్సి ఉంది. ఈ సినిమాతో పాటుగా మరోసారి బాలయ్య బాబు తో జత కడుతుందట త్రిష. బాలకృష్ణ 109వ సినిమా తర్వాత బోయపాటి శ్రీనుతో అఖండ 2 చేస్తాడని తెలిసిందే.

అఖండ లో ప్రగ్యా జైశ్వాల్ హీరోయిన్ గా నటించగా.. అఖండ 2 లో త్రిషని హీరోయిన్ గా లాక్ చేస్తున్నారని తెలుస్తుంది. అఖండ 2 ప్రాజెక్ట్ ని పాన్ ఇండియా లెవెల్ లో ప్లాన్ చేస్తున్నాడట బోయపాటి శ్రీను. అందుకే ఈ సినిమాకు త్రిష అయితే పర్ఫెక్ట్ అని భావిస్తున్నాడట. ప్రస్తుతానికి విశ్వంభర సినిమాలో మాత్రమే ఓకే అవ్వగా మిగతా సినిమాల నుంచి అఫీషియల్ అప్డేట్ రావాల్సి ఉంది. చూస్తుంటే కోలీవుడ్ తో పాటు టాలీవుడ్ లో కూడా త్రిష తన సూపర్ ఫాం కొనసాగించేలా ఉందని చెప్పొచ్చు.