Begin typing your search above and press return to search.

జాక్.. అందరికంటే ఎక్కువ డ్యామేజ్ ఆయనకే..

కానీ గత కొన్ని సంవత్సరాలుగా ఆయనకు సరైన హిట్ దక్కడం లేదు. తాజాగా విడుదలైన ‘జాక్’ సినిమా పై ఆయన చాలా ఆశలు పెట్టుకున్నారు.

By:  Tupaki Desk   |   14 April 2025 3:00 AM IST
జాక్.. అందరికంటే ఎక్కువ డ్యామేజ్ ఆయనకే..
X

తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలా కాలంగా ఉన్న సీనియర్ నిర్మాతల్లో బీవీఎస్ఎన్ ప్రసాద్ ఒకరు. ఎన్నో సూపర్ హిట్ సినిమాలు నిర్మించారు. ఛత్రపతి, అత్తారింటికి దారేది, తొలి ప్రేమ, ఊసరవెల్లి, నాన్నకు ప్రేమతో.. వంటి సినిమాలు ఆయన ఖాతాలో ఉన్నాయి. కానీ గత కొన్ని సంవత్సరాలుగా ఆయనకు సరైన హిట్ దక్కడం లేదు. తాజాగా విడుదలైన ‘జాక్’ సినిమా పై ఆయన చాలా ఆశలు పెట్టుకున్నారు. కానీ ఆ ఆశలు నిజం కాలేదు.

బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా సిద్ధు జొన్నలగడ్డ క్రేజ్ బాగానే కలిసొస్తుందని అందరూ ఊహించారు. కథ మీద, టైమింగ్ మీద కాన్ఫిడెంట్‌గా సినిమా చేశారు. కానీ సినిమా రిలీజ్ అయ్యాక టాక్ మాత్రం ప్లాప్‌గా మారింది. మొదటి రోజు ఓపెనింగ్స్ బాగానే వచ్చాయి కానీ రెండో రోజే దారుణంగా పడిపోయింది. అయితే ఈ ఫెయిల్యూర్‌లో ఎక్కువ డ్యామేజ్ ఎవరికి అయ్యింది? అనేది అసలు ప్రశ్న.

డైరెక్టర్ భాస్కర్‌కు ఇంకా సపోర్ట్ చేసే ప్రొడక్షన్ హౌస్ లు ఉన్నాయి. హీరో సిద్ధుకి కూడా తెలుసు కాదా, టిల్లు క్యూబ్ లాంటి సినిమాలు లైన్‌లో ఉన్నాయి. కానీ నిర్మాత ప్రసాద్ మాత్రం ఒక్కో సినిమాను ఆచితూచి ఎంచుకుంటూ చేస్తున్నారు. ఇప్పుడు ‘జాక్’ కూడా ఫెయిలయ్యింది అంటే ఆయనకు ఇది పెద్ద నష్టం. ఇక గత కొన్నేళ్లలో ఆయన చేసిన సినిమాలు చూస్తే.. ‘సోలో బ్రతుకే సో బెటర్’, ‘గాండీవధారి అర్జున’, ‘అప్పుడో ఇప్పుడో ఎప్పుడో’ అన్నీ బోల్తా కొట్టాయి.

ఈమధ్య కాలంలో ‘విరూపాక్ష’, ‘తొలి ప్రేమ’ మినహా ఏది నిలబడలేదు. అన్నీ డిజాస్టర్ అవ్వడం నిర్మాతగా ఆయన మీద మార్కెట్‌లో నమ్మకాన్ని తగ్గించింది. ‘జాక్’ షూటింగ్ ఆలస్యం కావడం, బడ్జెట్ ఎక్కువ కావడం, పబ్లిసిటీ బలంగా లేకపోవడం సినిమాకు మరింత నష్టం తెచ్చింది. ఇక నిర్మాతగా ఆయనపై ప్రెషర్ పెరిగింది. తర్వాత సినిమాలకు హీరోలు డేట్స్ ఇవ్వాలంటే నిర్మాత మీద నమ్మకం ఉండాలి. ప్రస్తుతం ఆ నమ్మకం తగ్గినట్టు ట్రేడ్ వర్గాల్లో టాక్ నడుస్తోంది.

సింపుల్‌గా చెప్పాలంటే.. ఒక సినిమా ఫెయిల్యూర్‌ను డైరెక్టర్, హీరో మర్చిపోతారు. వాళ్లకు తర్వాత అవకాశాలు ఉంటాయి. కానీ నిర్మాతకు మాత్రం ప్రతి సినిమా మలుపు లాంటిదే. ఇప్పుడు బీవీఎస్ఎన్ ప్రసాద్ అదే పరిస్థితిలో ఉన్నారు. మరి ‘జాక్’ ఫెయిల్యూర్ ఆయన కెరీర్‌పై ఎంత ప్రభావం చూపుతుందో చూడాలి.