Begin typing your search above and press return to search.

స్కంద.. అఖండను వేవ్ ను కంటిన్యూ చేస్తుందా?

అఖండ లాంటి బ్లాక్‌బ‌స్ట‌ర్ హిట్ త‌ర్వాత బోయ‌పాటి శ్రీను నుంచి రాబోతున్న చిత్రం స్కంద‌. ఎన‌ర్జిటిక్ స్టార్ రామ్‌ పోతినేనితో.. బోయ‌పాటి మూవీ సెట్ చేయడంతో మొదటి నుంచి మంచి అంచ‌నాలే నెల‌కొన్నాయి.

By:  Tupaki Desk   |   21 Sep 2023 1:26 PM GMT
స్కంద.. అఖండను వేవ్ ను కంటిన్యూ చేస్తుందా?
X

అఖండ లాంటి బ్లాక్‌బ‌స్ట‌ర్ హిట్ త‌ర్వాత బోయ‌పాటి శ్రీను నుంచి రాబోతున్న చిత్రం స్కంద‌. ఎన‌ర్జిటిక్ స్టార్ రామ్‌ పోతినేనితో.. బోయ‌పాటి మూవీ సెట్ చేయడంతో మొదటి నుంచి మంచి అంచ‌నాలే నెల‌కొన్నాయి. అయితే టైటిల్, టీజ‌ర్ వరకు అంచనాలు బాగానే ఉన్నా.. ట్రైల‌ర్ రిలీజ్ తో మారిపోయింది. రొటీన్ స్ట‌ైల్ లో ట్రైల‌ర్ సాగ‌డంతో పెద్దగా బజ్ క్రియేట్ అవ్వలేదు.

అయినప్పటికీ ట్రైలర్ లో రామ్ మాస్ లుక్ చూసిన సినీ ప్రియులు, అభిమానులు ఆశ్చర్యపోయారు. బోయపాటి మార్క్ లో రామ్ ర్యాంపేజ్ యాక్షన్ పక్కాగా కనిపించింది. అలా ఈ ప్రచార చిత్రంతో.. సినిమాలో రామ్ పాత్ర ఎలా ఉండబోతుందా అనేది క్లారిటీగా అర్థమైపోయింది. బోయపాటి మార్క్ యాక్షన్ అఖండ సహా ఇతర సినిమాలు ఎలా ఉంటాయో.. స్కంద కూడా ఫ్యామిలీ డ్రామా ఇతర కమర్షియల్ హంగులతో పక్కా హై ఓల్టేజ్ యాక్షన్ చిత్రంగా ఉండబోతుందని క్లారిటీ వచ్చేసింది.

ఇకపోతే ఈ సినిమా టోటల్ రన్ టైమ్ 167 నిమిషాలు. అంటే 2 గంటల 47 నిమిషాలు. ఇక్కడ మరో విశేషమేమిటంటే.. బోయపాటి గత బ్లాక్ బస్టర్ హిట్ చిత్రం అఖండ కూడా 167 నిమిషాలే ఉండటం విశేషం. అయితే ఈ అఖండలో బాలయ్య డ్యుయెల్ రోల్​లో కనిపించారు. అందులో అఖండ పాత్ర ఎంతటి ఆదరణ పొందిందో తెలిసిన విషయమే. ఇందులో బాలయ్య లుక్, యాక్షన్, డైలాగ్స్ సినిమాకే హైలైట్ గా నిలిచింది. మూవీ సక్సెస్ లో కీలక పాత్ర పోషించింది.

ఇప్పుడు స్కంద రామ్ పోతినేని మాస్ గెటప్ చూస్తున్నా.. అలానే అనిపిస్తోంది. చిత్రంలో రామ్ ఓ వైపు సాఫ్ట్ గా కనిపిస్తూనే మరోవైపు విలన్లను చీల్చి చండాడే పవర్ ఫుల్ మాస్ అవతార్​ లో భయపెట్టేలా ఉన్నాడు. ఈ పాత్రే సినిమాకు బిగ్గెస్ట్ అట్రాక్షన్ గా ఉండబోతుందని అర్థమవుతోంది. మరి అంచనాలకు తగ్గట్టే ట్రైలర్ చూసినట్లు సినిమాలో రామ్ మాస్ పాత్ర ఇంతే ఇంటెన్స్ గా సాగుతుందో లేదో , అంచనాలను అందుకునేలా సినిమాకు విజయాన్ని అందిస్తుందో లేదో చూడాలి..

ఇకపోతే తమన్ మ్యూజిక్ అందించిన పాటలకు కూడా పర్వాలేదనిపించే రెస్పాన్స్ వచ్చింది. అయితే సినిమాపై మరింత హైప్ పెంచేందుకు.. కొత్త ట్రైల‌ర్ రెడీ చేస్తున్నట్లు ప్రచారం సాగుతోంది. ఈ సారి ప్రేక్ష‌కుల‌ను ఆశ్చ‌ర్య‌ప‌రిచేలా ఎలిమెంట్స్ జోడించే ప్ర‌య‌త్నం చేస్తున్నారట. అలాగే రిలీజ్ వీక్‌లోనూ ప్ర‌మోష‌న్లు గ‌ట్టిగా ప్లాన్ చేస్తార‌ట‌. సినిమా ఈ నెల 28న రిలీజ్ కానుంది.