Begin typing your search above and press return to search.

కేన్స్ 2025లో టాప్-10 ఇండియ‌న్ సెల‌బ్రిటీలు

కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ 2025 అధికారికంగా ప్రారంభ‌మైంది. ఈ మంగ‌ళ‌వారం నాడు ప్రారంభమై మే 24 వరకు కొనసాగుతుంది.

By:  Tupaki Desk   |   14 May 2025 9:05 AM IST
కేన్స్ 2025లో టాప్-10 ఇండియ‌న్ సెల‌బ్రిటీలు
X

కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ 2025 అధికారికంగా ప్రారంభ‌మైంది. ఈ మంగ‌ళ‌వారం నాడు ప్రారంభమై మే 24 వరకు కొనసాగుతుంది. దాదాపు రెండు వారాల పాటు ప్రపంచ సినిమా, రెడ్ కార్పెట్ ఫ్యాషన్ ఈవెంట్ల‌తో సందడి పీక్స్ కు చేరుకుంటుంది. ప‌లు దేశాల నుంచి ప్ర‌ముఖ స్టార్లు ఈవెంట్లో క్యాట్ వాక్ లు చేయ‌నున్నారు. ఈ సంవత్సరం ఈ ఉత్సవం థీమ్ `లైట్స్, బ్యూటీ అండ్ యాక్షన్`. ఆత్మవిశ్వాసం, స్వీయ-విలువను ఎలివేట్ చేసే ప్ర‌త్యేక‌మైన ఈవెంట్ గా దీనిని చెబుతున్నారు.

ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సెల‌బ్రిటీలు కేన్స్ సంబ‌రాల‌కు హాజరవుతుండ‌గా, భారతీయ ప్రముఖులు కూడా స్క్రీనింగ్‌లు, ప్రీమియర్‌లు, జ్యూరీ పాత్రలలో త‌మ ఉనికిని చాటుకోబోతున్నారు. 2025 కేన్స్ రెడ్ కార్పెట్ కు హాజరైన భారతీయ ప్రముఖుల జాబితా ప‌రిశీలిస్తే.. ఐశ్వ‌ర్యారాయ్ తో పాటు, ఆలియా సంద‌డి చేయ‌నుండ‌డం ఆస‌క్తిని క‌లిగిస్తోంది.

2025 కేన్స్ ఉత్స‌వాల్లో ఐశ్వర్య రాయ్ బచ్చన్ కొన్నేళ్లుగా సంద‌డి చేస్తున్నారు. ఈ ఏడాది ఐష్ సంద‌డి కొన‌సాగ‌నుంది. అలాగే ఆలియా భట్ తొలిసారి రెడ్ కార్పెట్ పై న‌డ‌వ‌నుంది. ఊర్వశి రౌతేలా, జాక్విలిన్ ఫెర్నాండెజ్ గ‌తంలో కేన్స్ కి వెళ్లారు. ఇప్పుడు తిరిగి వస్తున్నారు. షర్మిలా ఠాగూర్, సిమీ గేరే వాల్ ప్రత్యేక ప్రదర్శనకు హాజరయ్యారు. ఇషాన్ ఖ‌ట్ట‌ర్, జాన్వీ కపూర్, క‌ర‌ణ్ జోహార్ లు `హోమ్‌బౌండ్` గ్లోబల్ ప్రీమియర్ కు హాజరయ్యారు. హోమ్‌బౌండ్ డైరెక్టర్ నీరజ్ ఘయ్వాన్ కూడా కార్య‌క్ర‌మంలో పాల్గొంటున్నారు. పాయల్ కపాడియా జ్యూరీ సభ్యురాలుగా ఉన్నారు. నితాన్షి గోయెల్ కేన్స్ లో తొలి ప్రదర్శన ఇవ్వ‌నున్నారు.