Begin typing your search above and press return to search.

రొమాన్స్ లో పీసీనే శ్రుతిహాస‌న్ బీట్ చేస్తుందా?

'క్వాంటికో' సిరీస్ లో క‌దిలే కారులో పీసీ రొమాన్స్ చేస్తే ...శ్రుతి హాస‌న్ మాత్రం బెడ్ రూమ్ లోనే కావాల్సినంత రొమాన్స్ ని పండించింద‌ని ప్ర‌చారం సాగుతోంది.

By:  Tupaki Desk   |   6 Oct 2023 5:30 PM GMT
రొమాన్స్ లో పీసీనే శ్రుతిహాస‌న్ బీట్ చేస్తుందా?
X

టాలీవుడ్..కోలీవుడ్..బాలీవుడ్ లో అల‌రించిన శ్రుతిహాస‌న్ ఇప్పుడు హాలీవుడ్ లోనూ లాంచ్ అవుతోన్న సంగ‌తి తెలిసిందే. అమ్మ‌డు 'ది ఐ' చిత్రంతో తెరంగేట్రం చేస్తోంది. వైవిథ్య‌మైన పాత్ర‌లు పోషించ‌డం అంటే శ్రుతికి ఎంతో ఆస‌క్తి. ఈనేప‌థ్యంలో హాలీవుడ్ లోనూ అలాంటి అటెంప్ట్ చేస్తోంది. ఈ సైక‌లాజిక‌ల్ థ్రిల్ల‌ర్ లో శ్రుతి హాస‌న్ కి జోడీగా మార్క్ రౌలీ న‌టిస్తున్నారు. ఇందులో ఇద్ద‌రు భార్యాభ‌ర్త‌ల పాత్ర‌లు పోషిస్తున్నారు.

ఇప్ప‌టికే శ్రుతి హాస‌న్ రోల్ ఎలా ఉంటుంద‌న్న‌ది రివీల్ అయింది. ఓ సాహ‌స‌పేత‌మైన పాత్ర‌లోనే క‌నిపిస్తుంది. చ‌నిపోయిన భ‌ర్త అస్తిక‌ల్ని ఓ ద్వీపంలో క‌లిపేందుకు ఒంట‌రిగా ఆమె ఎలా ప్రయాణం చేసింది? భ‌ర్త మ‌ర‌ణానికి కార‌ణం ఎవ‌రు? అనే తెలుసుకునే ప్ర‌క్రియ‌లో ఆమె ఎలాంటి అవ‌రోధాలు ఎదుర్కుంది? అన్న‌ది ఆస‌క్తిక‌రం. ఇది శ్రుతిహాస‌న్ పాత్ర‌కి సంబంధించి ఒక‌వైపు మాత్రం.

నాణేనికి మ‌రోవైపు అన్న‌ట్లు శ్రుతి సినిమాలో రొమాంటిక్ స‌న్నివేశాల్లోనూ చెల‌రేగిందని టాక్. హీరోతో ఇంటిమేట్ స‌న్నివేశాల్లో గ్లోబ‌ల్ స్టార్ ప్రియాంక చోప్రానే మించిపోయిందా? అంటే అవున‌నే ప్ర‌చారం తెర‌పైకి వ‌స్తోంది. శ్రుతిహాస‌న్ భార్య‌పాత్ర‌ని అత్యంత రొమాంటిక్ గానూ మ‌లుస్తున్న‌ట్లు స‌మాచారం. మార్క్ రౌలీతో అమ్మ‌డు ఇంటిమేట్ స‌న్నివేశాల్లోనూ చెల‌రేగింద‌ని కోలీవుడ్ లో గుస‌గుస‌లు మొద‌ల‌య్యాయి.

భ‌ర్త‌తో బెడ్ రూమ్ స‌న్నివేశాలు ర‌క్తిక‌ట్టించ‌డంలో శ్రుతి హాస‌న్ ఏమాత్రం వెన‌క‌డుగు వేయ‌లేదని టాక్ వినిపిస్తుంది. 'క్వాంటికో' సిరీస్ లో క‌దిలే కారులో పీసీ రొమాన్స్ చేస్తే ...శ్రుతి హాస‌న్ మాత్రం బెడ్ రూమ్ లోనే కావాల్సినంత రొమాన్స్ ని పండించింద‌ని ప్ర‌చారం సాగుతోంది. పాత్ర కోసం శ్రుతిహాస‌న్ ప‌రిమితులు విధించే న‌టికాదు. పైగా ఇది హాలీవుడ్ సినిమా కాబ‌ట్టి సినిమాలో ఇంటిమేట్ స‌న్నివేశాలు త‌ప్ప‌నిస‌రని ఎలాగూ తెలుసు.

అన్ని తెలిసిన శ్రుతి హాస‌న్ కొత్త‌గా నో చెప్ప‌డానికి ఆస్కారం లేద‌ని తెలుస్తుంది. మ‌రి ఇందులో నిజ‌మెంతో? ది ఐ రిలీజ్ తోనే క్లారిటీ వ‌స్తుంది. ఈ చిత్రానికి డాప్నే ష్మోన్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. దీంతో పాటు శ్రుతి హాస‌న్ తెలుగులో 'స‌లార్' లో న‌టిస్తోన్న సంగ‌తి తెలిసిందే. డిసెంబ‌ర్ లో ఈ సినిమా ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. అలాగే నాని హీరోగా న‌టిస్తోన్న 'హాయ్ నాన్న‌'లోనూ న‌టిస్తోంది.