Begin typing your search above and press return to search.

శర్వానంద్ 'మనమే'.. టాక్ ఎలా ఉందంటే..

ఈ సారి 'మనమే'లో ఒక చిన్న పిల్లాడి చుట్టూ కథ తిరుగుతూ, ఎమోషనల్ డ్రామా జోడించి ప్రేక్షకులను మెప్పించే ప్రయత్నం చేశారు.

By:  Tupaki Desk   |   7 Jun 2024 5:07 AM GMT
శర్వానంద్ మనమే.. టాక్ ఎలా ఉందంటే..
X

శర్వానంద్, కృతి శెట్టి జంటగా నటిస్తున్న 'మనమే' సినిమాతో దర్శకుడు శ్రీరామ్ ఆదిత్య ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. 'మనమే' చిత్రాన్ని పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నిర్మించింది. ఈ సినిమా అవుట్ అండ్ అవుట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కింది. ట్రైలర్ విడుదలతో మంచి స్పందన వచ్చింది. తాజాగా సినిమా ప్రమోషన్స్ లో ముందుగానే ఈ కథ గురించి ఒక క్లారిటీ అయితే ఇచ్చారు.

ఇక సినిమాకు సంబంధించిన ప్రీమియర్స్ ను ఇప్పటికే యూఏ సినీ ప్రేక్షకులు చూసేశారు. ఇక వారి నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. మన జీవితం లో జరిగే సంఘటనలను కథాంశంగా తీసుకుని 'మనమే' రూపొందించారని అంటున్నారు. కథలోని సంభాషణలు కూడా బాగున్నాయని ప్రతీ ఒక్కరి జీవితంలో రెగ్యులర్ ఉండే మూమెంట్స్ ఉన్నాయని అంటున్నారు.

తల్లిదండ్రులు, పిల్లల మధ్య ఉన్న భావోద్వేగాలు, నాన్నతో ఉన్న అటాచ్మెంట్, కొడుకుతో ఉన్న అనుబంధం ఈ కథలో మెయిన్ హైలెట్ అని తెలుస్తోంది. పిల్లల పెంపకంలో ఉన్న సరదా, తెలియని ఉద్వేగాలను తెరపై చూపించిన విధానం ఆకట్టుకుంటున్నట్లు చెబుతున్నారు. ముఖ్యంగా శర్వానంద్, కృతి శెట్టి పాత్రలు టామ్ అండ్ జెర్రీ తరహాలో ఉన్నాయనే టాక్ వస్తోంది చెప్పారు.

ఇద్దరి మధ్య జరిగే వాగ్వాదాలు, సరదా సంఘటనలు సినిమాకి హైలైట్ అని వారి కెమిస్ట్రీకి కూడా పాజిటివ్ రియాక్షన్ దక్కుతోంది. శర్వానంద్ గతంలో 'ఒకే ఒక్క జీవితం' సినిమా తో హిట్ కొట్టారు. ఆ కథ కూడా ఫ్యామిలీ ఎమోషన్స్ తో ఉండటం విశేషం. ఈ సారి 'మనమే'లో ఒక చిన్న పిల్లాడి చుట్టూ కథ తిరుగుతూ, ఎమోషనల్ డ్రామా జోడించి ప్రేక్షకులను మెప్పించే ప్రయత్నం చేశారు.

ప్రతి ఒక్కరు ఈ సినిమాకి కచ్చితంగా రిలేట్ అవుతారు. ఫ్యామిలీ ఎమోషన్స్ తో కామెడీ ని జోడించి ప్రేక్షకులకు వినోదాన్ని అందించే ప్రయత్నం చేసినట్లు తెలుస్తోంది. ఇక 'మనమే' చిత్రం ద్వారా శర్వానంద్ మరో హిట్ అందుకోవాలని ఆశిస్తున్నాడు. కృతి శెట్టి కూడా తన పాత్ర ద్వారా ప్రేక్షకులను ఆకట్టుకోవాలని చూస్తోంది. మొత్తానికి యూఎస్ ప్రీమియర్స్ ద్వారా సినిమాకు మంచి టాక్ దక్కింది. అక్కడక్కడా కొన్ని సీన్స్ బోరింగ్ గా ఉన్నప్పటికీ ఫైనల్ గా ఓకే అనేలా మరికొన్ని కామెంట్స్ వస్తున్నాయి. మరి మొత్తంగా మనమే సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుందో చూడాలి.