Begin typing your search above and press return to search.

హృదయాలను గెలిచి మలిచేస్తున్న ముద్దుగుమ్మలు..!

ఒకటి కన్నడ సినిమా కాగా మరొకటి మలయాళ సినిమా. ఈ రెండు సినిమాలు తెలుగులో మంచి ఫలితాలు అందుకున్నాయి. వాటిలో నటించిన హీరోయిన్స్ కు తెలుగు యువత ఫిదా అయ్యారు.

By:  Tupaki Desk   |   18 April 2024 4:16 AM GMT
హృదయాలను గెలిచి మలిచేస్తున్న ముద్దుగుమ్మలు..!
X

తెలుగులో క్రేజ్ తెచ్చుకుంటే చాలు కెరీర్ టర్న్ అయినట్టే అన్న ఫార్ములాని కనిపెట్టేశారు కథానాయికలు అనుకే ఇక్కడ వచ్చిన అవకాశంతో ప్రేక్షకులను మెప్పించేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. గ్లామర్ తో ట్రీట్ ఇచ్చే ఆడియన్స్ కన్నా తెలుగు యువత మనసు గెలవాలంటే మాత్రం అభినయం తో అదరగొట్టాల్సిందే. అలా వారి నటనతో తెలుగు ఆడియన్స్ హృదయాలను టచ్ చేస్తే చాలు వీళ్లే వారిని అందలం ఎక్కించేస్తుంటారు.

అయితే తెలుగులో సినిమాలు చేసిన వారికి మాత్రమే కాదు ఇక్కడ ఒక్క సినిమా కూడా చేయని వారికి కూడా మన ఆడియన్స్ కనెక్ట్ అవుతుంటారు. ముఖ్యంగా యూత్ ఆడియన్స్ అంతా ఏ భాషలో ప్రేమ కథ రిలీజైనా చూసేస్తుంటారు. మన వాళ్లకు ఉన్న ఆసక్తి మేరకు వాటిని మన దగ్గరకు డబ్ చేసి రిలీజ్ చేస్తుంటారు. అలా వచ్చిన సినిమాలే సప్త సాగరాలు దాటి సైడ్ ఏ, సైడ్ బి ఇంకా ప్రేమలు సినిమాలు.

ఒకటి కన్నడ సినిమా కాగా మరొకటి మలయాళ సినిమా. ఈ రెండు సినిమాలు తెలుగులో మంచి ఫలితాలు అందుకున్నాయి. వాటిలో నటించిన హీరోయిన్స్ కు తెలుగు యువత ఫిదా అయ్యారు. సప్త సాగరాలు దాటి హీరోయిన్ రుక్మిణి వసంత్ కు తెలుగులో విపరీతమైన క్రేజ్ ఏర్పడింది. సప్త సాగరాలు దాటి సినిమా తర్వాత ఆమెకు టాలీవుడ్ నుంచి ఆఫర్లు వచ్చినట్టు తెలుస్తుంది. ఇక ప్రేమలు హీరోయిన్ మమితా బైజు అయితే టాలీవుడ్ సరికొత్త సెన్సేషన్ గా మారింది.

ప్రేమలు రిలీజ్ అయిన దగ్గర నుంచి ఆమె సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది. మమితా బైజు మాత్రం ఒకప్పటి తారలు భూమిక, జెనిలియా మాదిరిగా తన క్యూట్ లుక్స్ తోనే కుర్రాళ్లను క్లీన్ బౌల్డ్ చేస్తుంది. ఈ ఇద్దరు తెలుగు స్ట్రైట్ సినిమాలు చేస్తే మాత్రం మన వాళ్లు కచ్చితంగా ఎంకరేజ్ చేసేలా ఉన్నారు. ఇక మరోపక్క బాలీవుడ్ భామ భాగ్య శ్రీ బోర్స్ కూడా సోషల్ మీడియాలో హడావిడి బాగానే చేస్తుంది.

మాస్ మహరాజ్ రవితేజ తో మిస్టర్ బచ్చన్ సినిమాలో నటిస్తున్న అమ్మడు వరుస ఆఫర్లు అందుకుంటుందని తెలుస్తుంది. ప్రస్తుతం తెలుగులో ఈ ముగ్గురు భామల గురించి ఎక్కువ హడావిడి జరుగుతుంది. భాగ్య శ్రీ ఆల్రెడీ తెలుగులో ఆఫర్లు అందుకుంటుండగా రుక్మిణి, మమితాల తెలుగు ఎంట్రీ కోసం ఫ్యాన్స్ అంతా ఈగర్ గా ఎదురుచూస్తున్నారు.