Begin typing your search above and press return to search.

దూత డామినేట్ చేసే సత్తా ఉందా..?

లేటెస్ట్ గా నాగ చైతన్యతో కలిసి దూత వెబ్ సీరీస్ చేస్తున్నాడు విక్రమ్ కె కుమార్. నాగ చైతన్యతో మనం, థ్యాంక్యు సినిమాలు చేసిన విక్రం కుమార్ దూత తో మరోసారి వీరి కాంబినేషన్ సత్తా చాటాలని చూస్తున్నారు.

By:  Tupaki Desk   |   25 Nov 2023 3:15 AM GMT
దూత డామినేట్ చేసే సత్తా ఉందా..?
X

థియేట్రికల్ సినిమాల పరంగా ఇదివరకు కన్నా నేషనల్ లెవెల్ లో సౌత్ సినిమాల డామినేషన్ తెలిసిందే. బాహుబలి నుంచి మొదలైన ఈ హంగామా కొనసాగుతూనే ఉంది. బాలీవుడ్ ని దాటి మన సినిమాలు సత్తా చాటగలవు అన్న ఆలోచన వచ్చినా అది సాధ్యపడుతుందని ప్రూవ్ చేసిన దర్శక నిర్మాతలకు హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే. అయితే థియేట్రికల్ సినిమాల్లో బాలీవుడ్ కి ఈక్వల్ రేంజ్ కి వెళ్లిన మనం ఓటీటీ కంటెంట్ విషయంలో మాత్రం వెనుకబడి ఉన్నామని చెప్పడంలో సందేహం లేదు.

ఇదివరకు తో పోల్చితే తెలుగులో కూడా వెబ్ సీరీస్ ల హవా భారీగానే ఉంది. జోనర్ ఏదైనా ఆడియన్స్ ని అలరించడమే టార్గెట్ గా పెట్టుకున్న మేకర్స్ ఓటీటీ ఆడియన్స్ ని అలరించే ప్రయత్నంలో ముందుకెళ్తున్నారు. అయితే వెబ్ సీరీస్ ల విషయానికి వస్తే బాలీవుడ్ మేకర్స్ నెక్స్ట్ లెవెల్ లో ఉన్నారు. అక్కడ రిలీజైన వెబ్ సీరీస్ లకు ప్రేక్షకులు పట్టం కడుతున్నారు. నేషనల్ వైడ్ గా ట్రెండ్ సృష్టించిన వెబ్ సీరీస్ లు ఉన్నాయి.

సౌత్ లో ముఖ్యంగా తెలుగు విషయానికి వస్తే ఆ రేంజ్ వెబ్ సీరీస్ లు రావట్లేదని చెప్పొచ్చు. ప్రొడక్షన్ కాస్ట్.. సీరీస్ మేకింగ్ ఇలా అన్ని పరిగణలోకి తీసుకుంటే వెబ్ సీరీస్ ల విషయంలో బాలీవుడ్ డామినేషన్ కొనసాగుతుంది. అయితే దాన్ని మార్చేందుకు విక్రం కుమార్ నడుం బిగించాడని అనిపిస్తుంది. ఫిల్మ్ మేకర్ గా చేసిన ప్రతి సినిమాతో తన మార్క్ చూపిస్తున్న విక్రం కె కుమార్ మొదటి సినిమానే 13b అంటూ ఒక థ్రిల్లర్ కథతో ఆడియన్స్ ని సర్ ప్రైజ్ చేశాడు.

ఆ తర్వాత తెలుగు, తమిళ భాషల్లో సినిమాలు చేస్తూ వచ్చాడు. లేటెస్ట్ గా నాగ చైతన్యతో కలిసి దూత వెబ్ సీరీస్ చేస్తున్నాడు విక్రమ్ కె కుమార్. నాగ చైతన్యతో మనం, థ్యాంక్యు సినిమాలు చేసిన విక్రం కుమార్ దూత తో మరోసారి వీరి కాంబినేషన్ సత్తా చాటాలని చూస్తున్నారు. విక్రం కుమార్ దూత ట్రైలర్ లేటెస్ట్ గా రిలీజైంది. ఈ ట్రైలర్ చూస్తే తెలుగు సీరీస్ నేషనల్ వైడ్ ట్రెండ్ అయ్యేలా ఉంది.

అమేజాన్ ప్రైమ్ లో త్వరలో రిలీజ్ కాబోతున్న దూత వెబ్ సీరీస్ ట్రైలర్ ఇంప్రెస్ చేయగా సీరీస్ కచ్చితంగా వర్క్ అవుట్ అయ్యేలా కనిపిస్తుంది. నేషనల్ వైడ్ గా దూత సత్తా చాటితే మాత్రం విక్రం కుమార్ పేరు మారుమోగడం ఖాయం.